ధ.భ.నే.శు. - సర్ప సెలవులు
నాగ రాణి: స్వామీ! మీరు ఈ నాగులచవితికి కూడా నాకు గొడుగు తెచ్చివ్వక పోతిరి. చూడండి నా వొళ్ళంతా ఎలా తడిసి ముద్దయిందో.
నాగ రాజు: మహా మంత్రీ! మంచి తాటాకు ఛత్రాన్ని తెచ్చిమ్మని మీకు నాగుల చవితికి పక్షం ముందుగానే చెబితిని కదా. ఏమయ్యింది?
నాగ మంత్రి: ప్రభూ! నేను ఎచ్చట వెదికినను చైనా కోటు లే తప్ప తాటాకు గొడుగులు కనిపించడం లేదు. ఈ నాగ భక్తులు పోసే పాల బారిన మనము పడకుండా వుండాలంటే ఒకటే మార్గము. నాగుల చవితికి దసరా సెలవుల్లాగా సర్ప సెలవులు ప్రకటించండి రాజ్యమంతా.
నాగ రాజు: అందువల్ల మనకు కలిగే ప్రయోజనము?
నాగ మంత్రి: ఈ పాలు అన్నీ కల్తీ పాలు అందులో మళ్ళీ చైనా డబ్బా పాలు కలిసిపోయినాయి. చైనా పాములు మాత్రమే తట్టుకోగలవు. అవి తాగడం కాదు కదా తాకినా ఒళ్ళంతా దురద వస్తుంది మనకు. అసలే మీ పుట్టఃపురము చాలా ఏపుగా నున్నది. భక్తుల కళ్ళన్నీ మీ పుట్టఃపురము పైనే పడి చెంబులు చెంబులు కుమ్మరించుచుంటిరి. అందువల్ల ఈ సర్ప సెలవులప్పుడు మనమందరము వన భోజనాలని దట్టమైన అడవుళ్ళోకి వెళ్ళి వచ్చెదము.
నాగ రాణి: అవును స్వామీ! మన పుట్టఃపురము అంతా నాగార్జున సాగరము అయ్యింది. నాకు ఈదుట కన్నా పాకుడే ఇష్టము.
నాగ రాజు: అలాగే దేవీ. మీరు పాలలో, నీళ్ళలో ఈదుచున్న చూసి సంతసించే చపల రాఘవేంద్ర మానవున్ని కాదు. మహా మంత్రీ! వచ్చే నాగుల చవితికి వారము పాటు సర్ప సెలవులు ఇస్తున్నామని రాజ్యమంతా ప్రకటించండి.
5 comments:
బహుకాల దర్శనం మాష్టారూ. మీరు ధ. దే. ఈ. శు. ని ధ. భ. నే. శు. చేసినా వెంటనే గుర్తుపట్టాను మీరేనని :)
:-)
ఏవేవో లింకుల నిచ్చెనల్ని పట్టుకుని మీ ఇంటికి వస్తే మీ దర్శన భాగ్యం కలగలేదు. మధ్య మధ్య వస్తూనే ఉన్నాం. మన బడి గడుగ్గాయిల్ని చూసి నవ్వుకుని వెళ్తున్నాం.
ఇప్పటికి మీరొచ్చారన్న జాడ కనిపించింది. ఎలా ఉన్నారు మాష్టారూ..?
సర్ప సెలవులు ఆలోచన బావుంది. చైనా ఉత్పత్తుల బాధ సర్పరాణిగారికీ తప్పలేదన్నమాట.
మంచి పోస్టుతో మళ్ళొచ్చారు.. అభినందనలు.
గీతిక B
sir, mee article nu sunday andhra jyothi 24.11.13 sunday book lo prachuristhunnaam.
- sunday incharge
గీతిక గారు,
మీ అభిమానానికి సంతోషం..
****
no ఎవరండి?
Post a Comment