ఒబామా నాకెందుకు నచ్చలేదంటే...
* * * * * * * *
దేశంలో గరీబోళ్ళు ఎక్కువయ్యారని ఇందిరాగాంధీ 'గరీబీ హఠావో' అంది. పదవి లోకి రాగానే గరీబోళ్ళకు చాలా చేసింది...
గరీబోళ్ళు హ్యాప్పీ..
రాష్ట్రం లో బీదోళ్ళు ఎక్కువయిపోయారని రెండు రూపాయలకే బియ్యమిస్తానన్నాడు అన్న ఎన్టీఆర్. రాగానే ఇచ్చాడు...
బీదోళ్ళు హ్యాప్పీ...
రైతులు బ్యాంకు ఋణాలు కట్టలేరని మాఫీ అన్నాడు చెన్నా రెడ్డి. పదవిలోకి రాగానే ఋణాలు మాఫీ...
రైతులు హ్యాప్పీ...
కరెంటు మాఫీ అన్నాడు వై.ఎస్. పదవిలోకి రాగానే కరెంటు చార్జీలు మాఫీ...
మళ్ళీ రైతులు హ్యాప్పీ...
అమెరికా ఎకానమీ బుష్షు కాలం లో భ్రష్టు పట్టిపోయిందని,ఇంటి ఋణాలు(మార్టుగేజు) కట్టలేక కొంపలు కొల్లేరవుతున్నాయని(ఫోర్ క్లోజర్సు) అన్నాడు ఒబామా. పదవిలోకొస్తే ఇళ్ళ ఋణాలు మాఫీ అంటాడేమో ..నేను కూడా హ్యాప్పీ అనుకున్నా..ప్చ్..
ఇప్పుడు నేను నాట్ హ్యాప్పీ...
మీకు తెలుసా?: ఒబామా ట్రాన్సిషన్ టీము 15 మంది లో భారతీయ సంతతివారు నలుగురు.
* * * * * * * *
7 comments:
"పదవిలోకొస్తే ఇళ్ళ ఋణాలు మాఫీ అంటాడేమో .."
haha.. Good One :)
:D good one dude
ఒబామా పదవిలో కొస్తే , ఇళ్ల ఋణాలు మాఫీ అంటే దేశం కొల్లేరవుతుంది. చివరకు దేశాన్ని ప్రపంచ బాంక్ కు తాకట్టు పెట్టే దుస్థితి ఏర్పడే ప్రమాదం. ఇంతమంది సహాయకులు (వాళ్లలో భారతీయులు ఉండవచ్చని అంచనా) తాము ఒబామాకు రాసే ఉపన్యాసాలలో, ఇళ్ళ ఋణాలు మాఫీ పధకం చేర్చకుండా, ఎలా, వదిలేశారు అనేది ఆశ్చర్యమే.
ఒబామా ట్రాన్సిషన్ టీము ???
హ హ్హ హ్హా! బావుంది.
:))
Adey mama India ki America ki theda :)
Post a Comment