ఓ సిరివెన్నెల పాట
హృదయాన్ని కదిలించే మరొ ఆణి ముత్యం సిరివెన్నెల వారి కలం నుంచి...
ఓ సారి ఈ కింది లంకె ను నొక్కండి.
భారత రవి కిరణమా...
Thursday, October 26, 2006ఓ సిరివెన్నెల పాటహృదయాన్ని కదిలించే మరొ ఆణి ముత్యం సిరివెన్నెల వారి కలం నుంచి... వర్గాలు: నావి కానివి Tuesday, October 24, 2006స్వర్గం - నరకంఅది 2025 వ సంవత్సరం.... ఎక్కడో చదివా...కాపీ చేసి ఇక్కడ పెట్టాOnce upon a time a Washerman was bringing up two donkeys. Let us say Donkey-A and Donkey-B. వర్గాలు: నావి కానివి Thursday, October 12, 2006చికెన్ గున్యా తో ఎవరూ చనిపోలేదట....http://www.telugupeople.com/news/news.asp?newsid=10275&catid=59 Tuesday, October 10, 2006మా యవ్వ - 2బాటెంబడి బోతాంటే చేన్లో పన్జేసుకునే వోళ్ళు, మడి కయ్యిల్లో పన్జేసుకునే వోళ్ళు అందురు మమ్మల్ని జూసి పల్కరిచ్చేటోల్లు. వర్గాలు: మా యవ్వ Monday, October 09, 2006పోకిరి...పండు..బేబి పండుఏ ముహూర్తాన "పోకిరి" సినిమా వచ్చిందో గానీ. మా ఇంట్లో మాత్రం ఓ పోకిరోడు తయారయ్యాడు. ఇక్కడ (డెన్వర్) పొకిరి సినిమా వేస్తున్నారని తెలియగానే నేను మాయావిడా, మా అయిదేళ్ళ బుడ్డోడూ అందరూ వెళ్ళాం. మా బుడ్డోడి వల్ల ఎంత సినిమా మిస్సవుతామో అని అనుమానిస్తు వెళ్ళాము థియేటర్ లోకి. ఎందుకంటే బుడ్డోళ్ళకి కుదురుగా ఒక చోట కూర్చొవడం అలవాటు లేదు. ఇక సినిమా మొదలయినప్పటి నుండి స్క్రీనంతా తన్నులూ.. గన్నులే. ఇకే బుడ్డోడికి పండగే పండగ. వర్గాలు: జోకు Thursday, October 05, 2006మా యవ్వ. - 1***************************************************
మాయవ్వంటే మా యమ్మొళ్ళ అమ్మన్నమాట. మా యవ్వ నన్ను చాన బాగ జూసుకునేది. మా పెద్ద మామ గూడ నన్ను చాన బాగా జూసుకునేవాడు. పాపం ఆయనకు పిలకాయల్లేరు. ఆ వూరి పేరు జెప్పలేదు గదూ. ఆ వూరి పేరు యర్ర కోట పల్లి. చిత్తూరు జిల్లా కలకడ దగ్గిర ఓ చిన్నూరు. ఆ వూర్లో మా మామంటే మా మామే. అదే పెద్ద మామ. ఇంక ఇద్దురు మామలుండార్లే అందుర్లోకి చిన్న మామ కిట్ట మామ. ఆయనెబ్బుడు స్టయిలు గా ఉండే వోడు. ఆయన జేసే పనేమో దేశాలు తిరగడం ఎబ్బుడు జూసినా బొంబాయి కి