శుభాకాంక్షలు......మరియు సంసారంలో సరిగమలు.
ముందుగా జ్యొతి గారికి,
మీరు మన బ్లాగర్ల వ్యక్తిగత సంతోష సందర్భాలను వెలికి తీసి అందరితోనూ పంచుకున్నందుకు, మీ సహృదయతకు ధన్య వాదాలు. నేను ఈ సందర్భంగా నాలుగు ముక్కలు రాద్దామనుకున్నా. అది మీ కామెంట్ల కింద పెడితే బాగుండదని. నా బ్లాగులో పెడుతున్నా...
ఇస్మాయిల్ మరియు సుధ దంపతులకు,
ఏడవ వార్షిక వివాహ మహోత్సవ శుభాకాంక్షలు.
వీవెన్ మరియు కల్పన దంపతులకు,
ప్రధమ వార్షిక వివాహ మహోత్సవ శుభాకాంక్షలు.
అనిల్ గారికి,
మీ బ్రహ్మ చర్య కు వీడ్కోలు చెప్పి సంసార సాగరంలో దూకుతున్నందుకు మీక్కూడా శుభాకాంక్షలు.
విహారి
ఇంకా ఇంట్లో వున్న వాళ్ళందరు.
ఈ సందర్భంగా నాకు ఒక జోకు గుర్తుకు వస్తోంది.
పెళ్ళయిన మొదటి సంవత్సరం భార్య చెప్పినట్టు భర్త వింటాడట.
రెండవ సంవత్సరం భర్త చెప్పినట్టు భార్య వింటుందట.
మూడో సంవత్సరం నుండి భార్య భర్త ఇద్దరూ మాట్లాడుకుంటుంటే పక్కింటి వాళ్ళు వింటారట.
*********
ఆంగ్లంలో ఒక సామెత వుంది. పెళ్ళయిన ఏడేళ్ళకు అదేదో కుట్టి "seven year switch" అవుతుందట. నాకు ఏడేళ్ళు అవడానికి ఇంకా రెణ్ణెళ్ళు వుంది.
*********
నాకు నా బ్రహ్మ చర్య రోజులు గుర్తుకు వస్తున్నాయి. పొద్దున్నే చక్క గా తయారై ఊరెంబడి షికార్లు కొట్టుకుంటూ బాలాదూరుగ తిరిగే ఆ రోజులెక్కడికి పోయాయో ఇప్పుడు.
ఓ సుముహుర్తాన పెళ్ళయిపోయి "అచ్చి..బుచ్హి.." అనుకుంటూ అమెరికా వచ్చిన ఆర్నెల్లకు "నాన్నోయ్ ! నా రిలీజ్ డేట్ వచ్చే ఆగస్టోచ్" అని పండుగాడు సిగ్నలిచ్చేశాడు. వాడొచ్చిన అయిదేళ్ళకు " ఒరేయ్ నాన్నా ! నేను కూడ వచ్చేసాన్రోయ్ అన్నీ అన్న గాడికే కాదు నాక్కూడా కొన్ని బొమ్మలు కొన్రోయ్" అని ఇంగో పండుగాడు వచ్చేశాడు.
కట్ చేస్తే.....
03-Feb-07...సాయంత్రం నాలుగ్గంటలు.
ఇంటెర్నెట్ చూద్దామని లాప్టాప్ తెరిచి కూచున్నా.
"ఏంటి ఏం చేస్తున్నారు..ఖాళీగానే వున్నారు కదా. వీడినెత్తుకోండి" అంది "అచ్చి..బుచ్హి" అనే మా ఆవిడ.నా సమాధానం కోసం ఎదురు చూడ్డాల్..గీడ్డాల్ ఏమీలేవ్. మరుక్షణమే చిన్న పండు గాడు నా వళ్ళో వాలాడు "ఉక్కూ..ఉక్కూ" అంటూ. అది చూసి పెద్ద పండు గాడు వచ్చి "నాన్నా ! నేనిక్కడ కూచుంటా" అన్నాడు నా వడి చూపించి. "సరే రా" అని చి.పం. ను ఏడమ పక్కకు మార్చి పె.పం. కుడి పక్క వళ్ళో కూర్చో పెట్టుకుని వినాయకుడికి అవతరమెత్త సిబ్ధి..బుద్ధి లను లాలించినట్టు నా కుమార రత్నాలను ఆడిస్తూ ఆయన వాహనమైన ఎలుక గార్ని మెళుకువ గా ఉపయోగిస్తూ ఇంటెర్నెట్ వార్తా సంచారాన్ని పూర్తి చేశా.
