Wednesday, October 15, 2008

ప్రపంచ చేతులు కడుక్కునే రోజు (Global handwashing day)

కంపెనీలు : ఉద్యోగులను ఇంటికి పంపించి
స్టాక్ మార్కెట్ : ఇండెక్సును కిందకి పంపి
చిరంజీవి: ప్రజాపర్యటన మధ్య లో ఆపేసి
వై.ఎస్.: 24 గంటలు బీరు తయారీకి అనుమతిచ్చి
భారతీయ రిజర్వు బ్యాంకు: ఒక శాతం వడ్డీ తగ్గించి
తమిళెంపీలు: 39 రాజీనామాలు కరుణా నిధి చేతిలో పెట్టి
నేను: ఒక టపా రాసి

12 comments:

సిరిసిరిమువ్వ said...

:))), చేతులు కడిగేసుకున్నారా!--అంటే మీరిక టపాలు రాయరా!!

Anonymous said...

మరి చంద్రబాబు ఏం చేసి?..... చెప్పరా, ప్లీస్..ప్లీస్

శ్రీసత్య... said...

బాగుంది.మరి మిగిలిన రాజకియ్యా వాదులు ఏంచెసారండి...!

cbrao said...

అమెరికాలో కడుక్కోవటం చూడలేదు.అంతా కాగితంతో తుడుచుకోవటమే.నేనంటాను global-handwashing-day కాదు,ప్రపంచం చేతులు తుడుచుకునే దినం అని.

cbrao
Columbus,Ohio.

చైతన్య.ఎస్ said...

మరి మన కె.సి.ఆర్, నారాయన, దత్తన్న, ఎం.ఎస్.ఆర్. వీళ్ళ సంగతేం గాను?

జ్యోతి said...

ఆవును విహారీ, ఇంకా చాలామందిని వదిలేసావ్ ఏంటి?

అన్నీ బానే ఉన్నాయి. నిన్ను చేతులు కడిగేసుకునేలా మేము చేయనిస్తామా?? ఆ ఆశ వదులుకో..

సుజాత వేల్పూరి said...

నేనూ నిన్న పేపర్లో చూసి నిర్ఘాత పోయాను..."ఇలాంటిదొక రోజుంటుందా " అని! వెర్రి కుదిరింది, రోకలి తలకు చుట్టమన్నాట్ట వెనకటికెవరో!

రావు గారూ,
అమెరికాలో కనీసం చేతులన్నా కడుక్కోరంటారా? హ హ !

Anonymous said...

హమ్మయ్య... నేనూ ఈ కమెంటు రాసి చేతులు కడుగేసుక్కుంటా... -)

వేణూశ్రీకాంత్ said...

మీరేదో కరెంట్ ఎఫైర్స్ ని కలుపుతూ నవ్వించే ప్రయత్నం చేసారనుకున్నా కానీ నిజమని తెలిసి అచ్చెరువొందాను సుమీ !!! visit this for more info http://www.globalhandwashingday.org/

Sujata M said...

brilliant

Ramani Rao said...

నెను : ఒక్కో టపా రాసి అంటే బాగుంటుందేమో విహారి గారు.

Eliyas said...

బాగుంది బాగుంది