Wednesday, August 06, 2008

ఈ వారం సిధ్ద -- బుద్ధ (బ్లాగు సమీక్ష)

"అయ్య గారూ"
"హాయి హాయిగ జాబిల్లి తొలిరేయి వెండి దారాలల్లి ..."





"ఎక్కడున్నారు?"
"హాయ్ హమ్మా హాయ్ హాయ్ హమ్మ..."





"ఏమైంది మీకు?"
"చికు బుకు చికు బుకు రైలే...అదిరెను దీని స్టైలే.."






"అంత సంబరమెందుకో".
"ఇదిగో ఇందుకు"

"ఓసోస్ ..దానికే ఇంత ఆనందమా?..ఇప్పుడూ...నేను చెప్పేదేంటంటే ... అలాంటివి చాలా వస్తూ వుంటాయ్.... గదా.. ఆఁ..వస్తుంటాయ్ గదా..అందుకని...ఏరీ మళ్ళీ ఎక్కడికెళ్ళారు? కిందెక్కాడా కనబడ్డం లేదు."
"బీట్ ఇన్‌ మై హార్ట్...మేఘాలలో తేలి పొమ్మన్నది ..."

















"మహాను భావా ఆ మేఘాలేంటి ..ఆ విహరించడమేంటి? కాస్త కిందకొస్తారా?"






"మళ్ళీ ఆ చూపేంటి? సరే ఇప్పుడు నన్నేం చేయమంటారు?"








"ఏవిటేవిటి నేను ఇప్పుడు టోపీ తియ్యాలా? ఈ మాత్రం దానికే?"








"పెద్ద తిప్పార్లే మూతి.తియ్యక పోతే ఏం జరుగుతుందంట?"









"ఓ యబ్బో...ఇలాంటివి చాలా చూశాం "
"హాం ఫట్ .."





"నన్నొగ్గెయ్యండి బాబో..నన్ను సాండ్విచ్ చెయ్యకండి కావాలంటే మీకు టొపీలేం కర్మ,గంగూలీ లా చొక్కా కూడా తీసేస్తా.."



"అలా రా దారికి కూర్మాంఢం బద్దలవుతుంది. ఏమనుకున్నావో ఏమో ..డల్ల డర్కి వెధవా ."








"ఆ తిట్లేంది? ఇదిగో తీసేస్తున్నా అలా చూడకండి."
"హూ తొందరగా కానీ..డేగ డస్కి."








"కొత్త తిట్లు కూడానా ... తప్పదా?"






"తప్పదు సిడ్కాల సిత్తి!..."






"సరే చేసుకున్నోడికి చేసుకున్నంత. మీ ఖర్మ"





















"ఓలమ్మో...ఓరయ్యో..ఓలప్పో..."








"అందుకే అప్పుడే చెప్పా వింటారా? "

13 comments:

రాధిక said...

:) first smile
next congrats

cbrao said...

Congrats on this eve.

చైతన్య.ఎస్ said...

wow...nice one. బాగుంది విహారి గారు.

Anonymous said...

:) very nice.
malathi

సుజాత వేల్పూరి said...

విహారి గారు, మీ బ్లాగు సమీక్ష చదవడానికి నాకు గంటన్నర పైనే పట్టింది. ఎందుకంటే లింకులున్న చోట నొక్కుకుంటూ ఆయా టపాలన్నీ మళ్ళీ చదవడం వల్ల! టపాలెంత హాయిగా ఉన్నాయో, సమీక్ష కూడా అంత బాగుంది. అభినందనలు! మీ సమీక్ష రాసింది సిబి రావు గారని నా మనసు చెపుతోంది.

అన్నట్టు ఈ ఫోటోలన్నీ అత్యద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా 'కూర్మాండం ' ఫొటో!

జ్యోతి said...

బావుంది విహారి . కాని నీ బ్లాగు సమీక్ష ఎవరు రాసారో కనుక్కున్నావా లేదా??

Purnima said...

నిన్నే ఆ సమీక్ష చదివాను, అభినందనలు!! :-)

Kottapali said...

fantastic.
మీ ఇష్టైలే వేరు!
అన్నట్టు .. అభినందనలు!!

జ్యోతి said...

ఒక హింట్ ఇచ్చేదా?? హైదరాబాదులో ఉన్నవారెవరైనా జస్ట్ పదిహేను రూఫాయలు పెట్టి కంప్యూటర్ ఎరా పత్రిక కొంటే రాసింది ఎవరో తెలిసిపోతుంది.ఆ పేరు కోసమే కాదు , పత్రికలో పనికొచ్చే అంశాలు ఎన్నో ఉన్నాయిలెండి . ఆ డబ్బు వృధా కాదు. పత్రికలో సమీక్షకుల పేరు ఇచ్చారు. బ్లాగులోనే ఇవ్వలేదు..

Unknown said...

విహారి గారు బొమ్మలతో తెగ నవ్వించేశారు.. అదిరిపోయాయి. ఇక మీ బ్లాగు సమీక్ష రాసినది ఎవరన్నది సస్పెన్స్ విప్పుతున్నాను.. ఈ సమీక్ష రాసినది "వికటకవి" బ్లాగు శ్రీనివాస్ గారు. మంచి బ్లాగుకి చక్కని సమీక్ష రాసిన ఆయనకీ ధన్యవాదాలు.

- నల్లమోతు శ్రీధర్

ramya said...

:):):):))

Anonymous said...

@అందరికీ,

వ్యాఖ్యానించినందుకు ధన్యవాదాలు.
అదేంటో ఆశ్చర్యంగా 80 శాతం మంది ఆడవాళ్ళే కామెంటారు.

@ శ్రీధర్ గారు.

మీరు నా గురించి చక్కటి సమీక్ష వేసినందుకు ధన్యవాదాలు. అలాగే వికట కవి గారికి కూడా హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.

-- విహారి

వికటకవి said...

>> అదేంటో ఆశ్చర్యంగా 80 శాతం మంది ఆడవాళ్ళే కామెంటారు.
ఏమాటకామాటే, సిగ్గు విడిచి చెప్తున్నా, పొగిడే విషయంలో ఆడోళ్ళే ఫస్ట్. ఆ విషయములో మనం తరువాతే.

ఇక సమీక్ష అంటావా, నాదే కాదు, ప్రజాభిప్రాయమూ అలానే ఉంది. మరోలా రాస్తే, ఆ 80% ఆడోళ్ళ మరో పార్శ్వం చూసేవాణ్ణి నేను :-)