మరొక చక్కటి తేనె గూడు.
మన తెలుగు బ్లాగర్ల కొరకు తెలుగు బ్లాగర్లు ,
కూడలి , చందూ ఆన్ లైన్ లాగ మరొక గూడు వచ్చి చేరింది. చక్కటి సదుపాయాలాతో వివిధ రంగులతో మన ముందుకు వచ్చింది. ఇందులో వ్యాఖ్యలు కనిపించే అవకాశం లేదు కానీ "ఈ నాటి బ్లాగులు" "ఎక్కువ చదివిన పుటములు" అనే రెండు కొత్త వర్గాలు వున్నాయి. వీటితో పాటు మన కిష్టమైన వాటిని ఎంచుకునే సౌకర్యం కూడా వుంది.అన్ని మంచి లక్షణాలతో వున్న "తేనె గూడు" మధ్య లో ఓ కందిరీగ కుట్టినట్టు author name నమోదు చేసే చోట ఇలా వుంది.
"Author Name will be used when present, for this listing. Preferably in Tamil".
దీనిని "తేనె గూడు" యాజమాన్యం వారు సరిదిద్ద గలరని ఆశిస్తున్నాను.
ఇంకో సంగతి మీరు మీ బ్లాగును మొదటి సారి "ping" చేస్తే పాత టపాలన్నీ కొత్తవన్నట్టు ఇందులో వచ్చి పడతాయి.
3 comments:
ఇంతకీ మీరు చెప్పిన తేనె గూడు యొక్క URL ఏమిటో చెప్పలేదు.
అరె అందరికి తెలుసుంటుందనుకున్నా
అది www.thenegoodu.com
విహారి
ధన్యవాదాలు.
Post a Comment