Wednesday, December 10, 2008

ఈ వారం సిద్ధ - బుధ్ధ (లతోబా బాబా, లంబ కోణ దృక్కోణం)”

* * * * * * * *


"బాబా బాబా.... లతోబా బాబా.
ఇల్లా బాబా...ముల్లా బాబా.
లాహి..లాహి లతోబా..ఇల్లా ఇల్ల లతోబా"
"ఎవరండీ ఇక్కడ ఇంట్లో ఏవైనా పూజలు చేస్తున్నారా?"

"బల బల బల బల బాబా?...ఓ ఎవరు?.... పక్కింటి ఎంకట్రావు గారా? పూజ చేసుకుంటున్నామండి "
"ఓ ఈ బాబా నా. నాకు బాగా తెలుసు. ఈ లతోబా బాబా దయవల్లే మనం ఇంకా బతికి వున్నాం..నేను కూడా భజన చేస్తా
బాబా బాబా లతోబా ..బాబా బాబా లతోబా."

"మమ్ములను దయ చూచు లతోబా...
మమ్ములను కరుణించు లతోబా...
ఎవరక్కడ మళ్ళీ తలుపు కొడుతున్నారు?"
"నేను సిద్ధా! ఎదురింటి సుబ్బారావును. ఏవిటి ఇక్కడ భలే బజనలు వినిపిస్తున్నాయి."

"ఓ మీరా? రండి. మనమందరం సుఖంగా ప్రాణాలతో వుండాలని లతోబా బాబా కి పూజ చేస్తున్నాం"
"అయ్యో ఎంత మాట. నాకు చెప్పరే. నేనూ పూజలో కూచుంటా..
మామ్ములను కాపాడు లతోబా....
ఈ దీనులను కాపాడు లతోబా..."

"మీరూ బాగా పాడుతారు..ఇపూడు కొంచెం హెచ్చు స్వరం లో పాడాలి..బాబా..బాబా"
"లతో బాబా. లతో బాబా "

"బాబా బాబా... దీనుల బాబా…"
"లతో బాబా..."

"బాబా బాబ... దీవించు బాబా…"
"లతో బాబా..."

"బాబా..బాబా..
లతో బాబా.. బాబా..బాబా….
భూమ్మీద బాబా....లతోబా బాబా.
బూడిద లేని బాబా...లతోబా బాబా.
లతోబా...లతోబా... ఇల్లల్లా... జిల్లిల్లా....లతోబా"

* * * * * * * *"రేయ్ సిధ్ధా…ఒరేయ్..సిధ్ధా? ఒరేయ్ లేవరా? పద కొండు గంటలవుతోంది పోతే పోనీలే అని పడుకోనిస్తే మధ్యలో ఆ బాబా గోలేంటి?"
"బాబా బాబా ...లతోబా...
భాబా బాబా ... లతోబా.."

"ఆ నమస్కారాలేంది ఆ పాటలేంది నీ నెత్తిన ఓ బిందె నీళ్ళు కుమ్మరిస్తే కానీ ఈ లోకం లోకి రావు...ఆ నీళ్ళ బిందెక్కడ... ఇక లేచి చావు"
"అమ్మో..అయ్యో..ఓర్నాయినో లతోబా నీళ్ళు... లతోబా నీళ్ళు"

"లతోబా నీళ్ళు కాదు మున్సిపల్ నీళ్ళు...ఆ అరుపులాపి ఇప్పుడు చెప్పు ఈ లతోబా బాబా ఎవర్రా? కొత్తగా ఎవరైనా స్వాములొచ్చారా?"
"అయ్యో ఇదంతా కలా? అది కాదండీ మనం ఇన్నాళ్ళు బతికున్నామంటే కారణమెవరు? ఈ లతోబా బాబానే. ఈ లతోబా బాబా కన్ను తెరిచారంటే మనమందరం భస్మమయిపోతాం.."

"సరే ముందు ఈ బాబా ఎవరో చెప్పు తరువాత భస్మమవుతామో, చూర్ణమవుతామో చెబ్తా"
"అదేనండి లష్కర్-ఈ-తోయిబా. పట్టు మని పది మంది కూడా లేని వాళ్ళు ఇరవై మిలియన్ల ప్రజలున్న నగరాన్ని గడగడ లాడించారు కదా. వాళ్ళు ఓ 500 మంది వచ్చారనుకోండి మన వంద కోట్లు ఏమవ్వాలి? అందుకే ముందు జాగ్రత్త చర్య గా పూజలు చేసి ప్రసన్నం చేసుకుంటున్నా."

