Wednesday, July 23, 2008

ఈ వారం సిధ్ద -- బుద్ధ ( అవిశ్వాసం, బ్లాగులు,ఊకదంపుడు)

* * * * * * * *


రేయ్ సిద్ధా!!!
అయ్య గారూ

ఎక్కడ అఘోరిస్తున్నావ్ రా
ఇక్కడే అఘోరిస్తున్నా

ఇక్కడికి వచ్చి చావు. ఈ చీకట్లో నన్నెవరో కట్టేశారు.
మిమ్మల్నీ కట్టేశారా?

ఏవిటి నిన్ను కూడా కట్టేశారా?ఇలా మనిద్దర్నీ ఎందుకు కట్టేసార్రా?
నాకేం తెలుసండీ. మీకెవరైనా శతృవులు వున్నారా?

నాకు తెలిసి ఎవరూ లేరు. తెలీకుండా ఎవరన్నా వున్నారేమో?
అయ్యగారూ నాకో అనుమానం.

నీ అనుమానం పార్లమెంటు కెళ్ళా. నువ్వు అనుమానమంటున్నావా? అణుమానం అంటున్నావా? ఏవరి నోట్లోంచి అను అని విన్నా అణు ఒప్పందం అనే అనిపిస్తోంది.తమరు నోరు తెరిస్తే మేము విని తరిస్తాం.
మీరు గానీ వై.ఎస్.ను గానీ ఏమన్నా అన్నారా?

ఏం ఏమీ అనకూడదా?.
నిన్న రేణుకా చౌదరి ఏమందో తెలుసా?

మొన్నేమందో తెలిస్తే గదా నిన్నేమందో చెప్పడానికి
సరే నేనే చెబుతా వినండి. మీకు చీకట్లో ‘టింగు’ వెలగడం లేదు

మళ్ళీ ఈ టింగేవిట్రా? అసలే ఎవరో కాళ్ళూ చేతులూ కట్టేశారని ఏడుస్తుంటే
అదే మీ బుర్ర టింగుమని వెలుగుతుంది గదా. దానికి టింగని పేరు పెట్టా.

కొంపదీసి నిన్ను నా వారసుడికి ప్రకటించ మంటావా ఏంటి?
అంతొద్దు. నా టింగు మీ టింగు కన్నా పెద్దది. నేను చెప్పేది వినండి. అసలే కట్టేసున్నారు.

వినక చస్తానా. ఆ కట్టేసినోళ్ళు నోరు, చెవులూ కూడా కుట్టేసుంటే బావుండేది
అక్కడే మీరు ఎదగ కుండా పోయారు. సృష్టి లో జరిగే ప్రతి కార్యానికి ఒక అర్థం పరమార్థం వుంటుంది.

నన్ను కట్టి పడెయ్యడం లో కూడా ఒక పరమార్థం వెతుక్కోమంటావ్. గుడ్డి పిల్లిని చూస్తే కుంటి ఎలుకకు కూడా లోకువ.
ష్. కుంటి, గుడ్డి అని చీకట్లో కూడ అనకండి. మా మంద కృష్ణ వింటే తన బృందంతో వచ్చి మీ మొహంలో మంద హాసం లేకుండా చేస్తాడు

సరే. మారెప్పకు చిరంజీవి లోకువ
భలే మారిపోయారు మంద పేరు వినంగానే. అలా వుండాలి భయమంటే.ఆంధ్ర జ్యోతోళ్ళు ఎప్పుడు నేర్చుకుంటారో.అదే దాని గురించే ఇందాకే చెబుతుంటే సరీగా విన్లా.

నువ్వేదో రేణుకా చౌదరి అన్నావ్
ఆవిడ గురించే. నిన్న పార్లమెంటులో ఓట్లేసారు గదా. అప్పుడు ఎం.పి. ఆది కేశవులు నాయుడు ఎలక్ట్రానిక్ వోటింగ్ మెషిన్ దగ్గరకెళ్ళి వోటెయ్యకుండా నిలిచిపోయాడా?

అవును. తరువాత ఎర్రం నాయుడు ఆయన చేత పేపర్ లో సంతకం పెట్టించుకొని ఎర్రింకుతో నో అని రాసి స్పీకర్ కు ఇచ్చేశాడు.
అప్పుడు ఆ పేపర్ లాక్కోబోతూ ఏమందో తెలుసా. "మళ్ళీ ఓ సారి ఆలోచించుకో వై.ఎస్. సంగతి నీకు తెలుసు గదా. తరువాత నీ బిజినెస్ నువ్వు సరీగా చేసుకోలేవు" అందిట.