బొయ్యేవాడు. వూళ్ళో అందురూ బొంబాయి కిట్టయ్య అనే వోళ్ళు. ఎబ్బుడూ నళ్ళద్దాలు పెట్టుకుని బొచ్చు టోపీ పెట్టుకునే వాడు. ఇంగో మామేమో మా పెద్ద మామ ఇంటి దగ్గిరే ఇంగో ఇంట్లో వుండే వోడు. ఆయనకు అయిదు మంది కూతుర్లు ఒగ్గొడుకు. కొడుక్కోసరం అంత మందిని కణ్ణాడంట. అందురూ సేద్యం జేసుకునేటొళ్ళే. అబ్బుడే జెప్పినా కదా మామామంటే మామామే అని. ఆయనకి రేషన్ షాపు, గుడ్డలంగిడి ఇంకా ఏవేవొ వుండేటివి. ఆయన వూళ్ళో అందరికి సహయం చేసే ఓడు. అందురికి తళ్ళో నాలికంట. నేనేమో ఆయన్ను పెద మామా అంటే వూళ్ళో వాళ్ళందరూ రామయ్యన్నా అనేవోళ్ళు. ఈ ముగ్గురి కొడుకులకి ఇంగొ ముగ్గురి కూతుర్లకి అమ్మే మా యవ్వ. మా తాత నేను బుట్టక ముందే చచ్చి పొయినాడంట. నేను చాన చిన్నగ వుణ్ణప్పుడు అంటే నేను చెడ్డీ లేకుండ పరిగెత్తే టబ్బుడన్న మాట చాన ఎర్రగా బుర్రగా బొద్దుగా వుండే వాణ్ణని వూళ్ళో వాళ్ళు నన్ని దీసుకోని పొయి వాళ్ళింట్లో ఆడిచ్చుకునే వాళ్ళంట. నాకు తరవాద్దెలిసింది లే నేను ఎర్ర గా లేనని. నేను కుంచెం పెద్దయిన తరువాత, అంటే ఇంట్లో వున్న నీళ్ళ బాయి బండ మీద నుంచి నిక్కి నిక్కి బాయి లోపలికి చూసేంత పెద్దన్నమాట, మా యవ్వ మా యమ్మని పిలిచి "అమ్మణ్ణీ, వీడు బాయి లోకి పారికి పారికి తొంగి జూచ్చా వుండాడు వీణ్ణింగ నువ్వు తీసుగోని బో " అని జెప్పింది. ఇంగేముంది మా యమ్మ నన్ను తాను పన్జేసే వూరికి దీసుకును పొయింది. ఆ వూరి పేరు నెల్లిమంద. ఇంగ జూసుకో మనికి ఇస్కూళ్ళో పండగే పండగ. మనం టేచురు కొడుకు కదా ఎవుణ్ణయినా తిట్టచ్చు గిల్లొచ్చు కొట్టొచ్చు. ఎవురు పుచ్చకాలైన(బుక్కుల్ని నేనట్లే పిలస్తా) చించొయ్యచ్చు. ఎవురి పలకలైన..ఎవురు తలకాయలైన పగలకొట్టచ్చు. ఆ వూళ్ళో పిల్లకాయలందరి పలకలు పగిలి బొయినంక మళ్ళీ ట్రాన్స్పరొచ్చి లద్దిగం లో యేసినారు. ఆడ్నే మనల్ని గూడా స్కూళ్ళో యేసినారు. మాయమ్మ స్కూల్లో ఒగటోతరగతి కి రెండో తరగతి కి పాటాల్ జెప్పేది. మా నాయినేమో మూడో తరగతి నాలుగో తరగతి అయిదో తరగతి కి బొయ్యే ఓడు. అబ్బుడు స్కూళ్ళంతే. ఇంగేముంది ఆ స్కూళ్ళో గూడ మనమే రాజులం. ఎవుడూ మనల్ని రేయ్ అనే వోళ్ళు గాదు. అందురు "య్యోవ్" అని పిలిచే వోళ్ళు. "య్యోవ్" అంటే అయ్యా అని అర్థమన్న మాట. పొద్దున్నే ఎవుడో ఒగడు ఒచ్చి మా ఇంట్లో నుండి నా బుక్కులు(పుచ్చకాలైన) దీసుకోని స్కూళ్ళొ నా క్లాసులో ముందు లైన్లో బెట్టే వోడు. మళ్ళీ ఇంగోడు మద్యానానికి ఇంట్లో తెచ్చి పెట్టే వోడు. ఎబ్బుడూ స్కూలుకు బోక పొయినా మనమె క్లాసు ఫస్టు.