"నీ లాంటి దద్ధమ్మల్లాంటి నాయకులుండ బట్టే ఇలా వాళ్ళు బరితెగించ గలుగుతున్నారు. వీళ్ళని ఖలిస్థాన్ టెర్రరిస్టులను అణిచినట్లు అణిచి వేసుంటే ఇప్పుడు ఇలా తెగ బడే వాళ్ళు కాదు. ఇలాంటి వెధవల్ని దయా దాక్షిణ్యం లేకుండా పిచ్చి కుక్కల్ని కాల్చినట్లు కాల్చి పడెయ్యాలి. పట్టుకున్న ఆ ఒక్కణ్ణి కూడా ఇంకో కొన్ని రోజుల తరువాత వాడి సహధ్యాయుల దగ్గరికి పంపిస్తారు చూడు"

"ఊర్కోండి. ఆ ఒచ్చినవాడిని విడిపించేస్తారు చూడండి ఏ లింకో పెట్టేసి."
"ఓహో నువ్వు పాకిస్తాన్ వాళ్ళ వర్షను చదివావనుకుంటా"

"మళ్ళీ ఇందులో ఇంకో వర్షనా?"
"అవును. వాళ్ళుద్దేశ్యం లో ఆ పట్టు బడిన వాడి పేరు అమర్ సింగు. పంజాబు వాడు. అంతే కాదు గతం లో రా(RAW) ఆఫీసరు కూడా. వీడు బి.జె.పి. సానుభూతి పరుడు. అందుకే కర్కరే మాలెగావ్ కేసుల్లో హిందువులను ఇరికిస్తున్నాడని వీడే మొదట చంపేశాడట. మిగిలిన వాళ్ళందరూ కూడా బి.జె.పి. సానుభూతి పరులట. బి.జె.పి. ఈ సారి గెలవలేదని ఈ కుట్ర పన్నారట"

"అమ్మో నాకిప్పుడు ఫ్యూజు కొట్టేసింది. ఇంత బాగా ప్రచారం చేసుకుంటున్నారా వాళ్ళు?"
"అప్పుడే ఏమయ్యింది ఐక్య రాజ్య సమితిలో ఈ విషయాన్ని పెట్టి దీన్ని కూడా భారత ప్రభుత్వం మీద తోసేస్తారు. మనోళ్ళు చెక్క భజన చేసుకుంటూ వుంటారు. వీలయితే ఎలక్షన్లలో దీన్ని వాడుకుంటారు."

"మొన్న జరిగిన అయిదు రాష్ట్రాల ఎలక్షన్లలో ఎవరు గెలిచినట్లు?"
"షీలా దెబ్బకు డిల్లీ బి.జె.పి. డీలా,
రాజస్థాన్ లో రాజే లీజుకు బూజు ,
చత్తీస్ గడ్ లో చితికిపోయి చిత్తయిన చెయ్యి,
మధ్య ప్రదేశంబునన్ కమల కలశం ప్రకాశించెన్ చౌహాన్ తోడన్ ,
లాల్ తన్వాలా మిజోరము వాలా చూపెను చెయ్యి జ్వాల"

".....డొంక తిరుగుడు రూట్లు ఇలానే పుట్టుంటాయనుకుంటా.."
"ఏంటా గొణుగుడు..."


* * * * * * * *"అయ్య గారూ నా మేనల్లుడు మొన్నొచ్చాడండి. వాడి ధోరణి చాలా విచిత్రంగా కనిపిస్తోంది"
"ఏమిటది"

"అందరికీ నచ్చింది వాడికి నచ్చటం లేదు. ఎవరికీ నచ్చనిది వాడికి నచ్చుతుంది."
"ఓస్..అంతే కదా"

"మంచి సినిమాలు బాలేవంటాడు. బాగాలేని సినిమాలు బాగున్నాయంటాడు"
"ఇదేదో కొత్తగా వుందే"

"వర్షం పడితే కవిత, వర్షం ఆగితే కవిత, ఎండొస్తే కవిత, నీడొస్తే కవిత."
"అహా...."

"ఇంకా బస్సు ఎక్కుతుంటే కవిత, దిగుతుంటే కవిత.."
"ఇంకా చాలానే వుండాలే"

"దానికి తోడు కంప్యూటర్ వాడాయా. కొత్తగా ఏదన్నా వస్తే దానిగురించే మాట్లాడతాడు."
"ఇక మిగిలిన లక్షణాలు నేను చెబ్తా. పుస్తకాలు చదివితే ఏదో రాయాలని పిస్తుంది. టెర్రరిస్టు కనిపిస్తే కాల్చేసి మసి చెయ్యాలని కూడా అనిపిస్తుంది. రాజకీయ నాయకులంటే అసలు పడదు కానీ మామో, బాబాయో రాజకీయ నాయకుడైతే వాడి గురించి అసలు మాట్లాడ బుద్దెయదు."

