Thursday, October 12, 2006

చికెన్ గున్యా తో ఎవరూ చనిపోలేదట....

http://www.telugupeople.com/news/news.asp?newsid=10275&catid=59

అవును చికెన్ గున్యా వచ్చి ఎవరూ చనిపొలేదు.
మందుల్లేక చనిపొయారు.
డాక్టర్లు దొరక్క చనిపొయారు.
చాంతాండంటి క్యూల్లో నించోలేక చనిపోయారు.
దోమలు కుట్టడం వల్ల చనిపోయారు.
వళ్ళు నొప్పుల వల్ల చనిపోయారు.
వేసుకున్న మందు వికటించడం వల్ల చనిపోయారు.
నొప్పులు తగ్గవనె బాధ తో చనిపోయారు.
దోమల్ని చంపలేక చనిపొయారు.
అవును చికెన్ గున్యా వచ్చి ఎవరూ చనిపొలేదు.


జిందాబాద్...జిందాబాద్..మన పరిశీలనా జ్ఞానానికి జిందాబాద్.
జిందాబాద్...జిందాబాద్..మన దేశ సౌభాగ్యానికి జిందాబాద్.

3 comments:

Naveen Garla said...

చాలా బాగా చెప్పారు. మీ గొంతు డిల్లీ దాకా వినపడితే చాలా బాగుండేది.

spandana said...

బాగా చెప్పారు.
ప్రత్యక్ష కారణం కాకపోయినా పరోక్షంగా అది ఎన్ని ఇబ్బందుల్ని, మరణాల్ని తెచ్చిందో!
--ప్రసాద్
http://charasala.com/blog/

Anonymous said...

నవీన్ గారూ,

చెవుల్లో సీసం పొసుకున్న వాళ్ళకు బ్రహ్మాండం బద్దలయినా వినిపించదు. వాళ్ళు డిల్లీ లో వున్న గల్లె లో వున్న ఒకటే.

ప్రసద్ గారు,
ఏ గున్యా దెబ్బ మా ఇంట్లో వాళ్ళు, పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు, పక్క వీధిలో వాళ్ళు ఇంక నా స్నేహితులు అందరు దాని బారిన పడ్డారు.
పరొక్షంగా నేను కూడా.

మీ అభిప్రాయాలకు ధన్యవాదాలు.

విహారి