ఈ దుశ్చర్యను ఖండించాలా?
ముంబైలో విదేశీ ముష్కరులు చేసిన మారణకాండను ఖండించాలా? ఎందుకు ఖండించాలి? ఖండించాల్సింది జరిగిన దుస్సంఘటనను కాదు.
ఈ సంఘటనకు శాయశక్తులా సహాయపడిన స్వదేశీ రాక్షసుల కుత్తుకలను ఖండించాలి.
వేలకు వేలు జీతాలు తీసుకుంటూ ప్రత్యర్థి పార్టీల గుట్టు మట్లు తెలుసుకోవడానికి చూపిస్తున్న స్వామి భక్తి పరాయణత ను దేశ భద్రత మీద పెట్టని ఇంటెలిజెన్సు అధికారుల కుత్తుకల్ని ఖండించాలి.
వస్తోంది మాదక ద్రవ్యమో, మందు గుండో తెలుసుకోకుండా లంచం తీసుకుంటూ ఆయుధ సామాగ్రి ని దేశం లోకి అనుమతిస్తున్న సరిహద్దు నిఘా విభాగం అధికారుల కుత్తుకల్ని ఖండించాలి.
ఒంటి మీది తెల్ల చొక్కా నలగకుండా నలుగురు ప్రజలు కనిపిస్తే రెండు వేళ్ళు పైకెత్తి చూపించే భ్రష్ట రాజకీయ నాయకులకి చూపిస్తోంది చేతకాని తనమని చెప్పి వాళ్ళ చేతులు ఖండించాలి.
సంక్షోభ సమయం లో సంఘీభావాన్ని ప్రకటించకుండా తగుదునమ్మా అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి ప్రభుత్వ వైఫల్యమని చెప్పే ప్రతిపక్ష రాజకీయ నాయకుల కాళ్ళు ఖండించాలి.
8 comments:
వీరితోపాటుగా ఓటుబాంకు రాజకీయాలతో తీవ్రావాదుల మీద చర్యలు తీసుకొమ్మంటే అదేదో ప్రత్యేకించి ఒక మతం మీదే చర్య తీసుకోవాలని అడిగినట్లు పనికిమాలిన బిల్డ్-అప్ లిచ్చే రాజకీయా నాయకులను కూడా ఒక చూపు చూడాలి.
encounter లు చేస్తే మానవ హక్కులు అంటారు. ఢిల్లీ లో చూసాం కదా మన అమర్ సింగ్ గారు విరాళం ఇచ్చారు. ఇక స్వదేశీ రాక్షసులు అంటారా ! మనం ఏం చేసిన చెల్లిపోతుంది అనుకుంటారు, ఎలాగు పార్టీలు ఓట్ల కోసం సానుభూతి వాతావరణం కలిగేలా చేస్తాయి అని వాళ్ళకు తెలుసు. ఇంకా మేధావులు కూడా ఉన్నారు, సందేహం వెలిబుచ్చడానికి. ఎక్కడ ఏమి జరిగిన మావైపు ఎందుకు చుస్తారు అంటాడు ఎం.ఐ.ఎం ఒవైసి ... మరి సంభందం ఉన్నా అటు వైపు వెల్లకూడదు అని వీడి ఉద్దేశం. అహ్మదాబాద్ పేలుళ్ళ కు సంబంధం ఉన్న బషీర్ హై.లో మదర్సా లొ పని చేసాడట. మరి అప్పట్లొ ఒక సారి తనిఖీ కి టాస్క్ ఫోర్స్ వెళ్తే మన రాజకీయనాయకుల నుంచి వచ్చిన ఒత్తిడి వల్ల వెనక్కు వచ్చేసారంట. మరి అప్పుడే వాన్ని పట్టుకొని ఉంటే ఆ బాంబు పేళుళ్ళు జరిగేదా ? శ్రీకాంత్ గారు మీరన్నది నిజం. తీవ్రవాదుల పైన చర్యలు అంటే అది ఏదొ ఒక మతం మీద మాత్రమే తీసుకుంటున్న చర్యలు అనే భావాన్ని, వాళ్ళకు లేకపోయిన మన రాజకీయ నాయకులు వాళ్ళకు కలిగించి పబ్బం గడుపుకుంటున్నారు. ముందు వీళ్ళ పని పట్టాలి.
ఇపుడు అమర్ సింగ్ కాని సమాజ్ వాది పార్టీ కాని మరణించిన జవాన్ల కోసం ఏమైన సహాయం ప్రకటించారా (నాకు తెలియదు) ?
అమర్ సింగ్ ఇప్పుడు కూడా మరణించిన తీవ్రవాదుల కోసం విరాళం సేకరించి పాకిస్తాన్ వెళ్ళి ఇచ్చొస్తాడేమొ...కుత్తుకలను ఖండించాలి అంటే ముందు వీడి నుంచి ప్రారంభించాలి.
మన దగ్గరున్న ఆయుధం ఓటే.ఆ ఆయుధంతోనే మనం వీళ్ళకు బుద్ధి చెప్పాలి.
ప్రతి సంఘటన జరిగిన వెంటనే ఈ సంఘటనను ఖండిస్తున్నాము అంటూ ప్రకటనలిస్తున్న మేకపోతు గాంభీర్య నాయకులను మొదట ఖండించాలి.
మతం,రాజకీయం,తీవ్రవాదం విడిపోనంత కాలం ఇంతే.
ఇప్పటికీ హైద్రాబాద్ లో పాతబస్తీ లో ఓ ప్రాంతానికి నీటి పన్ను , విద్యుత్ పన్ను కు కూడా ఎవరూ వెళ్ళరని చెప్తుంటారు.
రాజకీయం లో(తో) చివరికి రక్తమే మిగులుతుందేమో...
please i cant understand that situvation
@Vihari:
Wow!. You are firing in all cylenders. You forgot to fire on Islamic Terrorists, Pakistan and Ruling Congress headed by Sonia and Srdar.
It shows where your loyalty is. Educate the people with with facts and dangers that they are in with Islamic Terrorism and its sympathisers in Congress Party, Mulayam, Amar Singh and Laloo.
టెలివిజన్ లో ఫొటోలు చూస్తూ
అచ్చెరువంది అయ్యో అంటూ
చేతులు కట్టుకుని చర్చలు చేసే
మనుషులు ఉంటే మన బ్రతుకింతే
చావ తెచ్చుకుని మనమే ఏమైనా చెయ్యాలి. చెయ్యగలం
Post a Comment