నువ్వు ఈనాడు చదివావు. వెళ్ళు. వెళ్ళి సాక్షి చదువుకో
మీరు సాక్షికి ఫ్యానా?

నేను సాక్ష్యానికి ఫ్యాను
కట్టి పడేసారనే టెన్షన్‌ నుండి రిలీవ్ కావడానికి మీకో పజిల్. ఈ ప్రభుత్వం ఓడినట్టా? గెలిచినట్టా?

కాంగ్రేస్ గెలిచినట్టు, మన్మోహన్‌ ఓడినట్టు
ఈ తిరకాసేంటి?

మన ప్రధాన మంత్రెవరు
మన్మోహన్ సింగు

నిర్ణయాలు ఎవరు తీసుకోవాలి?
ప్రధాన మంత్రి

తీసుకుంటున్నదెవరు?
సోనియా

అక్కడ లేని తిరకాసు ఇక్కడెందుకోయ్. వెళ్ళి తెలుగు సినిమాలు చూడు
అయ్య గారూ మీరే గనుక ఇండిపెండెంట్ ఎం.పి. అయుంటే ఏమి చేసుండే వారు

వంద కోట్లు తీసుకొని అంతరాత్మ ప్రబోధానుసారం ఓటు వేసుండే వాడిని

* * * * * * * *

అయ్య గారూ. ఈ మధ్య బ్లాగులెలా వున్నయ్
వాటర్ వాటర్ ఎవ్వెరీ వేర్ లా ఎక్కడ చూసినా టపా టపా ఇన్ ఎవ్వెరీ కార్నర్

అన్నీ చదువు తున్నారా?
అన్నీ చదవాలంటే రోజుకు 72 గంటలు కావాలి. తరువాత చదువుదాం లే అనుకుంటే ఆ టపా కూడలి నుండి గాయబ్.

చాలా వెరైటీలున్నాయా?
ఏవిటో సంవత్సరం కిందటి తో పోలిస్తే రాసే వాళ్ళు నాలుగింతలు ఎక్కువయ్యారు. అప్పుడు అన్నీ దేనికవే వైవిధ్యంగా కనిపించేవి. అప్పుడు ఒక్కోరు ఒక్కో రకంగా రాస్తుంటే శైలిలో, దృక్పథం లో, ఆలోచనలో తేడా స్పష్టంగా కనిపించేది. ఇప్పుడు దాదాపుగా అందరి టపాలు ఒక్క లాగే కనిపిస్తున్నాయ్.

మీ కంటికి అలా కనిపించచ్చేమో. మిగిలిన బ్లాగర్లకు వేరేగా అనిపించొచ్చుగా
అయుండచ్చు. ఇది నా అభిప్రాయం అని మళ్ళీ చెప్పాలా?

అవును. ఆది బ్లాగరి అస్త్ర సన్యాసం పుచ్చుకొన్నారు. ఎందుకంటారు?
ఆయనకి కూడా రాసి రాసి బోరు కొట్టిందేమో. అందుకే తన ఓపికను ఎలా చూపించాడో తెలుసా? కీబోర్డు లోని అక్షరాలు నొక్కకుండా 1,2,3.. అంకెలున్న లైను మాత్రమ ఉపయోగించాడు కామెంట్లలో.

అంటే
!, 10/10.. లా అన్నమాట

ఇంకొంత మంది ఏకంగా ఇంగ్లీషులోనే రాసేస్తున్నారు గా
కొత్త సంవత్సరం రోజు అన్ని గుళ్ళూ తిరగటానికి తొందరగా ప్రసాదం తినేసి బయలు దేరినట్టు ఎక్కువ బ్లాగులు చూడాలని దానర్థం

మీ బ్లాగుకు కూడా జనాలు బానే వస్తున్నారన్నమాట.
ఇప్పుడు కూడలండ్రెడ్ వుండబట్టి రిజర్వేషన్ లతో నెట్టుకొస్తున్నాం గానీ. గుంపులో వుండుంటే ఆ కొన్ని క్లిక్కులు కూడా మిస్సు

ష్.. గట్టిగా అనకండి దాన్ని పునః పరిశీలన అని ఉద్యమాలు లేవ దీయ గలరు.
ఓరే.. ఇలా రిజర్వేషన్ తో ఎంత కాలం నెట్టుకొస్తాం రా. విషయముంటే ముందుంటాం. లేకుంటే వెనకుంటాం అంతే.

బాగా పాపులారిటీ రావాలంటే ఏం చెయ్యాలి
బ్లాగుల్లో యూత్ ఎలిమెంట్ బాగా నింపాలి

* * * * * * * *

మంచిది రా ఎలాగోలా నువ్వు కట్లు విప్పుకోని నా కట్లు విప్పుతున్నావ్
నేను కట్లు విప్పడమేమిటి?