నా బుక్కులు స్కూళ్ళో వుంటే నేనేమో పల్లి లో చెరువులు కాడ బాయిల కాడ ఆడుకునే దానికి బోయే వోణ్ణి. మా యమ్మ ఎబ్బుడన్న స్కూళ్ళోఎ డిక్టీషన్ జెబ్బేటబ్బుడు ఇద్దుర్నో నలుగుర్నో పంపిస్తుంది మన కోసం. అబ్బుడు వాళ్ళందురు మన కోసం చింతోపుల్లోనో బాయికాడనో చెరువుకాడనో కుంట కాడనో ఎతుకుతారు. నేను దొరికితే ఒచ్చి చేతులు కట్టుకుని "య్యోవ్ మ్యాడం రమ్మంటా వుంది.డిక్టీషన్ జెబుతుందంట" అని జెప్తారు. మనమేమో "తరువతొస్తా పోరా" అని వాణ్ణి గాఠ్ఠి గా అరిచి పంపిచ్చేసేవాణ్ణి. ఇంగొంత సేపటికి మళ్ళీ ఇంగోడు ఒచ్చి జెబ్తే. సర్లే పదరా అని వురుకెత్తుకుని ఒచ్చి క్లాసులో మా యమ్మిచ్చిన డిక్టీషన్ గబగబ రాసేసి చూపిచ్చేస్తే మనకు పది కి పది మార్కులు ఒచ్చేవి. దొంగ మార్కులేమీ కాదు లేబ్బా. అబ్బుడు మనం బాగానే జదివి వేవాళ్ళం ఇంటికాడ స్పెషల్ క్లాసులుంటాయి గదా.నా క్లాసులో ఇద్దురో ముగ్గురో సీ గాన పెసూనాంబ లు వుండే ఓళ్ళులే. ఇట్లే ఒగ తూరి స్కూలెగ్గొట్టి వూళ్ళో రమణప్పోళ్ళ మొక్క జొన్న తోట్లోకి దూరి మొక్క జొన్నలు తింటా వుంటే ఆ తోటాయనికి దొరికి బొయినా. ఇంగ చూడల్ల నా మొగం. ఆయన్నన్ను గుర్తు బట్టి "సిగ్గు లేదూ టీచురు కొడుకయ్యుండి దొంగతనం జేస్తావా, ఈ తూరికి వొదిలేస్తావుండా టీచురు కొడుకని..పో" అని తిట్టేసరికి నేను నా చేతిలో కంకి ఆడ పారేసి వురుకో..వురుకు. తరువాత మా నాయినకి జెబ్బినాడో లేదో నాకు తెలీదు.
కలకడ నుండి బొజ్జుగుంట వారి పల్లి కి ఆరో ఏడో ఎనిమిదో కిలోమీటర్లు. ఆడ దిగేసి ఇంకా ఒగ కిలోమీటరు నడిస్తే గానీ మాయవ్వ వాళ్ళ వూరు రాదు. ఇంగ ఆడ దిగిన కాడ్నించి జూసుకో అందురూ అడిగే వాళ్ళే "నువ్వు రామయ్య చెల్లెలు రంగమ్మ గదూ. నీ కొడుకులా ఏమి చదవతాండారు" అని. (సశేషం) వర్గాలు: మా యవ్వ
Subscribe to:
Posts (Atom)
|
స్వాగతం కొత్తవి నేరుగా మీ ఈ-మెయిల్లోకి రావాలా? Facebook Badgeవిహారి.వర్గాలు
|