Tuesday, October 10, 2006

మా యవ్వ - 2

బాటెంబడి బోతాంటే చేన్లో పన్జేసుకునే వోళ్ళు, మడి కయ్యిల్లో పన్జేసుకునే వోళ్ళు అందురు మమ్మల్ని జూసి పల్కరిచ్చేటోల్లు.

మద్దిలో దిగిడు బాయి దగ్గిరికి రాంగానే మా యమ్మ నా చెయ్యి పట్టుకుని "చిన్నీ, పడిపోతావురా " అని దిగిడు బాయి దాటే దాంక నన్ను బట్టుకుని వుండేది.

ఇంగ వూరి కాడికి వొచ్చేసరికి రాగి మాను మింద పెద్ద పెద్ద చినిగి పొయిన జెండాలు కనిపిచ్చేటివి. అవి సాయిబూల జెండాలంట ఒగటేమో పచ్చగ ఇంగోటేమొ ఎర్ర వుండేటివి. ఆ రాగి మాను కిందనే పీర్ల పండగ చేసే వోల్లు. ఆ రాగి మాను కింద చినిగి పొయిన అంగీ తో చెడ్డీ లేకుండ నిలబడి ఉన్న పిల్లోడికి ఓ బువ్వమ్మ జెప్పేది " వో రామయ్యన్న బహన్ కో బచ్చేరే" అని. ఆ బువ్వమ్మే మా యవ్వకు బొంతలు కుట్టిచ్చేటిది.

మేం బొయ్యేది ఎండా కాలం లో అయితే ఇంగ చూడల్ల. దారెంబడి చెనెక్కాయలు ఒలిచే శబ్దాలే. చానా మంది ఇండ్ల ముందర, చెట్ట్లకింద చెనిక్కాయలు గుట్లు గుట్లగా పోసేసి ఉండే ఓల్లు. ఒగ గంప చెనిక్కాయలు ఒలిస్తే పది పైసాలిచ్చే ఒల్లు. ఎక్కువ గంపలు ఒలల్లని కొంత మంది నోట్లో చెనిక్కాయలు పెట్టుకుని కొరిక్కొరికి ఒలిచే ఒల్లు. వాల్ల పెదాలు తవుడుని ముద్దు పెట్టుకుణ్ణట్టుందేది. నీకు చాన డౌటొచ్చేది వీల్లు ఒలస్తా వుండారా లేక చెనిగ్గింజలు తింటావున్నారా అని. ఆ ఒలిచే వాల్లలో మా యవ్వో అత్తో వుంటే ఆ చెనిక్కాయలు పక్కనోల్లకి ఇచ్చేసి. " మా యమ్మి ఒచ్చింది నేను బోతాండ" అని ఒచ్చేసొటొల్లు.

ఇల్లు దగ్గిరికి రాంగానే మనము మా యవ్వా వాళ్ళ ఇంట్లోకి వురుకో వురుకు. రొడ్డు ఒరుసుకు పోకుండా రాళ్ళు, చిన్న చిన్న బండలు ఉన్నా గానీ లెక్క చేయకుండ గొడ్ల చావిడి దగ్గిర మెట్ట్లు దాటేసి ఇంటి అరుగు మీదెక్కి బొయ్యెవాడిని. ఇల్లు బీగం ఏసుంటే బీగం యాడుందో నాకు తెలుసు కాబట్టి బీగం కోసం ఇంటి చూరు బట్టుకుని బైకి బొయ్యి బీగం చెవి తెచ్చి మా యమ్మకి ఇచ్చే వోడిని. ఆ వూళ్ళొకెల్ల మా యవ్విల్లు స్పెషల్ ఎందుకంటే గుడిసయితే గోడల్ని మట్టి తో కొంచెం తక్కువ ఎత్తు లో కడతారు. దాన్ని ఎదో కసువు తో నో జమ్ము తోనో కప్పతారు. మిద్దయితే యిటిక తో నో రాయి తో నో కడతారు. దాని మీద్ సుద్ద గార లేకపోత సిమెంటేస్తారు. ఈ ఇల్లు మాత్రం మంచి యిటికల్తో ఎత్తుగా గట్టి దాని మీ కసువు గప్పినారు. యింట్లేకి పోంగానే మా యవ్వ యింట్లో గూడు మీద (మట్టి తో చేసిన బెంచీ లాంటిది) ఉన్న మట్టి కుండ లో నీళ్ళు మా మామ వాడే కంచు లోట తో ఇస్తాది. ఆ లోటా యెవుడు బడితే వాడు వాడ కూడదు. మనం కుంచెం స్పెషల్.

