చట్నీ ఎలా చేస్తారంటే..
బ్రిటీషువాడు తిరుపతికి వచ్చాడు. వచ్చిన తరువాత అక్కడున్న వాళ్ళు చెప్పారు " నువ్వు కొండకు నడిచి వెళ్తే చాలా పుణ్యం వస్తుంది" అని.
"సరే" అని అలిపిరి నుండి బయలు దేరాడు. ఆకలిగా వుంటే అక్కడే వున్న చిన్న దుకాణంలో టిఫిన్ తిందామని లోపలికెళ్ళాడు.
అక్కడ సర్వర్ తెచ్చిన దోశ, వేరు శెనగ చట్నీ తిన్నాడు. చట్నీ చాలా బాగుందని అది ఎలా తయారు చేస్తారో కనుక్కుందామని ఆ సర్వర్ నడిగాడు. తన ఆంగ్ల పరిజ్ఞానంతో ఆ సర్వర్ ఇచ్చిన సమాధానం.
"ఫస్ట్ చిల్లీస్ థౌసండ్(వెయ్యి)"
"ఓ కే" బ్రిటీషువాడు.
"నెక్స్ట్ సాల్ట్ థౌసండ్"
"ఓ.కే"
"నెక్స్ట్ టామరిండ్ థౌసండ్"
"ఓ.కే"
"నెక్స్ట్ ఫ్రైడ్ గ్రౌండ్ నట్స్ థౌసండ్"
"ఓ.కే"
"నెక్స్ట్ ఆనియెన్స్ థౌసండ్"
"ఓ.కే"
"నెక్స్ట్ ఆల్ హండ్రెడ్(నూరు)... చట్నీ రెడీ"
"??????"
8 comments:
chala bagundhi ee joke..
అహ్హాహ్హహ...
super...emta baagaa ceppaadoa...
థ్యాంక్యూ వెరీమచ్!!
నవ్వుకుంటూ ఇంటికెళ్లిపోతా.
ఆఫీస్ నుండి ఇంటికెళ్తూ అలా చూశాను మీ బ్లాగు.
super joke...navvaagalaedu
shakegone (షేక్‌గాన్) అంటే అదిరిపోయింది..
ఇది మీ అందరికి నచ్చినందని చెప్పినందుకు ధన్యవాదాలు.
ధన్యవాద విహారి
మీ యింటికి తిండికి ధైర్యంగా రాగలమా? అయినా 'వాదా'లెందుకూ? ధన్యవిహారి బాగుంది.
Post a Comment