డబ్బు కోసం నల్లులతో కుట్టించు కోవడం.
మొన్నా మధ్య ఓ వార్తా పత్రిక లో చూశా. అక్కడెక్కడో( రాజస్థానో, హర్యానానో) నల్లులతో కుట్టించుకుంటే ప్రతి నాలుగు గంటలకు ఎనిమిది రూపాయలట. విషయమేంటంటే మడత మంచాలు అద్దె కిచ్చే వాళ్ళ మంచాల్లో నల్లులు ఎక్కువవుతున్నాయట. వాటిని చంపడానికి ఖర్చు తడిసి మోపెడు అవుతోందట. వేడి నీళ్ళు పొయ్యడం, నల్లుల మందు వెయ్యడం లాంటివి చేస్తే అద్దె లో సగానికి పైగా దానికే పోతోందట. దానికి ఒక మహత్తర ఉపాయం కనుక్కున్నారు. ఎవరైన వచ్చి నల్లు లకు ఆహారంగా ఆ మంచం మీద పడుకుంటే ఆ నల్లులు ఎంచక్కా ఆ మనిషి రక్తాన్ని వీలయినంత తాగి వెళ్ళి మంచం సందుల్లో వెళ్ళి బజ్జుంటాయట. వాటికి ఒక సారి కడుపు నిండితే మళ్ళీ 8 గంటలు దాకా బయటికి రావట. తరవాత ఆ వచ్చిన వారికి ఆ మంచాలని అద్దెకిస్తారట. వాళ్ళ నిద్రకు 8 గంటలు డోకా లేదని డంకా బజాయించి ఆ "మంచాల యజమానులు" సెలవిస్తున్నారట. డబ్బు కోసం నల్లులకు బలవడానికి కొంతమంది క్యూ లో నుంచుంటున్నారట.
వినడానికి వళ్ళు జలదరించేటట్టు వున్నా ఇది అక్షరాల నిజం.
*** ***
2 comments:
ammo....vinadaanikea bhayam gaa vundi.avi kuditea baadha varnanaatiitam.dabbu manishi ceata emta panainaa ceayistumdi
అవును. నేనూ ఇది కొద్ది రోజుల క్రితం ఈనాడులో చదివా!
ఇంకా కొన్ని రోజుల క్రితం అమ్మ పాలతో చేసిన వంటకాలు చేసి అమ్ముతున్న రెస్టారెంటు(చైనాలో) గురించి కూడా చదివా!
--ప్రసాద్
http://blog.charasala.com
Post a Comment