ఈ వారం సిధ్ద -- బుద్ధ(సాహస యోధుడు )
***
"అయ్య గారూ"
"ఏం సిద్ధా?"
"దేవుడెక్కడున్నాడు?"
"కాంగ్రేస్ పార్టీ లో వున్నాడు కదా?
"మరిప్పుడు వై.ఎస్ ఎక్కడున్నాడు?"
"దేవుడి దగ్గర కెళ్ళిపోయాడు?"
"ఏ దేవుడి దగ్గర కెళ్ళాడు?"
"వరుణ దేవుడు వచ్చి అసలు దేవుడి దగ్గరకు తీసుకెళ్ళిపోయాడు."
"అదే ఎందుకు అని?"
"సకాలం లో వర్షాలు పడనందుకు ఆందోళన చెందిన దేవుళ్ళు తమ ధైర్యం కోసం మొండి ధైర్యం కల వై.ఎస్. తోడుంటే బావుంటుందని."
***
నీకెలాంటి స్నేహితుడు కావాలని నన్నెవరైనా అంటే "నాకు వై.ఎస్. లాంటి స్నేహితుడు కావాలి" అంటాను.ఓ ఫ్రెండ్షిప్ డే నాడు వై.ఎస్. కు బెస్ట్ ఫ్రెండ్ అవార్డు ఎందుకివ్వాలో సరదాగా రాసినా అదెంత నిజమో ఈనాడు ఆయనను అభిమానించే వాళ్ళ సంఖ్య చూస్తే తెలుస్తోంది.
నిత్య అసమ్మతి నాయకుడైనా, అను నిత్యం తనను నమ్మే వాళ్ళను పేరుతో సహా గుర్తుపెట్టుకోవడం, ఆవేశం తో అసెంబ్లీ లో మైకులు విరగ్గొట్టినా, అవసరమొచ్చినప్పుడు అనుచర గణాన్ని ఆప్యాయంగా ఆదుకోవడం లోనూ ఈ మేరు నగ ధీరుడిని మించిన వారు లేరు. ముఖ్యమంత్రయినా పల్లెటూరి బిడ్డలోని ఆప్యాయతను మరిచిపోని ప్రజా నాయకుడు 'రాజస' శేఖరుడు .కట్టు బానిసల కాంగ్రేస్ లో కట్టి పడేసే కనికట్టు విద్య వున్న అసలు సిసలు నాయకుడు మరిక పుడతాడో లేడో.అచ్చ తెనుగు పంచ కట్టుతో చిద్విలాసంగా నవ్వుతూ చెయ్యి ఊపుతూ సాగే ఆ నడక ఇక కనిపించదంటే జీర్ణించుకోవడం కష్టం. పాద యాత్రతో రాష్ట్రాన్ని సృజించిన ఈ మడమ తిప్పని సాహసి దైవ యాత్ర లోని ఆత్మకు శాంతి కలగాలని ఆశిస్తూ.
**
4 comments:
meeru cheppindi nootiki nooru shaathmu karektu
ఇప్పుడు వరుణ దేవుడు వైయస్సార్ మా పార్టినే అని చెప్పుకుంటున్నడేమో -
దురదృష్టమేమంటే - వైయస్సార్ "మహాకూటమి అధికారంలోకి వస్తుందేమో అని వానదేవుడు దూరంగా వెళ్ళాడు" అని డిల్లీ లో చేసిన వ్యాఖ్యతో [అసెంబ్లీ లో అనుకుంటా] కాస్త దుమారం రేగింది, దానికి సమాధానమిస్తూ రఘువీరా రెడ్డి గారు, "మేము వరుణ దేవుడి దగ్గరకు వెళ్ళి క్షమాపణ చెప్పటనికి సిద్ధమే - కాకపోతే తోడుగా వారు [విపక్షాలు] కూడ వస్తే వారికి మళ్ల అనుమానం లేకుండ వుంటుంది అన్నారు"
ఈ మనిషి మాటిమాటికీ 'వరుణదేవుడు మా పార్టీ' అంటున్నాడు గదా అని, వరుణదేవుడు రాజశేఖరరెడ్డిపార్టీలోకి వచ్చినట్టే వచ్చి, ఎవరూ లేని సమయం చూసి అగ్నిదేవుని సాయంతో రాజశేఖరరెడ్డినే తన పార్టీలోకి లాక్కున్నాడని నా అనుమానం. :-|
వరుణ దేవుడు రాష్ట్రం పై కరుణ చూపినా రాష్ట్ర నేతపై మాత్రం అరుణ నేత్రాన్ని చూపడం దారుణం.వై.యెస్.ఆత్మ కు శాంతి కలగాలని ఆశిస్తూ....................
Post a Comment