మరి నా కట్లు విప్పుతుందోందెవరు?. ఎవరో నా కట్లు విప్పేశారు
అయ్య గారు నా కట్లు కూడా విప్పేశారు. వుండండి లైటు వేస్తా. అరె ఈయనెవరో కొత్త వాడి లాగున్నాడే. అయ్య గారూ ఈయన మీకు తెలుసా?

తెలీదే
నమస్కారమండి నా పేరు ఊకదంపుడు. ఊకదంపుడు అనే బ్లాగు వుంది. మిమ్మల్ని కట్టేసి వెళ్ళింది నేనే. మిమ్మల్ని కట్టేసి మీకు పోటీగా ఓ టపా రాసాను.

రాస్తే రాశారు గానీ దానికి మమ్మల్ని కట్టెయ్యడమెందుకు?
కట్టెయ్యక పోతే మళ్ళీ ఓ టపా రాసేస్తారేమో అని.

చెబితే మానేస్తాం గదా అంతోటి దానికి ఇలా చెయ్యాలా మమ్మల్ని. ఏం మీకు 'ఇంగ్లీషు యూ లివ్ లాంగా' కి కొత్త కాన్సెప్టు దొరకలేదా?
ఏదో సరదాకి రాసానండి.మనసులో ఏమీ పెట్టుకోకండే

ఎక్కడ పెట్టుకుంటాం లెండి అసలే వర్చ్యువల్ బ్లాగు లోకం.ఎవరికెవరో.
అలాగయితే మంచిదండి. ఇక నే వెళ్ళి రానా!!!

ఆగండి. ఓ చిన్న విన్నపం.ఈ సారి మీకు ఇలా డూప్లికేట్ సిధ్ధ బుద్ద రాయలనిపిస్తే నాకు చెప్పండి.
ఏం మిమ్మల్ని మీరే తాళ్ళతో కట్టేసుకుంటారా?

లేదు. మీకు ఇలా రాయాలనిపించినప్పుడు మా ఇంటిల్లి పాదికి ఏ హవాయి దీవులకో స్విట్జర్ల్యాండ్ పర్వత శ్రేణులకో రెండు వారాలు ప్యాకేజ్ ట్రిప్పు బుక్ చేసి పంపించండి చాలు. అప్పుడు ఎంచక్కా మీరేమైనా రాసుకోవచ్చు.

* * * * * * * *

13 comments:

జంబలకిడిపంబ said...

సరి సరి. మీరే నొక్కుల్లేక దిక్కులేనోళ్ళయితే, ఇంక మా గతేం కానూ, ఈ హోల్ సేల్ టపాలతో. నేనిప్పుడే నా టపా కూడల్లో పైకెత్తుకోని వస్తిని. మీది మీరే ఎత్తుకోవాల బాసూ.

Ghanta Siva Rajesh said...

వంద కోట్లు తీసుకొని అంతరాత్మ ప్రబోధానుసారం ఓటు వేసుండే వాడిని

ide matrm Keka

Anonymous said...

గుడ్డి పిల్లిని చూస్తే కుంటి ఎలుకకు కూడా లోకువ.
గుడ్డి అని చీకట్లో కూడ అనకండి. మా మంద కృష్ణ వింట...
కాంగ్రేస్ గెలిచినట్టు, మన్మోహన్‌ ఓడినట్టు
..........


విహారి కత్తీ ... గుడ్డి పిల్లి కాన్సెప్ట్ ఏమిటండీ... సామెత ఉందా లేదా దానికి మీరే క్రియేటర్ ఆ ... చెప్పండి విహారి గారు

Anonymous said...

విహారిగారు దీనిబట్టి నాకు అర్ధమయ్యింది ఏమిటంటే తమరు మా బోటి కుర్ర బ్లాగర్ల బ్లాగులని బొత్తిగా పట్టించుకోవటం మానేసారన్నమాట. అధ్యక్షా! ఇది చాలా అన్యాయం. మేము కూడా యువబ్లాగర్లసంక్షేమసమితి ని స్థాపించి తమబోటి వారి పై అవిశ్రాంత పోరాటం చేస్తాం.

ఊకదంపుడు said...

