ఎవరు చెప్పారు?
మాట్లాడే వయసు వచ్చినప్పుడు ఏదన్నా చెప్పాలంటే మా అమ్మ చెప్పింది అంటాం.
అలాగే స్కూలుకు వెళ్ళే వయసులో మా టీచరు చెప్పింది/చెప్పాడు అంటాం.
కాలేజీ వయసులో మా ఫ్రెండు చెప్పాడు అని.
ఉద్యోగమొచ్చాక మా బాసు చెప్పాడు అని అంటాం.
తరువాత పెళ్ళయ్యాక
.....................
.....................
.....................
మా ఆవిడ చెప్పింది.. మా ఆవిడ చెప్పింది..మా ఆవిడ చెప్పింది(మూడు సార్లు శోభన్ బాబు లాగా) అంటాం(రు).
ఇలా రాయమని ఎవరు చెప్పారు అని మెదడులో ఉత్తేజకరమైన ఉత్సాహ తరంగాలు మొదలయితే మీకు పెళ్ళి కాలేదని అర్థం.
7 comments:
cha........nijamaa?
ఖచ్చితంగా ఇలా వ్రాయమని మీ పక్కింటావిడ చెప్పింది :-)
విహారీ..ఈ మధ్య వాసి తగ్గినట్టుంది....బ్లాగులో?
అవును విహారీ ఈ అవిడియా నీకు ఎప్పుడో అనుభవమై ఉండాలే! ఇంతవరకు ఎందుకు చెప్పలేదు.. చాలా రోజులనుండి కనపడలేదు. ఇవాళే నా బ్లాగులో విహారి కనపడుట లేదు అని ప్రకటన ఇద్దామనుకున్నా. చైనా సుందరి, డాక్టరు దగ్గర వైద్యం చేయించుకుంటున్నావా> ఏంటి ఇంత డల్‍గ ఉంది ఈ పోస్టు... కమ్ బ్యాక్ టు యువర్ సెల్ఫ్ బ్రదర్!!!
పేల లేదు ఈ జోకు.విహారి అభిమానులకు నిరాశ కలిగించింది.ప్రచురణకు ముందు మీ శ్రీమతికి చూపించారా?
అందరూ పేలలేదంటే పాపం ఆయనేం చేస్తారు ?
సొంత పైత్యం తో వ్రాస్తే ఆయనని నిందించవచ్చు.
బలవంతం మీద వ్రాయవలసివచ్చిన దానికి ఆయనేం చేయగలరు పాపం :(
@ రాధిక గారు,
నిజంగా నిజం. మీ ఆయనని అడగండి.
@ గౌరి కుమార్ గారు,
భలే కనిపెట్టేశారు. మీకు బాగా అనుభవమా :-)
@ నరహరి గారు,
వాసేమీ తగ్గలేదు గానీ. ఫొకస్ కొంచెం తగ్గింది అంతే.
@ జ్యోతక్కా,
ఈ సారి పారిస్ ఆస్పత్రి వెళ్తున్నా.
నేను రాస్తునే వున్నానే. కాస్త తెలుగు సంఘం పన్ల వల్ల వెనక్కి నక్కా అంతే.
@ రావ్ గారు,
నాకయితే బాగ పేలినట్టే అనిపించింది. బహుశా పంచ్ సరీగా ఇవ్వక పోవడం వల్లేమో.
@ రాకేశ్వర రావు గారు,
నేను సొంత పైత్యం తో రాయలేదని ఎలా కనిపెట్ట గలిగారు. మీకు పెళ్ళి అయిపోయిందా?
-- విహారి
Post a Comment