"భలే కనిపెట్టేశారు"
"ఎక్కడకు పోయినా అవినీతి వుండకూడదంటాడు. ఇళ్ళు, అపార్టుమెంట్లు కొనేటప్పుడు రిజిస్ట్రేషన్ ఫీజులు ఎగ్గొడతాడు. పైరవీలు పోవాలంటాడు గుట్టు చప్పుడు కాకుండా పైరవీలతో తిరపతి కొండ మీద పనులు చేయించుకుంటాడు. పైరసీ పోవాలంటాడు. పైరసీ సినిమాలు చూస్తాడు. పైరసీ సాఫ్టువేర్ వాడతాడు."

"అవునండోయ్. "
"ఇంకా చెప్పుకుంటూ పోతే ఎవరికైనా పేరొచ్చిందని తెలిస్తే ఆ పేరొచ్చినోడి లాగే ప్రవర్తించాలనిపిస్తుంది. తనో వెరైటీ వ్యక్తి అని కూడా అనుకుంటాడు. అన్నింటికి మించి నా దృక్కోణం లంబ కోణం అంటాడు. అవునా?"

"అంత కరక్టుగా ఎలా చెప్పగలుగుతున్నారు? ఇదేమైనా ఒక జబ్బా?"
"ఓ మాదిరి జబ్బే"

"దీనికి విరుగుడు"
"బ్లాగర్లనడుగు "

* * * * * * * *చదివిన వారికి, వ్యాఖ్యానిస్తే వ్యాఖ్యాతకు ముందస్తు ధన్యవాదాలు.


* * * * * * * *

12 comments:

వేణూ శ్రీకాంత్ said...

హన్నా !! అంటే ఏవిటి మీ ఉద్దేశ్యం !! ఆహా నాకు తెలీకడుగుతున్నా :-)బ్లాగర్లనందరినీ ఒకే దెబ్బతో ఉతికి ఆరేద్దామనే !!

Aruna said...

:)

బొల్లోజు బాబా said...

:-)

జ్యోతి said...

ఈ లతోబాకి బ్లాగర్లకి లింకేంటి..

మధుర వాణి said...

బాగా చెప్పారు :)

krishna rao jallipalli said...

"దీనికి విరుగుడు"
"బ్లాగర్లనడుగు " ..... అర్థం అయ్యింది.

cbrao said...

@ కృష్ణారావు: మీకు ఏమర్థమయ్యిందో కొంచం క్లుప్తంగా రాయండి.

krishna rao jallipalli said...

నమస్తే సి బి రావు గారూ.. వేరే అర్థం ఏముంది.. ఈ మద్యన మన బ్లాగరులు పోకడులు చూస్తున్నారు కదా.. అవునంటే కాదనులే .. పీకి పీకి పెట్టడం.. విషయం ఒకటి చర్చ వేరొకటి.. కోడి గుడ్డుకి బొచ్చు పీకడం.. తామే మేధావులు అనుకోవడం.. తిమ్మిని బమ్మి చేయడం.. అర్థాలనే మార్చి వేయడం .. చర్చలని ఎక్కడికో తీసికెళ్ళి పోవడం.. ఇలా అన్నమాట నేను అర్థం చేసుకొన్నది.

విహారి(KBL) said...

నూతన సంవత్సర శుభాకాంక్షలు విహారిగారు.

A said...

vihari gaaru,
mi tapalu anni baguntayandi.
oka company ki owrk cheseppudu mimmalni contact chesanu. mimmalni adrshamga tiskoni Edo oka chinna prayatnam www.kingmanual-t@blogspot.com
chusi cheppanid.

తెలుగుకళ said...

విహారి గారూ !
లతోబా - ని ఒక బాబాగా లష్కరే తోయిబా (బా) గా పరిచయం చేసిన విధానం బాగుంది.
అవును మరి . సమర్థులు చేతగానట్టు చేతులు మూసుక్కూర్చుంటే , అసమర్థులు సమర్థులై లొసుగులని ముసుగుల్లాగా మార్చుకుని అమాయకులపై దాడి చేస్తారు.
అంతా ఐపోయాక నెత్తీ నోరూ బాదుకోవటం, దొరికిన దుర్మార్గుడి ఇంటర్వ్యూలు , అభిప్రాయాలతో సెన్సేషన్ క్రియేషన్ చెయ్యటం ఇదేమరి మన సత్తా..........

oremuna said...

బొత్తిగా నల్లపూసయిపొయ్యారు

ఎలా ఉన్నారు

ఏం చేస్తున్నారు.