N.T.R అమెరికా వెళ్ళినప్పుడు, N.B.R లాగా, ఎదో మీరు మాల్దీవులో మారిషస్సో వెళ్లినట్టున్నారని.. మీట వత్తేశాను..
మీరు టింగులో బెట్టుకోకూడదు మరి.. అసలే మీ లాయరు నోటిసులెక్కడ వచ్చేసినయ్యో అని మైలు చూసుకోవడం కూడ మానేశాను..
చిక్కేంటంటే, తరువాతి టపా కూడా డూపు టపానే, ఈ సారి నుంచి కూడలి కబుర్లలో .. మీ టపా టైటిల్ చెప్పాగానే "మిగిలనవారందరూ" (http://andam.blogspot.com/2008/07/blog-post.html), రాసింది విహారా ఊక దంపుడా అంటారు...కొంచం చురుకైన లాయర్ని పెట్టుకోండి, నా లాయరు నా దగ్గర డబ్బులు గుంజి మీ ఊరు బయలుదేరాడు .. అక్కడే .. అమ్మి తుమ్మి తేలుస్తానని ( ఈయనకి నాలగా తుమ్ములెక్కువ లెండి)

vookadampudu atyAhU DATkAmU

oremuna said...

>> నాలుగు లైన్లు చదివాక
(టింగులో: కామెంటు ఏమి వ్రాయాలి?)
(టింగులో: ఎక్స్లెంట్ అని వ్రాద్దాం)

>> ఇంకొన్ని లైన్లు చదివాక
(టింగులో: ఎక్స్లెంట్ అంటే మరీ అవమానించినట్టేమో, ఇంత మంఛి టపాకు
లైను లైను అద్బుతం అని వ్రాద్దాం)

>> ఇంకొన్ని లైన్లు చదివాక
(టింగులో: వార్నీ నన్ను కూడ వదల్లేదుగా :) పోన్లే వై యస్ లాంటి యుగ పురుషులతో పాటూ నన్నూ స్టేజీ మీద చూసుకునే భాగ్యం విహారి గారు కలిగించారు :))

>> మొత్తం చదివాక

ఈ కామెంటు వ్రాశానన్న మాట!

ఇప్పుడు అర్థం అయిందా బ్లాగులు వ్రాయడం మానేస్తే కామెంట్లలో కీతల మోత ఎక్కువవుతుందని :)

రానారె said...

ఈవాసిబు సూపరు. "మారెప్పకు చిరంజీవి లోకువ" బ్లామెత అదిరిపోయింది. మొత్తానికి ఆదిబ్లాగరును అంకెల్లో నుండి అక్షరాల్లోకి దించి పొడవైన వ్యాఖ్య రాయించారు. :)

Unknown said...

హహహ, చావా ఒంటి అక్షరాల వ్యాఖ్యలు భలే...

మొత్తానికి ఆల్ కాపీరైట్సు పెట్టేసుకుంటే మాకు విషయాలెలా దొరకాలి. ఇక్కడ "ఇన్స్‌పైరు" ఎలా అవ్వాలి ? చెప్పండి అధ్యక్షా...

cbrao said...

"ఇప్పుడు దాదాపుగా అందరి టపాలు ఒక్క లాగే కనిపిస్తున్నాయ్." ఈ విషయాన్ని ఓటింగ్ కు పెడితే, మీ టింగు సరిగా వెలగటం లేదని మీకే తెలిసిపోతుంది. ఊహలన్నీ ఊసులై, మనసులో మాట, అప్పుడు ఏమి జరిగిందంటే.. వీటిలో వైవిధ్యం కనబడటం లేదా? కాకబోతే ఉప్మా పురాణం తరువాత చాక్లేట్ పురాణం చదివి బ్లాగులన్నీ ఒకటే అనే అభిప్రాయానికి మీరు వస్తే మేము ఏమి చేయగలం? Great men think alike, అని సరిపెట్టుకోవాలంతే. నా రాబోయే టపా చిరంజీవి దోశ చదివి బ్లాగులన్నీ ఒకటే అని మరలా సందిగ్ధానికి లోను కావద్దు. పిజ్జా మీద different గా టపా ఒకటి మీరే urgent గా రాసేసి బ్లాగులన్నీ ఒకటే, లేక బ్లాగులు వేరు అన్న అభిప్రాయం కలిగిస్తారో, మీరే నిర్ణయించుకోండి.          

వేణూశ్రీకాంత్ said...

"వంద కోట్లు..." సుపర్ విహారి గారు.... భలే ఉన్నారు మీ సిద్ధ బుద్ధ...

Anonymous said...

@ఆనందం గారు,

మందెక్కువయితే మజ్జిగ పలచన అంతే. బాగా రాస్తే నొక్కులు దానంతట అవే వస్తాయి. బాగా రాసినప్పుడు మన కన్నా బాగా రాసే వాళ్ళు కూడలి లో వుండకూడదు. అదన్న మాట టెక్కునిక్కు.

