Thursday, September 06, 2007

ఈ వారం సిద్ధ – బుద్ద (03-Sep-07)

:

“అయ్య గారూ.”

“ఆ…”

“ఇప్పుడు ఆ 610 జీవో ఏమయ్యింది.”

“ఏమో తెలీదు”

“ఇప్పుడు కె.సి.ఆర్. ఏమి చేస్తున్నాడు”

“ఏమో నాకు తెలీదు”

“టి.ఆర్.ఎస్. లో వారసత్వం మొదలయిందట గా”

“ఏమో నాకు తెలీదు”

“ఆ రీడిఫ్ వాడు బాంబు పేలుళ్ళ గురించి అడిగిన మొదటి ప్రశ్నకే వై.ఎస్.ఆర్. ఎలా నవ్వగలిగాడు”

“ఏమో నాకు తెలీదు”

“వై.ఎస్.ఆర్. పత్రికలలో అన్నీ నిజాలే రాయాలని చెప్పాడు తెలుసా”

“ఇట్ హ్యాపెన్స్”

“బాలకృష్ణ కూతురు పెళ్ళి రిసెప్షన్ అప్పుడు నిమ్మకూరు దగ్గర రోడ్లో ఏదో జరిగితే బాలయ్య వీరంగం అని ఆంధ్రభూమి రాస్తే ఈనాడులో బాలయ్యే అన్నీ సమర్థవంతంగా నిర్వహించాడు అని రాశారు”

“ఏమో నాకు తెలీదు”

“జూనియెర్ ఎన్టీఆర్ ఆ పెళ్ళికి ఎందుకు వెళ్ళలేదు”

“లోగుట్టు పెరుమాళ్ళకెరుక”

“క్రికెట్లో ఇండియా వాళ్ళు మళ్ళీ తెల్ల జెండా ఎగరేశారట”

“అది కొత్తేం కాదు”

“నిన్న జరిగిన మ్యాచ్ లో గెలిచారట”

“అయ్యుండచ్చు. వచ్చే మ్యాచ్ పోవచ్చు”

“ఏంటీ, ప్రతి దానికీ పొడిగా మాట్లాడుతున్నారు”

“ఇట్ హ్యాపెన్స్”

“ఇట్ హ్యాపెన్సా? కొన్నాళ్ళు ఆ రెండు పత్రికలూ చదవడం మానండి”

“లెట్స్ సీ”

“చిరంజీవి పార్టీ పెడతాడా?”

“వెళ్ళి జాతకాలు చెప్పేవాడిని అడుగు”

“అదెంటబ్బ.. ఇది కూడా పని చేయలేదు”

“అవునూ సినిమా బ్లాగులు ఎక్కువయినట్లున్నాయి.”

“ఇట్ హ్యాపెన్స్”

“అయ్య గారో!!! మీకు గాలి గుమ్మటాలున్నారా”

“అంటే ఏంటి”

“అదే పంకాలు వాటినే ఫ్యాన్లు అంటారు”

“నాకు ఫ్యాన్లు వుండటానికి నేనేమన్నా చిరంజీవి నా బాల కృష్ణనా”

“మీ మొఖానికి అంత సీను లేదని నాకు తెలుసు గానీ. నే చెప్పేది బ్లాగుల్లో”

“నాకు పంకాలు సంగతేమో గానీ నేను మాత్రం చాలా బ్లాగులకు పంకాను”.

“ఆ బ్లాగులేవో సెలవిస్తారా”

“నేను చెప్పను”

“సరే మీరే బ్లాగులకు పంకానో చెప్పండి”

“మళ్ళీ ఆ చిడతల సామి గానీ నీలోకొచ్చాడా”

“అంటే చెప్పరన్నమాట.”

“అవును చెప్పను. మన బ్లాగరులందరూ ప.పం.లు”

“అంటే”

“పరస్పర పంకాలు. ఎవరికెవరూ తక్కువ గాదు”

“మీరు గానీ రాజకీయాల్లోకి వెళ్దామనుకుంటున్నారా”

“ఏరా సిద్ధిగా! నీకేమన్నా లోటు చేశానా. అంతర్జాలం చూసుకోడానికి ల్యాప్టాప్ ఇచ్చా, మాట్లాడుకోడానికి సెల్ ఫోనిచ్చా, కొనుక్కొడానికి పీట్జా హట్ కూపన్లు ఇచ్చా. అంత లేసి బూతు మాటలంటున్నావు”

“క్షమించండి అయ్యగారూ. మీరీమధ్య కొంచెం బిజీ అయినట్టున్నారు”

“అవున్రా నిద్ర పోవటం ఎక్కువయింది. అదిసరే ఈ టపా ఎలా వుంది ”

“????? ”

“నిజం చెప్పావ్. ఆ మాట బయటికి చెప్పకు.”

“మరిలా అయితే మీ వందో బ్లాగు ఎప్పుడు రాస్తారు”

“ఉష్ గప్ చుప్.. “


: