నేను సైతం..
తోటి తెలుగు బ్లాగర్లకు,
మన తెలుగు కు మీఅందరూ చేస్తున్న కృషికి నా వంతు సహాయం చెయ్యాలనే ఉద్దేశ్యం తో నేను కొంత కాలం కిందట నా బ్లాగు ను మొదలు పెట్టా. కానీ గత మూడు వారాలనుండి బ్లాగు లో కాలు కానీ వేలు కానీ పెట్టలేదు. ఇందుకు మూడు కారణాలు. ఒకటి రెండో పుత్రుడు("సుహాస్ విహారి") పుట్టడం, రెండు ఇక్కడ తెలుగు సంఘ(మనం సాంస్కృతిక కార్యదర్శి పదవి వెలగ బెడుతున్నాం) దీపావళి సాంస్కృతిక సంబరాలు(18-Nov-06) దగ్గరవ్వడం మరియు ఆఫీసు లో పని ఎక్కువవడం వల్లా నేను కొంచెం వెనకబడ్డా.
ఇక అసలు విషయం లోకి వస్తా. ఈ తెలుగు బ్లాగులకు మరింత ప్రాచుర్యం కల్పించాలని ఈ సారి దీపావళి సంబరాల్లో( 350 నుంచి 500 వరకు రాగలరని అంచనా) మన బ్లాగు గురించి వేదిక మీద చెప్పాలనుకుంటున్నా. అందుకు మీరు ఏదైన సలహాలు ఇవ్వగలరని ఆశిస్తున్నా. కర దీపికను(http://veeven.com/misc/telugu-web.pdf) అందరికి పంచి పెట్టే ఏర్పాట్లు కూడా చేస్తాను(కార్యవర్గం నుంచి అనుమతి తీసుకుని).
దీనికి ఇక్కడి తెలుగు (డెన్వర్, కొలరాడో) వారినుండి మంచి స్పందన లభిస్తే ఇక్కడ అమెరికాలోనున్న మిగిలిన తెలుగు సంఘ కార్యవర్గాలకు కూడా జాబు రాస్తాను.మన బ్లాగులో ఎవరైన తెలుగు సంఘ సభ్యులు వుంటే నాకు టపా పెట్టగలరు. అందరం కలిసి పని చేద్దాం.
మనసు తెలుగు
మాట తెలుగు
భాష తెలుగు
భావం తెలుగు.
జై తెలుగు తల్లి.
విహారి.
5 comments:
భలే భలే..మీ అబ్బాయి సుహాస్ విహారి పుట్టిన సందర్భంగా శుభాకాంక్షలు
సుహాస్ కు హార్దిక శుభాకాంక్షలు
శుభాకాంక్షలు. ఇంతకూ సుహాస్ విహారి పుట్టిన తేదీ?
దీపావళి సాంస్కృతిక సంబరాలు(18-Nov-06). ఏమిటి ఇంత ఆలస్యంగా దీపావళి సంబరాలు?
రవి గారికి, శొధన గారికి, నాగరాజ గారికి
మీ శుభకాంక్షలకు ధన్యవాదాలండి.
సుహాస్ పుట్టిన తేదీ 18-nov-06
CB రావ్ గారూ,
మాకు సరయిన ఆడిటోరియం దొరక్క ఇలా ఆలశ్యంగా చెయ్యల్సి వస్తోంది.
విహారి
Post a Comment