@ ఘంట శివ రాజేష్ గారు,

ధన్యవాదాలు.

@ అశ్విన్ గారు,

కొన్ని సామెతలు అలానే పుడతాయి మరి. ధన్యవాదాలు. నాకు చాలా కత్తులిస్తున్నారు. ఏం నేను దానికి గుచ్చుకోవాలా?

@ ధర్ణమాల మురళి గారు,

ఎంత మాట. నేను వీలయినప్పుడల్లా కామెంటు తాను. కామెంటకపోతే మీ కొచ్చే నొక్కుల్లో నాదీ ఒకటని మరిచి పోకండి. మీ మూషికాసురుడిని ఓ సారి అడగండి. లేదంటే మీ హా..హా..హాచ్ ని అడగండి.
ధన్యవాదాలు.

@ ఊక దంపుడు గారు,

ఏంటి ఈ మధ్య మీకు 'ఊక' దొరకట్లేదా దంచుడు మానేశారు. మా సిధ్ధ బుధ్ధ ని కాస్త వదలండి సార్. ఇంతగా వెన్ను పోటు పొడుస్తారని అనుకోలేదు.
మీ లాయరుని నిన్నే మా లేకులో(చెరువు) నిమజ్జనం చేసేశా. ఏవన్నా ఇన్సూరెన్సు పాలసీలూ గట్రా వుంటే తీసేసుకొండి.
ధన్యవాదాలు.

@ చావా గారు,

అవును మీ ఫిలాసఫీ నాకు అర్థమయింది. నేను కూడా అదే అనుకుంటున్నా. ఎవరన్నా ఆది బ్లాగరని నాకు బిరుదిచ్చేస్తే నేను కూడా బ్లాగడం మానేస్తా. నేను బ్లాగు తోక పట్టుకుని ఆడిస్తాననుకుంటే అదే నా జుట్టు పట్టుకునేట్టు వుంది. ఈ మధ్య చేతులు నరికా. చూద్దాం ప్రయోజనం వుంటుందేమో.

@ రానారె,

ధన్యవాదాలు. అందరూ ఇలానే ప్రయత్నించాలని నా అభిలాష, ఖైదీ, చాలంజ్.

@ ప్రవీణ్,

అప్లికేషన్ పెట్టుకుంటే కొన్నింటికి అనుమతి మంజూరు చేస్తా.
ధన్యవాదాలు.

@ రావ్ గారు,

మీ టింగు భలే డిసైడైపోయింది నేను ఉప్మా పురాణం, చాక్లెట్ పురాణం చదివి అలా డిసైడైపోయానని. నేను అన్నది ఒక బ్లాగులో వైవిధ్యం కాదు. మొత్తం బ్లాగుల్లో వైవిధ్యం. చదువరి, చరసాల, కడలి తరగ( ఈ మధ్య కొన్ని కనిపిస్తున్నాయ్) లాంటి వారి ఆలోచనలు, ఇంకా పద్య రత్న మాలలు..అబ్బో లిస్టు పెద్దదే. వాటి గురించి చెప్పాను.మీరు గమనించారో లేదో కూడలండ్రెడ్ లో చాలా మంది బ్లాగటం లేదు. కొత్త వాళ్ళలో చాలా మెరుపులు వున్నాయి. అవి ప్రత్యేకంగా ప్రస్తావించదలచుకోలేదు.

పీట్జా మీద నా? ట్రెండు క్రియేట్ చెయ్యాలి గానీ ఫాలో అవకూడదు. కొత్త పుంతలు తొక్కాలి గానీ.... వాటి మీద రాస్తే ఇక వైవిధ్యం ఎక్కడ వస్తుంది.

ధన్యవాదాలు.

@ వేణు శ్రీకాంత్ గారు,

ధన్యవాదాలు.

-- విహారి

Srikanth said...

మీకు చీకట్లో ‘టింగు’ వెలగడం లేదు

టింగు ఏమిటా? అని ఓ నిమిషం ఆలోచించా
....
గుడ్డి పిల్లిని చూస్తే కుంటి ఎలుకకు కూడా లోకువ

ఈల వేసాను
.....

మరచిపోయా మీకోసం మంద కృష్ణ గారు వెతుకుతున్నటున్నారు
గుడ్డి పిల్లికి , కుంటి ఎలుకకు బహిరంగ క్షమాపణ చెప్పాలంట

Anonymous said...

@శ్రీకాంత్ గారు,

అలాగే ఓ పెద్ద బహిరంగ వేదిక ఏర్పాటు చెయ్యండి.

నెనర్లు.


-- విహారి