బ్లాగదాభి రామ బ్లాగర - 1
బ్లాగ లేని చోట బ్లాగరి అనరాదు
చిన్న టపానయిన గొదువ గాదు
చిలిపి యుద్ధమందు బ్లాగ్గుంపు ఉండదా
బ్లాగదాభి రామ బ్లాగర విహారి
నా ఈ పద్యాన్ని ఇంకా రాబోయే ఎన్నో పద్యాలను ఎవరో కాపీ చేశారని విన్నాను. నా పద్యాలు మూలన పడక ముందరే నేను కాపీ రైట్ల కోసం ప్రయత్నిస్తూ అవసరమైతే మీరు సాక్షులుగా నిలబడతారనే ఆశ తో రాస్తున్నాను. ఇక ఊరుకుంటే లాభం లేదు మొన్న రానారె నేడు సొపేటి ఇలా బ్లాగేస్తున్నారు.
సొపేటి గారు రాసిన దాన్ని చూసి వచ్చిన స్పందన ఇది :-) ఏదో సరదాకి రాశా :-)
ఆ.వె.:అనువుగాని చోట నధికులమనరాదు
కొంచమయిన నదియు గొదువ గాదు
కొండ యుద్ధమందు గొంచమై యుండదా
విశ్వదాభి రామ వినుర వేమ
7 comments:
అసలు ఇలాంటి టపాని మొదట మీ నుండే ఆశించాను నేను.సోపేటి గారి పోస్టు చూడగానే మొదట నాకు గుర్తొచ్చింది మీరే. భలె రాసారులే.
హ హ్హ హ్హా...
నాయనా విహారి ఇది నా పద్యం ...నా డైరీలో రాసుకున్న దానిని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తావా???పైగా నేనే రాసా అంటావా..మర్యాదగా నా పేరు పెట్టేయ్ లేదా నా బ్లాగులో చిన్న సీమటపాకాయలాంటి టపా రాసేస్తా...ఒక్కరోజు టైమిస్తున్నా>
ఇది ఏ ఫోజులో కూర్చుని రాసారు?
:))) (ఫకాల్)
@ రాధిక గారూ,
ధన్యవాదాలు.
@ నాగరాజు గారూ,
:-)
@ జ్యోతక్క,
ముందు ఆ డైరీ ఇంట్లో వుందో లేదో చూసుకో. ఈ 'నాయనా విహారి ' మాయల విహారి అయిపోయి దాన్ని కొట్టుకొచ్చేశాడు :-)
@ సుధాకర్ గాౠ,
అనుకుంటూనే వున్నా ఇంకా ఎవరూ ఆ ప్రశ్న వెయ్యలేదేంటి అని. ఈ టపా లన్నీ మా ఇంటి వెనకలున్న ఆస్పిన్ చెట్టుకింద కూర్చుని రాస్తున్నా. డ్రెస్ కోడ్ గురించి మాత్రం అడక్కండే.
@ రానారె,
నేను :)))) :)))) రెండింతలు ఫకాల్.
-- విహారి
వేమన శతక పద్యాల్లా ఈ బ్లాగు పద్యాలు చితక ఉతికేస్తూ బహు బాగున్నాయ్. అందరూ తలో పద్యం చందా వేసి బ్లాగు శతకం తయారు చేస్తే బాగుంటుందేమో... కాస్త ఆలోచించండ్రీ...
Post a Comment