Friday, March 02, 2007

కొలరాడో ఉగాది ఉత్సవాలు -- 'గజల్ శ్రీనివాస్'

ఇందు మూలంగా సకల జనులకు తెలియ చేయడమేమనగా ఇక్కడ అనగా డెన్వర్ మహా నగరం, కొలరాడో రాష్ట్రం లో ప్రతి ఏటా జరిగే తెలుగు ఉగాది ఉత్సవాలు ఈ నెల 24 న జరప తలపెట్టినారు. వీటిని కొలరాడో తెలుగు సంఘం వారు జరుపుతున్నారు.

మీరు ఇక్కడ వున్న ఎడల లేదా ఆ రోజు ఇక్కడ ఉన్న ఎడల లేదా మీ బంధు..బంధు..బంధువులు ఉన్న ఎడల లేదా మీ మిత్ర..మిత్ర..మిత్రులెవరైనా వున్న ఎడల ఈ టపా ను ఆసాంతం చదవలసిందిగా ప్రార్థన.

(అక్కడే లంకెట్టా నేను. నేను మీ మిత్రుడైతే మీరు చచ్చినట్టు చదవాల్సిందే....అబ్బో ఈ మధ్య నాకు భలే తెలివొచ్చేస్తోంది..సెభాష్ సెభాష్. భుజం మీద)

ఏ ఏటి కా ఏడు నాణ్యమైన కార్యక్రమాలను ఇక్కడి తెలుగు వాళ్ళకు అందిస్తున్నారు కొలరాడో తెలుగు సంఘం వారు. ప్రతి సంవత్సరం ఉగాది, దీపావళి మరియు పిక్నిక్ లే కాకుండా అప్పుడప్పుడూ ఉచితంగా కళా కారుల ప్రదర్శనలు మరియూ తెలుగు సినిమాలను కూడ అందిస్తున్నారు. ప్రతి ఉగాది కి, దీపావళికి సాంస్కృతిక కార్యక్రమాల తో పాటు షడ్ర సోపేతమైన కమ్మని భోజనం కూడా అతిథులకు ఇస్తున్నారు. పిక్నిక్ అప్పుడు ఆటపాటలతో పాటు వివిధ రకాల బహుమతులు కూడా ఇస్తారు. పీట్జా ల తో పాటు పెరుగన్నం అందించడంలో ఈ సంఘానికి సాటి మరెవ్వరూ లేరు.

కేవలం నామమాత్రపు కుటుంబ సభ్యత్వం తో ఇంటిల్లి పాదికి ఇన్ని అందజేస్తున్న తెలుగు సంఘం బహుశా అమెరికాలో మరెక్కడా లేదంటే అతి శయోక్తి కాదేమో.

ఇన్ని వున్న ఈ తెలుగు సంఘ కార్య క్రమాల్ని చూడ్డానికి ఒక్క సారి విచ్చేయండి. అది కూడా ఈ మన తెలుగు ఉగాది కోసం. చిన్న పిల్లలకు "పద్య పఠనం" తో పాటూ ఈ సారి "ఉగాది కవితల పోటీ" పెడుతున్నారు. ఎవరైనా ఈ పోటీలలో కానీ లేక ఏవైనా సంస్కృతిక కార్యక్రమం లో కానీ పాల్గొన దలచుకుంటే మీరు కొలరాడో తెలుగు సంఘం సాలెగూడుకు వెళ్ళి మీ వివరాలని నమోదు చెసుకోవచ్చు లేదా cotelugu@yahoo.com అనే ఈ-చిరునామా కు ఉత్తరం పెట్టొచ్చు.


ప్రత్యేకం.. ప్రత్యేకం : ఈ సారి మన సుమధుర గజల్ గాయకులు 'గజల్ శ్రీనివాస్' గారు ఇక్కడి తెలుగు జనులను ఉర్రూతలూగించడానికి ఈ ఉగాదికి ఇక్కడికి విచ్చేస్తున్నారు. (ఈ ఒక్క ముక్క ముందే చెప్పుంటే ఈ సంఘం గురించి గొప్పలు చెప్పే బాధ తప్పేదేమో)


ఎవరైనా తమ బిజినెస్ కు పబ్లిసిటీ కావాలనుకుంటే ఈ సాంవత్సరిక డైరెక్టరీలో ప్రచురించుకోవచ్చు. దానికి అడ్వర్టజెమెంట్ పరిమాణము బట్టి ధర వుంటుంది


బ్లాగు సోదర/సోదరీమణులకు,


మీరు ఈ ఉగాది కార్యక్రమాలకు ఏవైనా సలహాలు ఇవ్వాలనుకుంటే ఇవ్వవల్సిందిగా అభ్యర్తిస్తున్నాను. ఏదైనా కార్యక్రమం వుంటే బాగుంటుందనుకుంటే వెంటనే రెండు ముక్కలు లేదా నాలుగింతలు ముక్కలు వ్రాయండి.

ఈ సారి మన తెలుగు బ్లాగు గురించి "సాంవత్సరిక డైరెక్టరీ" లో ఒక వ్యాసం రాయలనుకుంటున్నాను.


అబ్బో అబ్బో
తెలుగు సంఘ విహారి.

2 comments:

cbrao said...

Ice cream ఎన్నో flavours లో లభ్యమైనట్లు, విహారి కి అన్ని ఆహార్యాలన్న మాట. బ్లాగులలో మమ్మల్ని నవ్వించటమే కాక ఇలా సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ కూడా సమర్ధవంతంగా చెయాలని కోరుకుంటాను. చావా కిరణ్ వివాహ చాయా చిత్రాలు Flickr లో 'favourite' గా add చేసుకొంటే చూడొచ్చని తెలిసింది.

Dr.Pen said...

అదే చేత్తో ఓ 'టిక్కెట్టూ'ఇచ్చేస్తే...రైల్లోనో, ఇమానంలోనో ఇట్టే వచ్చేయనూ:-)