తరవాతా "యెండన బడి వొచ్చినారు..మజ్జిగ తాగతావా ప్పా" అంటుంది.
"ఒద్దు లేవ్వా మళ్ళ తాగుతాలే" అంటా ఇంట్లో ఉట్టి మీద కన్నేసి. " అవునవ్వా ఇబ్బుడు ఎన్నావులు పాలిస్తా వుండాయి" మన ప్రస్నలు మొదలవుతాయి.
"యాడప్పా! యిబ్బుడు తక్కువే ఇచ్చా వుండాయి..ఆ ఎర్రావు ఒట్టి బొయిందీ(ఇ). ఆ నల్లావూ, చారల్వావూ తక్కువే ఇచ్చా వుండాయి.".
"ఏంది సీనిగాడు(జీత గాడు) లేడా?"
"వుండాడు...ఓడు అడివికి బొయినాడు ఆవుల తోలుకునీ(ఇ)...మాపటేల కొచ్చే చ్చాడు."
"నా అత్తిరాసాలేడ?"
"ఆ దొంతి మీద సట్లో ఉండాయి ఇచ్చా వుండు ఆ దొంతి దించల్లుండు"
"ఆ డెందుకు పెట్నావు కింద ఆ పెట్లో పెట్టచ్చు గదా"
"ఎలకలెక్కువయి పొయినాయీ(ఇ)..ఇబుడు పంది కొగ్గొగటి గూడ వచ్చాంది. ఈ పిల్లులు బాగా మాజ్జిగన్నం తిని అటవలోకి బొయ్యి పండుకుంటాయి ఎలకల్ని పట్టేది లా..ఏమీ లా.."
మనకి అత్యంత ప్రీతి పాత్ర మైన వంటకం "అత్తిరాసాలు" (అరిసెలు). దాని తరవాత పాకం పప్పుంటలు.
"పాకం పప్పు జేసినావా?"
"జేద్దామనే బెల్లం గూడ దెచ్చినా.రేపు జేచ్చా ప్పా!".
"సర్లే అయితే నేను అదెప్ప మామొల్లింటికి బొతా ఈ అత్తిరాసాలు దినేసి. బొడోడు(ఇంకో మామ కొడుకు) ఇంటికాడ్ణే వుండాడా లేక యేటి కాడికి బొయినాడా ".
"వోడు యేటికాడికి బొయినాడు మడి కి నీల్లు గట్టేదానికి. నువ్వాడికి బొవద్దుప్పా! యేట్లొ నీల్లు బాగ వుండాయి".
"నాకెం గాదు లేవ్వా ..నేను బొతావుండా"
మనం యేటి కాడికి వురుకు...మా యమ్మ ఇంగ మా మామొల్లింటికి పరుగు. మా మామ కూతుర్ల లో ఒగర్ని మనకు సెంట్రీ గా పంపిస్తుందన్న మాట.

తరువాత మనం పాలెట్ల తాగే ఓల్లమో జబ్తా...అంతవరకు యేట్లొ చేపలు పడ్తా.

(సశేషం)

8 comments:

రానారె said...

చెనిక్కాయలొలిచేది, దొంతి మీద అత్తిరాసాలు, యండనబడొచ్చినారు ... ఇయ్యన్నీ యినీ సూసీ శాన్నాళ్లైపాయ. చిన్నప్పుటియ్యన్నీ కండ్లగ్గడతాన్నిట్టుండాది.

jabalimuni said...

Really wonderful!The whole topic is very well written in Telangana YAASA reflecting the way those rustic people talk.
Jabalimuni

Anonymous said...

రానారె గారు,

ఇయ్యాన్నీ రాచ్చావుంటే నా కళ్ళంబడ మా యవ్వే కనిపిచ్చా వుంది.
మీ రాతలు జూసి నాకు కడుపు నిండి పోతా వుండాది.

జబ్లి ముని గారు,

ఇదిద్ తెలంగాణా యాస కాదండీ, అచ్చమైన్ రాయలసీమ యాస.