దీన్ని సంసార ఝంఝాటమంటే....అదొక శాంపిల్ మాత్రమే.
********
10 comments:
"అనిల్ గారికి, మీ బ్రహ్మ చర్య కు వీడ్కోలు చెప్పి ..." అన్నారు. బ్రహ్మ చర్య అని విడగొట్టడంలో మీ ఉద్దేశమేమిటో తెలుసుకోవాలని చాలా కుతూహలముగా వుంది గురూజీ :))
ఎందుకో ఇక్కడ "పెళ్ళయిన కొత్తలో" సినిమాలో విన్న మాట రాయాలనిపిస్తుంది."ఒంటరి జీవితం ఎప్పుడూ విసుగే..జంట జీవితం లో విసుగున్నా సంతోషం కూడా వుంటుంది."
ఒంటరి జీవితం ఎప్పుడూ విసుగు కాదండి. పెళ్ళయ్యే వరకు విసుగుంటుంది. అయిన తరువాత ఓ రెండు సంవత్సరాల పాటు ఓకే. తరువాత మొదలయ్యే ఒంటరి జీవితమే అన్నింటి కన్నా విసుగయినది.
అదే నాకు మండుద్ది...ఆగండి నా బ్లాగులోనే అందరికీ సమాధానం చెప్తా ........తెగ రెచ్చిపోతున్నారు.
వామ్మో... నా పెళ్లి నిరవధిక వాయిదా.
భలే చెప్పారు. జ్యోతి గారికి అరికాలి మంట నెత్తికెక్కింది.
--ప్రసాద్
http://blog.charasala.com
@ రానారె గారు,
దానర్థం......ఒంటరి జీతం నుండు జంట జీవితానికి అంటే కొత్త బరువు బాధ్యతల్లో అడుగుపెడుతున్నట్టు.
@ రాధిక గారు,
అదే సినిమాలో ఇంకో డైలాగ్ "ఆడ మగ అని తేడా వుంది గానీ..ఆడ మనసు మగ మనసు అని తేడా వుండదు" వుంది.
ఈ సినిమాను ఇక్కడ మేము తెలుగు సంఘం తరపున ఫ్రీ గా చూపించాము. అందరూ బాగా ఎంజాయ్ చేసారు.పెళ్ళిలో విసుగు లేదండి. అప్పుడప్పుడూ అలా అనిపిస్తుందంతే.
@ సుధాకర్ గారు,
ఓంటరితనం రెండేళ్ళ తరువాత వస్తుందంటారా?
@ జ్యోతి గారు,
ఇక్కడ మండించేత ఏదీ లేదండీ.
@ ప్రవీణ్ గారు,
మీ పెళ్ళి ఫిక్స్ అయిందా కస్త గట్టి చెప్పండి. అంతగా భయపడకండి :-)
@ ప్రసాద్ గారు,
మీరు భలే చెప్పారని నాకు చెప్పారా? జ్యొతి గారికి చెప్పారా?
-- విహారి
మీ బ్లాగు చూసే దాకా ఆ జంటలది ప్రేమవివాహమని నాకు తెలియదు. ప్రేమ పావురాలకు నా శుభాకాంషలు. కువ కువలతో మరింత ప్రేమమయం కావాలి వారి జీవితం. నా U.K. మిత్రుడు వివాహం హైదరాబాదు లో జరిగింది. U.K. వెళ్ళాక తన marriage photos link పంపాడు. మన హైదరాబాదు మిత్రుడు చావా కిరణ్ వివాహ చాయా చిత్రాలు ఎవరైనా చూశారా? నేనూ చూడలేదు.
రావు గారు,
నాకు తెలిసి ఇస్మాయిల్ గారిది ప్రేమ విహాహమే( అక్కడక్కడా చదివి చూస్తే), మిగిలిన వాళ్ళ సంగతి తెలీదండి.
చావా గారికి పెళ్ళనే మాట విన్నా కానీ తరువాత విశేషాలేమీ తెలీదు. మీరు బ్లాగర్ల సమావేశంలో కలిసినప్పుడు కనుక్కోవచ్చేమో.
విహారి
అవునండీ...మా ప్రేమకథ మరోసారి ఎప్పుడైనా!
Post a Comment