పెళ్ళాం ఊరెళితే……
:
లేఖిని వాడండి. కూడలి బ్లాగులు వ్రాయండి. తెవికి ని చూడండి.
:
కొండలు నిర్మించబడతాయి ఇలా.
రోజుకు మూడు బీర్లు తాగి సోఫా మీద వేసి
తాగేసిన టీ కప్పులు సింకులోకి విసిరేసి
వదిలేసిన బట్టలు గుట్టగా పడేసి
ఇంటికొచ్చిన ఉత్తరాలు చింపి పోసి
ఇంకా అడ్డూ ఆపు లేకుండా
అన్ని రూముల్లో ఒకే చానల్ పెట్టుకొని ఇల్లంత తిరగొచ్చు. నో చక్రవాకం, నో లక్ష్మి, నో ఝాన్సీ…నో సీరియెల్స్. నో వంటా వార్పూ చానెళ్ళు.
షేవింగ్ చేసుకునేప్పుడు కొళాయి తిప్పెయ్యొచ్చు నిరంతరంగా.
టూత్ పేస్టు మూత ఒపెన్ చేసి పెట్టచ్చు.
పాలు ఎన్ని సార్లయిన పొంగించొచ్చు బర్నర్ మార్చుకుంటూ.
ఆహా ఏమి హాయిలే.
:
8 comments:
ఇప్పుడు ఆ హాయిని అంతా మీరు అనుభవిస్తున్నారా ఏమిటి?అయినా సీనుగాడు,అతని భార్య ఇద్దరూ కలిసేగా ఇండియా బయల్దేరేది?
అదేమరి తాత్కాలిక ఆనందం అంటే. పెళ్ళాం వచ్చాక చిత్ర విచిత్రంగా తిడుతూ ఇల్లంతా శుభ్రం చేయిస్తే పులుసు కారుతుంది. హన్నా..........
నేనయితే చక్కగా ఎత్తిన పుస్తకం దించకుండా చదువుకుందును.
చూడాలనుకున్న సినిమాలన్నీ నెట్‌ఫ్లిక్స్ ఆక్కౌంటు తెరిచేసి రోజుకు రెండు చొప్పున చూసేద్దును.
ఎప్పొడొచ్చి చూసేస్తుందో అని దొంగచాటుగా కూడలి చూడక్కర లేకుండా బహిరంగంగా చదువేద్దును.
ఒక్కరోజు వండిందే వారం రోజులు తినేద్దును.
--ప్రసాద్
http://blog.charasala.com
హహహ... ఏంటి మీరేమన్నా మారీడ్ బాచిలర్ స్టేటస్ పొందారా ఏమిటి ? మీ ఆవిడ గానీ పుట్టింటికి వెళ్ళారా ?
వచ్చాక ఉంటుంది లేండి.
రెండు మూడు రోజులు బానే ఉంటుంది. ఈ సామ్రాజ్యం ఇక నాదే అనుకుంటాము. నాలుగో రోజు నుంచి తిరిగి ఎప్పుడొస్తుందా అని ఎదురు చూపులు. సెల్ ఫోనులో సిల్లీ ఊసులు, విరహ వేదనలు ....
తీరా వచ్చేసాక, మళ్ళీ గొడవలు, అలకలు... మాములే
కొల్లూరి సోమ శంకర్
www.kollurisomasankar.wordpress.com
పెళ్ళం, బిడ్డలు ఊరెళ్ళితే బోలెడు టైం ఉంటుంది, చాలా పనులు చేసుకోవచ్చు అనుకునేవాడిని. అది కేవలం అజ్ఞానమని స్వీయానుభవం. వాళ్ళు ఊళ్ళో ఉన్నప్పుడే పనులు, ప్రోజెక్టులు చకచకా అవడం అనుభవైకవేద్యం. వాళ్ళులేనప్పడు ఏచానెల్ చూడాలో, ఏం తినాలో - అన్నీ సందిగ్దాలే. :))
ఏం తినాలో - అన్నీ సందిగ్దాలే. :))
అప్పడాల కర్రలు,తన్నులైతే కాదు కదా :P
@ రాధిక గారు,
అవును మరి. సీనుగాడు కలిసే వెళతాడు ఇండియాకి.
@ జ్యోతక్కా,
తనొచ్చిన తరువాత రెండు రోజులు నా మకామా ఆఫీసులోనేగా :-)
@ ప్రసాద్,
మన దగ్గర అన్ని బుక్కులు లేవుగా :-)
@ ప్రవీణ్,
అవును. పుట్టింటి వారందరూ వున్న చోటుకే. కాకపోతే అది అమెరికాలోనే.
@ సోమశేఖర్ గారు,
మరీ అన్నీ నిజాలే చెప్పేస్తే ఎలాగండి. మీరు చెప్పింది అక్షరాలా నూరు వరహాల నిజం.
@ సత్య సాయి గారు,
అదీ నిజమే మన పన్లు బాగానే నడుస్తాయి ఇల్లంతా సందడిగా ఉత్సాహంగా వుంటే. అనుభవ్జ్ఞులు మీరు చెప్పింది కూడా కరక్టే.
@ ఎసెస్వీ,
అవును బర్గర్ కింగుకు వెళ్ళాలా, పీట్జా హట్ కు వెళ్ళాలా అని. అప్పడాల కర్రలు బయటకు చెప్పరు :-)
-- విహారి
Post a Comment