మరొక్క సారి... అంటే మూడో సారి.. తెలుగు బడి మన బడి గురించి ..
* * * * * * * *
సిలికానాంధ్ర అని పేరు చెబితే అమెరికాలో కొంత మందే గుర్తుపట్టే వాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు ఆ పేరు చెప్పగానే ఏ కూచిపూడో, శాస్త్రీయ సంగీతమో, జాన పద కళో చప్పున గుర్తుకు వస్తుంది అమెరికా తెలుగోడి కైనా, తెలుగు దేశం లో తెలుగు మాట్లాడని వాడికైనా. ఆ సంఘం తెలుగు బాషకు చేసే సేవల్లో మన బడి ఒకటి. మన బడిని పిల్లలకు తెలుగు భాష నేర్పటానికి మొదలు పెట్టారు. ఇంతింతై వటుడింతై అన్నట్టు ఈ మన బళ్ళు ఉత్తర అమెరికా దేశం లోని అన్ని రాష్ట్రాలకు విస్తరిస్తోంది. ఇప్పటికి 14 రాష్ట్రాల్లో వేళ్ళూనింది. ఈ సంవత్సరం మరిన్ని రాష్ట్రాలు జత కలుస్తున్నాయ్. ఈ మన బడి ప్రయాణం లో మా కొలరాడో మన బడి కూడా విజయవంతంగా మూడో సంవత్సరం లోకి అడుగుపెడుతోంది. మా మన బడి పిల్లలతో పాటు నేను కూడా 'ప్రవేశం', 'ప్రకాశం' తరగతులు దాటుకొని పరీక్షలు రాయకుండా(దిద్దుకుంటూ)'ప్రమోదం' తరగతి లోకి అడుగు పెడుతున్నా నా మూణ్ణెల బడి సెలవులు ముగించుకొని. వాఁ..బ్యాక్ టూ స్కూల్. మళ్ళీ పలకా బలపాలూ..గోడ కుర్చీలూ..
ఈ సంవత్సరం తరగతులు వచ్చే సెప్టెంబరు రెండవ వారం లో మొదలవుతున్నాయి. మీ పిల్లలను ఇందులో చేర్పించాలంటే లేదా వారి ఊళ్ళలో ఈ మనబడి ప్రారంభించాలంటే రాజు చమర్తి గారిని(408-685-7258, raju@siliconandhra.org) లేదా శంకర్ తుములూరు గారిని(650-430-5958 sankar@siliconandhra.org) గానీ సంప్రదించండి.
కొన్ని వివరాలు:
1. చేరాలంటే 2009 సెప్టెంబర్ 1 కి ఆరు సంవత్సరాలు నిండి వుండాలి. (మా బుడ్డోడు కుడి చేత్తో నెత్తి మీదుగా ఎడమ చెవిని పట్టుకుంటాడు అది సరిపోద్దా అంటే కుదరదు.)
2. వారానికి రెండు గంటలు తరగతులు వుంటాయి. (మా బుడ్డది తైతక్కలాడ్డానికి వెళ్తుంది దీన్ని ఎగ్గొడితే మళ్ళీ క్లాసులు చెబుతారా అని అడక్కూడదు. ఎగ్గొడితే మార్కులు కోసేస్తారు.)
3. పిల్లలకు పెన్సిల్ దగ్గర నుండి పుస్తకాల వరకు ఈ సంస్థ వారే ఇస్తారు. (బజ్జి బువ్వ కూడా పెడతారా, పరీక్షలు కూడా మీరే రాసిస్తారా అని డవుట్లు వస్తే మీరు నాలుగణాలు ఆదా చేద్దామనుకునే పదహారణాల తెలుగు వారే.)
4. పాఠాలు భోదించే ఉపాధ్యాయులకు భోధనాంశాలు కూడా ఏ వారానికి ఆ వారం సులభంగా చెప్పేటట్లు వుంటాయి.(ఉపాధ్యాయులు కొన్ని తెలుగు పదాలను ఇంగ్లీషులో తర్జుమా చేసి చెప్పటానికి క్లాసుకు 372 వెంట్రుకలు సులభంగా పీక్కుంటారు)
5. ప్రవేశం, ప్రకాశం, ప్రమోదం, ప్రభాసం అని నాలుగు సంవత్సరాల తరగతులు వుంటాయి.(హమ్మయ్యా అని అనుకోవడం తల్లి దండ్రుల వంతు.)
6. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారిచే ఉత్తీర్ణతా పత్రాలు ఇవ్వబడతాయి.
ఇది ఉచిత విద్య కాదు. కొద్దో గొప్పో ఫీజులు గట్రాలుంటాయ్. పాఠాలు చెప్పే పంతుళ్ళందరూ వాలంటీర్లే.
* * * * * * * *
ఇంతకూ అంత చదివితే ఏమొస్తుందట అంటే.... మొన్న మా బుడ్డోడు తెలుగు లో తన చేతి వ్రాత తో ఓ ఉత్తరం,పంతుళ్ళయిన నానమ్మకు, తాతయ్యకు రాశాడు. వాళ్ళు ఎన్ని సార్లు దాన్ని చదువుకున్నారో ఎంత మందికి చెప్పుకున్నారో కనుక్కుంటే తెలుస్తుంది.
* * * * * * * *
3 comments:
372 అని అంత కరెక్ట్ గా ఎలా చెప్పారండీ?ఇంతకీ మీ సునిశిత పరిశీలనకు జోహార్లు.
vihaari gaaru.. i kept on following ur blog frm long tym.. meeru telugu development kosam chestunna pani chaala bagundi.. hatsoff.. :)
Great effort, keep it up....
Post a Comment