Wednesday, November 21, 2007

నేడు నెనర్ల డే




అమెరికాలో ఇవాళ థ్యాంక్స్ గివింగ్ డే. ఈ రోజు అమెరికన్లు తమ తమ కుటుంబాల తో గడపటం దీన్లోని విశేషం. రోడ్లో కార్లు తిరగని రోజేదన్న వుందంటే అది నవంబర్ లో వచ్చే నాలుగో గురువారం. ఈ డే వచ్చిందంటే కొన్ని మిలియన్ల టర్కీ కోళ్ళకు డయ్యింగ్ డే. రెండ్రొజులో మూడురోజులో టర్కీని ఊరగాయ పెట్టినట్లు ఊరబెట్టి, కాల్చి తరువాత ఇంటి పెద్ద చేత మొదటి కత్తెర వేయించి వైన్ తాగుతూ ఇంటిల్లి పాదీ ఆనందంగా గడుపుతారు.

తరువాతి రోజు అంటే శుక్ర వారం రోజు అన్ని షాపుల వాళ్ళు ఎంతో కొంత చౌకగాగా వస్తువుల్ని అమ్మకానికి పెడతారు. అది కూడా ఉదయం కొన్ని గంటలు మాత్రమే. వీటికోసం పోలో మంటూ షాపులకు పొద్దున్నే వెళ్ళి చల్లో కోట్లు వేసుకొని నిలబడి కావల్సిన వస్తువుల్ని కొనుక్కోవడం రివాజు. ఇదంతా ఒక ఎత్తు.

ఇన్ని మిలియన్ల టర్కీలలో ఒక టర్కీకి జీవితాంతం బతగ్గలిగే అవకాశం ఒకటి వుంటుంది. ఆ అదృష్టం కావాలనే టర్కీ కోడి అధ్యక్ష భవనంకేసి పరుగులు పెట్టాల్సిందే. ప్రతి సంవత్సరం అమెరికా అధ్యక్షుడి ఒక టర్కీకి క్షమా భిక్ష పెడతాడు. ఆ రోజు అధ్యక్షుడు క్షమించిన టర్కీని చచ్చేదాకా రాచ రికపు మర్యాదలతో చూసుకుంటారు. ఈ సారి "మే" అనబడే టర్కీ కోడిని ఆ అదృష్టం వరించింది.


7 comments:

Kiran Mmk said...

ఎంత దారుణం కదా! ఇంత open గా cruelty celebrate చేసుకోవటం అమెరికా వాళ్ళకే చెల్లింది. Having said that, I love the rest of the Thanksgiving day traditions.

Anonymous said...

చిత్రవధకు గురవుతున్న కోడి పేరు ముస్లిం దేశమైన టర్కీ కావడం కాకతాళీయమేనా ?

ఊకదంపుడు said...

అమెరికా కాబట్టి చచ్చేదాకా రాజరికపు మర్యాదలతో చూసుకుంటారు. అదే ఆంధ్రాలో ఐతే ప్రభుత్వం మారంగానే ఆ కోడి ని రాజరికపు భవనం నుంచి పంపించి దాని స్థానే వేరే కోడి ని కూర్చోబెట్టేవాళ్లు.

నెనెర్ల డే అంటే క్షీరకడలి అన్నట్టు ఉంది..
నెనరుల దినోత్సవమనో లేకపోతే ఉన్న పీర్ల పండగ లాగా నెనర్లపండగ అనో అనుకుందామా?
-ఊక దంపుడు

lalithag said...

మాంసాహారం తినే వారు పండగలప్పుడు పెద్ద ఎత్తున అందుకు కావల్సిన జంతువులను బలి తీసుకోవడం అన్ని చోట్లా ఉన్నదే కదండీ?
నా చిన్నప్పుడు అమ్మ వారి గుడి దగ్గర కొబ్బరి కాయ కొట్టినట్టు అత్యంత సునాయాసంగా బ్రతికున్న కోడిని బలి ఇవ్వడం చూశాను (అనేక మంది భక్తులు ఒకే రోజు). రాస్తుంటేనే బాధగా ఉంది.

