Saturday, April 28, 2007

2009 లో APPSC పరీక్షా పత్రం

పది ప్రశ్నలు ఒకే సమాధానం.

1. అంధ్రప్రదేశ్ లో ఎక్కువ మంది ధనికులు వున్న జిల్లా ఏది?

2. అంధ్రప్రదేశ్ లో ధనిక జిల్లా ఏది?

3. అయిదు సంవత్సరాల ముందువరకు సైకిల్ కూడా లేని వ్యక్తులందరూ స్కార్పియో లలో తిరుగుతున్న వాళ్ళు వున్న జిల్లా ఏది?

4. తమ ప్రాంతం లో కాకుండా జార్ఖండ్ వంటి ప్రాంతాలకు కూడా విస్తరించి ప్రాజెక్టు పనులు చేస్తున్న వారు వున్న జిల్లా ఏది?

5. 'అబ్బాయ్' వున్న జిల్లా ఏది?

6. ప్రాజెక్టు మొదలు పెట్టిన తొమ్మిది నెలల్లోనే రైతులకు నీళ్ళు అందించబడిన జిల్లా ఏది?

7. ఏ జిల్లా లో మెడికల్ కాలేజి కోసం వున్నపళంగా ప్రొఫెసర్లు, డాక్టర్లూ తరలించబడ్డారు?

8. ఏ జిల్లా పేరు చెబితే హైదరాబాద్ లో పనులు చక్క బడి పోతాయి?

9. ఏ జిల్లా వ్యక్తి వరసగా అయిదు సంవత్సాల పాటు కాంగ్రేసు ముఖ్య మంత్రి గా పనిచేశారు?

10. నేను ఈ జిల్లా వ్యక్తి నయుంటే ఈ పరీక్షలకు పెద్దగా చదువుకునే అవసరం లేదు అనుకుంటున్నార? అయితే ఆ జిల్లా పేరేంటి?


గమనిక: ఇది ఏ జిల్లా వారినీ కించపరచడానికి రాసినది కాదని మనవి చేసుకుంటున్నాను.

11 comments:

Dr.Pen said...

మీ టపా చూస్తోంటే మా బాసు గారి పాట...
"ఏ జిల్లా...ఏ జిల్లా...పిల్లా నీది ఏ జిల్లా?"
గుర్తొస్తోంది!(ప.న.)

ఇక సమాధానం..."రానారె జిల్లా?"

oremuna said...

మొదటి మూడు చదివి, ముఖ్యంగా స్కార్పియోలు -- భాగ్య నగర్ అనుకున్నా, కానీ తరువాత రానారే అని అర్థం అయింది

కామేష్ said...

అవునూ ! నాకో అనుమానం. ఈ జిల్లాలో బహిరంగ వేలాల్లో 'అబ్బాయ్' తప్ప ఇంకెవరూ పాల్గోటం లేదేమి. అది కూడా, 'బాబాయ్' (కేవలం ప్రాస కోసమే, నిజానికి నాయన అనాలేమో) నిర్ణయించిన ధరకే పాట పాడటం చిదంబర రహస్యంగా లేదూ? దీనిపై కూడా మంచి టపా కోసం ఎదురు చూస్తూ ...

కామేష్ said...

అయినా, ప్రశ్నపత్రం ముందే లీక్ చెయ్యడానికి నేనొప్పుకోను... నేనొప్పుకోను... నేనొప్పుకోనంతే..

జ్యోతి said...

అన్ని ప్రశ్నలకి ఒకటే సమాధానం. నువ్వు చెప్పకున్నా ప్రతి వెదవ రాసేస్తాడు. మరి అందరిని పాస్ చేస్తారా. లేక ఆ జిల్లా వాళ్ళనేనా??ఇంతోటి దానికి పరీక్ష ఎందుకో?

రానారె said...

ప్రశ్నపత్రం చివర "గమనిక" బాగుంది. మ్‌మ్‌మ్...
గమనిస్తాం.

రాధిక said...

రానారే పైవాటి అన్నిటితోనూ ఏకీభవిస్తున్నట్టేనా?అయినా విహారిగారి గారు ఇలా ప్రశ్నా పత్రాల పేరు చెప్పి నిజాలు చెప్పేస్తు,మా చేత కూడా నిజాలు చెప్పించేస్తున్నారేమిటి?

Naga said...

పడక?

రానారె said...

సరసాదేవిగారొకరే అనుకున్నాను. ఇంతమంది కుట్రపన్నుతున్నారని 'నాకు తెలీదే'?

One Stop resource for Bahki said...

నేనుAPPSC Mains పాసు అయ్యాను కాని , interview దాకా రాలేదను కోండి బహుశా ఈ ప్రశ్న 2005 లోరాలేదు ,ఉప్పదించారు కదా ఇక ....Next ...

Anonymous said...

@ ఇస్మాయిల్ గారూ,

మీ బాసు సినిమా ఇంద్ర బ్యాక్ డ్రాప్ అదే గా.

@ చావా గారూ,

కనిపెట్టేశారు.

@ కామేష్ గారూ,

బాబాయ్ అంతటి వాడు వున్నడు గా తోడుగా. ఆయన అనుమతి లేనిదే ఏదీ జరగదు.

మీరు ప్రతిపక్షం లా మాట్లాడకూడదు. మీకు మైకు ఇవ్వరు :-)

@ జ్యోతక్కా,

నీకు ఫెయిల్ మార్కులు. నిన్ను డీబార్ చేస్తున్నా :-) కమిషన్ నే ఎగతాళి చేస్తారా ఆయ్.

@ రానారె గారూ,

మీ జిల్లా జిందాబాద్. అంతే. నో గమనికలు ప్లీజ్ :-)

@ కాశ్యప్ గారూ,

ఈ సారి ఇంటర్వ్యూ కు మాత్రమే వెళ్ళండి. పరీక్ష రాయడానికి నా దగ్గరకు రండి. అంతే చాలు.






విహారి