ధ.దే.ఈ.శు. మా పండు గాడి జోకు
చాలా కాలమయింది అని ఓ రోజు మా వాడికి తెలుగు అక్షరాలు దిద్దిద్ధామని వాడిని పిలిచి చెప్పా.
“పండూ, ఓ సారి లాఫ్ట్లో కెళ్ళి రైటింగ్ ప్యాడ్ తీసుకురా నీకు తెలుగు అక్షరాలు నేర్పిస్తా” అని.
వాడు ఎంతకీ వెళ్ళకుండా అక్కడే వుండి ఆడుకుంటున్నాడు. మరో సారి వాడిని పిలిచి గట్టిగా అడిగా
“ఎందుకురా వెళ్ళలేదు” అని.
దానికి వాడు “మై లెగ్ ఈజ్ థింకింగ్ అండ్ ఇట్ డిడ్ నాట్ టెల్ మీ టు గో” అన్నాడు.
అంటే వాడి ఉద్ధేశ్యం ఇంకా ఆలోచిస్తున్నా అని.
“అలా కాదు నాన్నా, థింకింగ్ చేసేది లెగ్ కాదు హెడ్డు” అని చెప్పా.
వాడు సరే అని బుర్రూపాడు గోడ గడియారం లో గంట లాగా.
ఇంకో రోజు అడిగా “నాన్నా! వెళ్ళి నీ రైటింగ్ బోర్డ్ తీసుకొని రా” అని.
వాడు వినిపించికొని కూడా వెళ్ళ లేదు.ఈ దేశంలో మనం ఇరగ దీసే సీను లేదు.
భారత్ లో అయితే వంశ పారం పర్యంగా కొడుకులు నాన్నల చేత తన్నించుకుంటారు.దానికి
ఇక్కడ పులుస్టాప్ పెడతాం. సరే అని దగ్గరకు పిలిచి అడిగా
“ఏంటి సంగతి ఎందుకు వెళ్ళలేదు” అని. దానికి సమాధానం.
“నాన్నా! మై హెడ్ ఈజ్ స్టిల్ థింకింగ్ అండ్ ఇట్ డిడ్ నాట్ టాక్ టు మై లెగ్ ఎట్”.
తెలుగు నాన్న బోల్తా పడ్డాడు.
5 comments:
దీన్నే అంటారు మెడకీ మోకాలుకీ ముడెయ్యడమని :-)
ఓర్చండి స్వామీ, ఇంకెన్ని థింకింగ్ బాడీ పార్ట్స్ తో పనుందో!
తాడి తన్నేవాడుంటే తల దన్నేవాడంటే ఇదే మరి. పిల్లలా మజాకా???
మీ ఓడు మంచి కత్తే. కానీ కొద్దిగా పట్టు పట్టయినా తెలుగు నేర్పిస్తుండండి.
మీరే కాదు మీ వాడూ మంచి జోకులేస్తాడులా వుంది :)
--ప్రసాద్
http://blog.charasala.com
మరెలా!! :))
Post a Comment