Friday, September 12, 2008

నన్నొగ్గెయ్యండి

నా కొత్త టపా, ఏ ప్రాజెక్టు బిడ్డింగులో ఎంతమంది పాల్గొన్నా చివరికి కాంగ్రేస్ సపోర్టర్ కే దక్కినట్టు, కూడలి లో పైన కనిపిస్తోంది. దానికి కారణం నేను చేసిన చిన్న తప్పిదం. అంతే కానీ కాంగ్రేసు పార్టీ లో చేరినట్టు కాదు. భారత కాల మానాన్ని అందుకొనే ప్రయత్నము లో ప్రచురించే సమయం 10 గంటలకు 12 కలపబోయి 10 తేదీని 12 వ తేదీ చేశా. అదే ఇప్పుడు కూడలి లో కపి రాజు లా రెప రెప లాడ్డానికి కారణం. ఇలా కనిపించినందుకు ఇప్పటికే మీరు నన్ను చాలా సార్లు(=కూడలికి వచ్చినన్ని సార్లు) శపించి వుంటారు కదా. మీరు నన్ను క్షమిస్తే శాపాలు పెట్టిన వాళ్ళందరూ మునిపుంగవులని, దైవ భక్తులని, మహా మహిమాన్వితులని భావిస్తాను. మీరు ఈ వర్గాలు నచ్చని వాళ్ళయితే మథర్ తెరెస్సా, మార్టిన్‌ లూథర్ కింగు, రాబిన్‌‌ హుడ్ అంతటి వరని గౌరవిస్తాను.

బ్లాగు బద్దమైన హెచ్చరిక: ఈ టెక్నిక్కు ను మళ్ళీ ఎవరైనా ప్రయత్నిస్తే అది పనిచేయదు. పైపెచ్చు మీ టపా పాతాళానికి వెళ్ళిపోతుంది.(కూడలోళ్ళకి తెలిసిపోయింది)

10 comments:

Purnima said...

:-)

Bolloju Baba said...

అదా సంగతి
ఒకటి రెండు సార్లు చూసి కూడలి అప్ డేట్ అవ్వటం లేదేమిటబ్బా అని అనుకున్నాను.
మనలో మనమాట ఈ టెక్నిక్కు ప్రయత్నించటానికి, ముందు మీవివరణ నాకు అర్ధం అవ్వనేలేదు ఎందుకంటే నేను కొంచెం టెక్నికల్లీ చాలెంజెడ్ లెండి.
:-))

మీ నిజాయితీకి ఒక మెచ్చుకోలు.

బొల్లోజు బాబా

రాధిక said...

నేను కూడా కూడలి అప్డేట్ అవ్వట్లేదు అనుకున్నాను. బాగుంది. :)

Srikanth said...

ఏమిటా విహారి గారు ఆగకుండా విహరిస్తున్నారు అనుకున్నాను
:-)
ఇదా సంగతి

నేను కూడలిలో ప్రాబ్లం అనుకున్నాను

మొత్తాని కి మీ ప్రాబ్లం బాగుంది

phani said...

శాపాలు ఇచ్చిన వాళ్ళంతా ముని పుంగవులు,మహిమాన్వితులు కాదు,ఆ శాపాలు పలించినపుడే వాళ్ళు మహిమాన్వితులవుతారు.

durgeswara said...

నిజమేనండీ నాకుకూడా మీరు కాంగ్రేస్లో మనిషేమోనన్న అనుమానంవచ్చింది సుమండీ

బ్రహ్మి- సాప్ట్ వేర్ ఇంజినీర్ said...

అయితే నేను కూడా మహిమాన్వితుణ్ణే అన్నమాట !

బుజ్జి said...

@bolloju baba
technically challenged-- idedo bagunde...

Bolloju Baba said...

ఈ మాటను సుజాత గారనుకుంటా మొదటగా వాడింది.
ఇదేదో బాగానే ఉందని వాడా
బొల్లోజు బాబా

vaishnavi said...

ammo dinikosam anni shapalaa

ayina pilli shapalaku dadichevallevaru