కాకి పిల్ల కాకికి ముద్దు... మా మంచి బ్లాగు నా బ్లాగే.
చాలా మందిని కుట్టిన చీమే నన్నూ కుట్టింది. మన భారత బ్లాగుల వాళ్ళు (www.indibloggies.org) ఉత్తమ బ్లాగుల పోటీ పెట్టారు. ఇందులో కొన్నింటిని తెనె గూడు వారు ప్రాయోజితం చేస్తున్నారు. అందులో కాలు పెడదామని అనుకున్నా. బ్లాగును కూడా తయారు చేశాను చాలా సమయం వెచ్చించి. అంతా అయిన తరువాత ఆలోచించా ఇంతకు మనకు అందులో పాల్గొనే సత్తా వుందా అని. బ్లాగు ప్రపంచం లో అడుగు పెట్టి 4 నెలలు అయింది. మా సుహాస్ వయసు కన్నా ఒక నెల ఎక్కువ. వాడు ఇప్పుడే దొర్లుతున్నాడు. అలాగే నేను కూడా దొర్లుతున్నా ఈ బ్లాగు లోకంలో. నాకన్నా ఎక్కువగా పరుగులు పెడుతున్న పీ.టి.ఉషలు బెన్ జాన్సన్ లు వుండగా నన్ను నేను నామినేట్ చేసుకోలేనని భావించి, చాలా విభాగాల్లో ఇతరులను బల పరచేసి వాళ్ళ బ్లాగులు పెట్టేశా.
నాకేమి మిగిలిందబ్బా అని బుర్ర గోక్కుంటే రెండు క్యాండిల్స్ బల్బు "Design Department" అని గాఠ్ఠిగా అరిచి టపీ మని ఆరిపోయింది. అవును ఇందులో నేనెందుకు పాల్గొనకూడదు అని ఓ నామినేషన్ పారేశా. మీరు కూడ యధాశక్తిగా నన్ను బలపరిచి గెలిపిస్తే కొత్త పెళ్ళికూతురిలా....క్షమించాలి ముఖ్యమంత్రి నియోజక వర్గంలాగా తళతళ లాడుతూ కళ గా ఉంటానని నేను ఈ బ్లాగుముఖంగా విన్నవించుకుంటున్నాను.
మీరు అలా నన్ను బల పరచలేక పోతే ఏ ప్రాతిపదికన అవార్డు ఇస్తారో కూడా మీరే చెప్పాలి. ఒక వేళ పొరపాటున నాకు అవార్డ్ వచ్చేస్తే, అవార్డ్ తీసుకునే రోజున ఈ అవార్డు కు నా బ్లాగుకు సముచితం కాదు అని, తీసుకోవడానికి మనస్సాక్షి అంగీకరించక పోతే దానిని ఒక కాల నాళిక లో పెట్టి వచ్చే సంవత్సరం బ్లాగుల పండగప్పుడు తీసుకుంటానని మీకు ఈ బ్లాగు ముఖంగా మౌసెనయంగా (సవినయంగా అని అర్థం చేసుకోగలరు) మనవి చేసుకుంటున్నాను.
మీ అందరికి ఇంకో హెచ్చరిక :-) మీరు నన్ను కాదని ఇంకొక బ్లాగును బల పరిస్తే నాకు ముందుగా తెలియ చేయండి. ఆ బ్లాగును ఎలాగైనా సం హరించడానికి ఓ పది ట్రోజాన్ హార్సులు (టాటా సుమోలు), ఓ పది స్కంక్పాక్స్ వైరసులు (శ్కార్పియోలు) పంపి పోటీ లేకుండ చెయ్యగల సాహసం కలవడననిన్ని మీకు దుర్వినయంగా హెచ్చరిస్తున్నాను.
మీరు నన్ను నామినేట్ చెయ్యడానికి ఆచరించ వలసిన పద్దతులు.
1. మీ ఎలక చేత నా URL (http://vihaari.blogspot.com) ను మింగించండి.
2. ఇక్కడికి వెళ్ళి లోపలికి ప్రవేశించండి.అనుమతి లేకపోతే నమోదు చేసుకోండి.
3. అక్కడ post ను మీ ఎలక చేత నొక్కించండి.
4. వచ్చిన URL లో మీ ఎలుక మింగిన నా బ్లాగు పేరును కక్కించండి.
