Thursday, February 08, 2007

ధన్యవాదాలు

భారత బ్లాగర్ల ఉత్తమ బ్లాగర్ల పోటీలు ఫిబ్రవరి 5 న ముగిశాయి. ఉత్తమ తెలుగు బ్లాగు బహుమతి ని తేనె గూడు వారు ప్రాయోజితం చేస్తొందని అందరికి తెలిసిందే. నేను అలంకరణ (design) విభాగంలో పాల్గొన్నా. బహుమతి వస్తుందన్న ఆశ ఏ కోశానా లేదు. ఓ తెలుగు వాడు ఎందులోనూ తక్కువ కాదు అని చెప్పడానికి పాల్గొన్నా, అందుకోసం నా బ్లాగులో లింకుకూడా పెట్టా. దాన్ని చూసి కొందరు దాన్ని చూడకముందే కొందరు నాకు ఓట్లేశారు. అలా నాకు ఓట్లేసిన వారందరికి నా బ్లాగు ముఖంగా ధన్యవాదాలు. నాకు వచ్చినవి 7 ఓట్లు ( నాది కూడా కలిపి). అదే మహద్భాగ్యం అనుకొంటున్నాను. నా బ్లాగ విహారం మొదలు పెట్టి అయిదు నెలలు మాత్రమే అయింది. ఇన్ని రావడం నాకు ఓటేసిన వారి ఉదారగుణమే తప్ప నా గొప్పేమీ లేదని విన్నవించుకొంటున్నాను.



నా బ్లాక్కొచ్చి చూసిన వాళ్ళకు ఓటేసిన వాళ్ళకు మరొక్క సారి కృతజ్ఞతలు.


ఇట్లు,
కృతజ్ఞ విహారి.

4 comments:

రానారె said...

మొన్న తెలివిహారి. ఇప్పుడు కృతజ్ఞవిహారి. హహ్హ, మీ బ్లాగుల్లో రకరకాల విహారులను చూస్తున్నామీమధ్య.

Sudhakar said...

మీ స్పూర్తే మాకు స్పూర్తి :-)

Naveen Garla said...

విహారీగారు..అవార్డు సంగతెట్లున్నా....మా అందరి రివార్డులు మీతోనే ఉన్నాయి :)

నాకు బాగా నచ్చే బ్లాగులలో మీదీ ఒకటి. పోస్ట్లు పెరిగేకొద్దికీ మీ రచనాలు చాలా ఆసక్తికరంగా ఉంటున్నాయి... :)

Anonymous said...

@రానారె,

నేను నా కాలేజీ రోజుల్లో ఉత్తరాల్లో రాసే విధానం గుర్తుకొచ్చి అలా రాస్తున్నా.చూస్త్00 ఉండండి అది ట్రెండ్ సెట్టర్ అవుతుందేమో? ఇలాగే నేను అమెరికా వచ్చిన కొత్తలో అంగ్ల మెయిల్ లో రాసేవాడిని. దాన్ని చూసి కొంత మంది అలా ఫాలో అయిపోయారు :-)

@సుధాకర్ గారు,

అమ్మో పెద్ద మాట అనేశారు. మీరంతా అనుభవజ్ఞులు.నేనేదో వానా కాలం మనిషిని. మీగురించిముందే చెప్పేద్దామని ఈ టపా లోఅనుకున్నా కానీ సస్పెన్స్ పోతుందని చెప్పట్లేదు.:-)

@ నవీన్ గారూ,

మీకు నా బ్లాగు నచ్చినందుకు ధన్యవాదాలు. మీ మాటలరివార్డ్ నాకు కడుపు నింపుతోంది.

-- రెండోసారి ధన్యవాదాల విహారి