విహారి.

Dr.isMail said...

ఈ కత ఇంటూంటే చెనిక్కాయలు వొలిచిన సంగతి బాగా గ్నాపకం వత్తూండాది.మా అవ్వ ఊరికిబోయినపుడు(అనంతపురం జిల్లా న్యామద్దల), మా మామ పన్జేసే చోటికి బోయినప్పుడు( నాగసముద్రం) ఈతపండ్లు ఏరుకొంటా, చెనిక్కాయలు ఓలిచేది అన్నీ కళ్లకుగట్టినట్లు సూపుతుండావప్పా.పక్కోళ్లవి మన శేరులో యేసుకొని ఎట్టోగట్టజేసి శేరు నింపి వచ్చే పావలాతో రాత్రి ఈడియో సిన్మాలో సూసిన 'బుద్ధిమంతుడు' బాగా గ్నాపకం వచ్చిందబ్బా. మా అవ్వని ఊరిని గుర్తుసేసినందుకు సాలా త్యాంక్సు!

Dr.isMail said...

ఈ కత ఇంటూంటే చెనిక్కాయలు వొలిచిన సంగతి బాగా గ్నాపకం వత్తూండాది.మా అవ్వ ఊరికిబోయినపుడు(అనంతపురం జిల్లా న్యామద్దల), మా మామ పన్జేసే చోటికి బోయినప్పుడు( నాగసముద్రం) ఈతపండ్లు ఏరుకొంటా, చెనిక్కాయలు ఓలిచేది అన్నీ కళ్లకుగట్టినట్లు సూపుతుండావప్పా.పక్కోళ్లవి మన శేరులో యేసుకొని ఎట్టోగట్టజేసి శేరు నింపి వచ్చే పావలాతో రాత్రి ఈడియో సిన్మాలో సూసిన 'బుద్ధిమంతుడు' బాగా గ్నాపకం వచ్చిందబ్బా. మా అవ్వని ఊరిని గుర్తుసేసినందుకు సాలా త్యాంక్సు!

Dr.isMail said...

ఈ కత ఇంటూంటే చెనిక్కాయలు వొలిచిన సంగతి బాగా గ్నాపకం వత్తూండాది.మా అవ్వ ఊరికిబోయినపుడు(అనంతపురం జిల్లా న్యామద్దల), మా మామ పన్జేసే చోటికి బోయినప్పుడు( నాగసముద్రం) ఈతపండ్లు ఏరుకొంటా, చెనిక్కాయలు ఓలిచేది అన్నీ కళ్లకుగట్టినట్లు సూపుతుండావప్పా.పక్కోళ్లవి మన శేరులో యేసుకొని ఎట్టోగట్టజేసి శేరు నింపి వచ్చే పావలాతో రాత్రి ఈడియో సిన్మాలో సూసిన 'బుద్ధిమంతుడు' బాగా గ్నాపకం వచ్చిందబ్బా. మా అవ్వని ఊరిని గుర్తుసేసినందుకు సాలా త్యాంక్సు!

Anonymous said...

Dr.ismail గారూ,

మీ ప్రశంసలు నా అనందాన్ని రెట్టింపు చేస్తున్నాయి.

ఇంగ కొన్ని ఇట్లాంటియ్యి ఇక్కడ బెడతా. మీరు ఎదురు జుచ్చా వుణ్ణండి.

విహారి

spandana said...

విహారీ,
మీ ఈ చిన్నప్పటి ముచ్చట్లు, మరియు రానారె ముచ్చట్లు మీ శలుల్లో చదువుతూ వుంటే చిన్నప్పటి స్మృతులు గుర్తుకు వచ్చి హృదయం భరమవుతోంది, కళ్ళు చెమర్చు తున్నాయి ఆనందంతో.
మా బందువులు చిన్నమండెం, ములకల చెరువు ప్రాంతాల్లో వున్నారు. మీ "అప్పా" మాటలు కరెక్టుగా ట్లాగే వున్నాయి.
మెదడులో లోతుకు చేరిపోయిన చెనిక్కాయలు ఒలిచే సీనులు మళ్ళీ గుర్తుకు తెచ్చారు. మరిని మీ నుంచీ ఆశిస్తూ...

--ప్రసాద్
http://charasala.com/blog/