వికటకవి said...

విహారి,

ఈ రోజు ఒక్క టర్కీకి మాత్రం అధ్యక్షుడి ద్వారా జీవితం ప్రసాదింపబడుతుంది అన్నది ఇన్నేళ్ళలో నేనెప్పుడూ వినలేదు. నెనర్లు.

వికటకవి

rākeśvara said...

thanksgiving గే పెద్ద దారుణమండి. టర్కీలను పక్కన పెట్టినా, అసలు థాంక్స్ గివింగ్ అందుకోవలసిన native americans ని వీళ్లు ఎప్పుడో హతమార్చారు. 1920 వఱకూ వాళ్లను చంపడం చట్టరీత్యా హత్య కూడా కాదు.
ఇక ఒక కోడికి ప్రాణ భిక్ష పెట్టడం పెద్ద జోకు.
థాంక్సు గివింగ్ సేల్ అంటారా .. అదో ఎత్తని విహారే అన్నారు గా..

కానీ రెండు మంచి విషయాలేమిటంటే,
ఎప్పుడూ కలుసుకోని కుంటుంబాలు ఈ ఒక్కరోజు కలుసుకుంటాయి. ఇక ఎప్పుడూ వంట వండని తెల్లింటమ్మలు (మఱియూ నల్లింటమ్మలు) ఈవాళ వండుతారు. (దీని మీద ఒక జోకుంది లెండి).

ఇంకోటి, ఫుట్ బాలు
చాలా మంచి ఆటలే వుంటాయి ఈ రోజు.
ఈసారి పెద్ద పెద్ద match ups ఏమి వున్నాయో మరి..
మా colts గానీ pats గానీ ఆడుతున్నారా...

ఇంకోటి, ఈవాళ నుండి skiing resorts తెరుస్తారు చాలా చోట్ల!..

హూఊఊఊఁ...

Anonymous said...

@ amanaceo గారు,

ఇందులో దారుణమేమీ లేదు. ఎవడో చంపుతాడు మిగిలిన వాళ్ళు కాల్చుకు తింటారు.

@ తాడపల్లి గారు,

టర్కీ కి అమెరికా కి సంబంధం వుండక పోవచ్చు. ఇది ఎప్పట్నుండో రక రకాలుగా మారుతూ ఇప్పుడో రాగానికొచ్చిన పండగ.

@ ఊకదంపుడు గారు,

కావాలనే ప్రాస కోసం అలా పెట్టా. టైటిల్ కొంచెం కిల్లింగ్ గా వుంటుందని. నెనర్ల పండగ బానే వుందే.

@ లలిత గారు,

అవును మనకది మామూలే. మొదటి సారి అలాగే వుంటుంది. కొన్ని దేశాల్లో హోటల్లో ఇంకా దారుణంగా వుంటుంది. బతికిన దాన్ని సెలక్టు చేసుకుంటే కళ్ళ ముందర మొత్తం తయారు చేసి ఇస్తారు.

@ వికటకవి గారు,

అవునా?
నెనర్లు.

@ రాకేశ్వర రావు గారు,

అమెరికా చరిత్ర మొత్తం అలాగే వుంటుంది మరి. కంటికి రెప్పడ్డం అన్నట్టు ఐక్య రాజ్య సమితి వుంటుంది.వాళ్ళ ఇష్టా రాజ్యం.

మనం ఈ క్రీడల్లో కొంచెం పూర్. ఫుట్ బాల్ బాగా అర్థం చేసుకుంటే అమెరికన్ అయినట్టు నానుడి. అందుకనే ఫుట్ బాల్ ఎలా ఆడతారో నేర్చుకోలేదు, అమెరికా పౌరసత్వానికి దరఖాస్తు పెట్టుకోలేదు.

-- విహారి