5. ఆదా/భద్రపరచు(save) మీట ను వినాయక వాహనము చేత నొక్కండి.
6. tags వరుసలో దీన్ని ib06 ib06Design మీ ఎలుక చేత మళ్ళీ ఓ సారి మింగించి కక్కించండి.
7. మిగిలిన చోట్ల కూడ మీకు తోచింది రాయండి.
8. ఇక ఒక మంచి పని చేశామన్న తృప్తి తో మీ ఎలుక మీద స్వారి చేసుకుంటూ ఎక్కడికైనా వెళ్ళండి.
అన్నట్లు పన్లో పని. ఈ బ్లాగు అలంకారం ఎలా వుందో కూడ ఓ సారి చెప్పి వెళ్ళండి.
ఇట్లు
అమెరికా లో అసాధ్యుడు.
బాల బ్లాగు విహారి
11 comments:
బ్లాగు design ఆకట్టుకుంది. వజ్రొత్సవాల టపాలో చాలా సమాచారం అందించారు. మీ బ్లాగు తెలుగు బ్లాగులలో ఒక మంచి బ్లాగు.
ఇప్పుడు కాలనాళిక పదం అందరి నాలుకలపైనా ఆడుతోంది :)
chala bagundhi
jag
mii blaagu kotta pellikuutirilaa caalaa baagundi.nenu sodhana garu ichina link dwara velli amdarivi ichaanu.ala ivvachaa?save avutumda ala iste.
:-) ఈ టపా చాలా బాగుంది. ఇది మీ డిజైనర్ బేబి అన్నమాట. చాలా బాగుంది. ఒకే ఒక్క ఉచిత సలహా...హెడర్లో ఉన్న చిత్రం బరువు కాస్త తగ్గించండి. పేజీ తొందరగా లోడ్ అవుతుంది. పొడవు కూడా...800*600 resolution లో హెడర్ మాత్రమే సగం పేజీని ఆక్రమిస్తుందన్నది.
నేను చెప్పాలనుకున్నది శోధన గారు చెప్పారు...
header కొద్దిగా పెద్దగా ఉన్నట్టు అనిపించింది. కొద్దిగా size తగ్గించండి. లేకపోతే చాలా బాగుంది
@ రావు గారు
మీ అభిమానానికి కృతఙ్ఞుణ్ణి.
@ రానారె
కాల నాళిక పేరు అద్భుతంగా వుంది. కొత్త సినిమాల్లో ఈ పేరు మీద సెటైర్లు తప్పకుండా పడతాయి
@ Jag
Thanks
@ రాధిక గారు
మెచ్చుకున్నందుకు ధన్య వాదాలు.
నేనిచ్చిన సూచనల ద్వారా కూడ save చెయ్యొచ్చని అనుకుంటున్నా.
@ శోధన సుధాకర్ గారు
మీరు చెప్పింది కరక్టే దాన్ని మార్చడానికి ప్రయత్నిస్తున్నా. కాస్త CSS మీద పట్టోస్తే దాని పని పడతా.
బాగుందన్నందుకు ధన్య వాదాలు.
@ ప్రవీణ్ గారు,
సుధాకర్ గారు చెప్పిందే మీరు చెప్పారు. మీరిద్దరు చెప్పిందే నేను అనుకున్నా. నాకున్న సమయంలో దాని మీద దండ యాత్ర చెయ్యడానికి సరిపోక అలా నే పెట్టేశా.
బాగుందన్నందుకు ధన్య వాదాలు.
@ అందరికి
color matching సరీగ వుందా లేద అన్నది తెలియట్లేదు. ఎవరైనా చెప్పగలిగితే ఇంకా ఆనందిస్తా.
విహారి
నేనూ ఒక ఓటేసా !!
@ క్రిష్ రాం గారు,
మీరు వోటేసినందుకు ధన్యవాదాలండి.
విహారి
విహారి గారు,
డిజైను చాలా బాగుంది.
మీ బ్లాగు పేరు (heading) - ఇంకొంచెం పెద్దదిగా చేస్తే బాగుంటేమో? అలాగే, రంగుకూడా?
--నాగరాజు.
@ నాగ రాజు గారూ,
heading మారుస్తున్నాను. టైము ఉండట్లేదు.
ర్నగులు మ్యాచింగ్ రంగులు వేసాను పరిశొధించి. కొత్త రంగులు కూడా వేస్తా త్వరలో.
విహారి
Post a Comment