ఈ వారం సిద్ధా - బుధ్ధ (వంశాలు, గర్జనలు, బ్లాగులు, ఆటలు)
* * * * * * * *
"రేయ్ సిధ్ధా!!!"
"......"
"రేయ్ సిధ్ధా!!! ఆ గంతులేమిటి ఇలా రా.. క్రికెట్ లో మనోళ్ళు బాగానే ఆడుతున్నారు. నువ్వు ప్రాక్టీసు చేసి దేశాన్నేమీ ఉద్ధరించక్కర్లేదు ఇటొచ్చి కాస్త పని చూడు"
"అయ్య గారూ, నేను క్రికెట్ ప్రాక్టీసు మానేసి చాలా కాలమయింది. ఇప్పుడు నేను ప్రాక్టీసు చేస్తోంది తొడ కొట్టి మీసం మెలెయ్యడం"
"ఏ సంక్రాంతికి కుస్తీ పోటీలు గానీ జరుగుతున్నాయా ఊర్లో?"
"వచ్చే సంక్రాంతి కల్లా ఈ కుచ్చు టోపీలొళ్ళంతా ఎలక్షన్లతో కుస్తీ పట్లు పడతారు కదా. మునెమ్మలా నాక్కూడా ఏదైన చాన్సు వుంటుందేమోనని ఇప్పట్నుండి తొడ కొట్టడం ప్రాక్టీసు చేసుకుంటున్నా. ఇప్పుడు తొడ కొట్టడం, మీసం మెలెయ్యడం, గాల్లో ముద్దులివ్వడం.. అదే కదా ఫ్యాషన్"
"నువ్వు తొడ కొట్టడం బానే వుంది గానీ. మీసాలు మెలెయ్యాలంటే నీకు వున్నవి మిడత మీసాలు అవి సరిపోవు"
"మీసాలు పెరగడానికి ఏవైనా స్టెరాయిడ్సు వున్నాయేమో కాస్త అంతర్జాలం లో వెతికి పెట్టండి. ఓ సాంపుల్ మా కిలారి పాల్ గారికి కూడా పంపిస్తా"
"అన్ని పార్టీలోళ్ళు అయిపోయారు ఇప్పుడు పాల్ మిగిలాడన్న మాట. ఈ గర్జన వంశం, తొడ కొట్టే వంశం, ముద్దులిచ్చే వంశం, సర్ప వంశం వాళ్ళతో ఎక్కడ పోటీ పడుతాడు"
"అరె! ఆ నాలుగో సర్ప వంశమేంది కొత్తగా?"
"ఆ నలుగురు హీరోల్లో మూడో హీరో వున్నాడు కదా. ఆయనదే సర్ప వంశం"
"అది అక్కినేని వంశం కదా?"
"కాదు. మొన్న కింగు ఆడియో విడుదలప్పుడు అక్కినేనే చెప్పాడు. నా పేరులో పాముంది, నా కొడుకు పేరు లో పాముంది, నా మనవడి (నాగ చైతన్య) పేరులో కూడా పాముంది అని. బుజ్జి సర్పం కూడా 'నేను ఇలా ప్రేక్షకుల మీద బుస కొట్టడానికి రెండేళ్ళ నుండి ఎదురు చూస్తున్నా' అని చెప్పింది. సో అది సర్ప వంశమన్న మాట"
"ఆ నలుగురు హీరోల్లో ముగ్గురు మూడు పార్టీల్లో ఫిక్సయిపోయారు కదా. నాలుగో ఆయన కూడా ఏదో ఒక పార్టీలో చేరిపోతే బావుణ్ణు. ప్రేక్షకులు నిశ్చింతగా చింత కాయల బదులు చింతాకు పులగూర చేసుకుని తింటారు. బహు జన సమాజ్ పార్టీలో చేరి బడుగు జనాలకు కీడు జరక్కుండా కాపాడుతూ వుంటే బావుంటుంది"
"ఆయనకి కొంచెం దైవ భక్తి ఎక్కువ, కొంచెం వేదాంతం మనిషి. బి.జె.పి. అయితే బావుంటుందేమో"
"'ప్రేమించుకుందాం రా', 'పెళ్ళి చేసుకుందాం రా' లా 'బి.జె.పి లో చేరదాం రా' అనే సినిమా తీసి రాజకీయ రాజ్యం లోకి రాకెట్ లో రోదశీలోకి వెళ్ళిన రాకేష్ శర్మ లా, రణ గొణ ధ్వనుల రాక్షస రహదారుల రాజధానిలో రివ్వున రాసుకు దూసుకు పోయే రీగల్ క్యాబులా, పీడిత తాడిత ప్రజలను ఆదరించి, అభిమానించి, పరిపాలించే ప్రభువులా వస్తే అందరినీ సంతోష పెట్టిన వాడవుతాడు"
"నువ్వు ఆశు కవివయిపోయావురో?"
"డైరెక్టుగా తిట్టమని మీకెన్ని సార్లు చెప్పాలి అయ్యగారూ? మీకు ఆ హక్కు వుందని ఎప్పుడో చెప్పానుగా. ఇలా డొంక తిరుగుడు గా మారెప్ప... చింతకాయల రవి... అని అనడమెందుకు"
"సడేలే. వెళ్ళి మిరపకాయలు బాగా దట్టించి ఓ పెసరట్టు వేసి కొబ్బరి చెట్నీ తో పట్టుకు రాపో.."
"ఇవిగోండి"
"అట్టు అదరగొట్టావ్ రో. ఏవిటి బ్లాగుల్లో కొత్త రెసిపీలు గానీ చూస్తున్నావా?"
"ఆయనెవరో భాస్కర్ రాజట నల భీమ పాకం అని మొదలు పెట్టి భలే ప్రయోగాలు చేస్తున్నాడు. నేను కూడా ప్రయోగాలు చెయ్యడం మొదలు పెట్టా. వచ్చే వారం మీకు ఐస్ క్రీం పప్పు విత్ జామూన్ బిర్యాని. సైడ్ డిష్ గా ఉప్మా సూప్ చేసి పెడతా"
"హుం.... బ్లాగులు పెరిగిపోతున్నాయి."
"అవునండి ఏం జదివేట్టు లేదు..ఏం రాసేట్టు లేదు.."
"చంపేస్తా వెధవా... రాయక పోతే పోయావ్ చదివేదన్నా సరిగ్గా చదువు ఏడువు. లేకపోతే నేను ఎలాంటి వంటకాలు తినాల్సి వస్తుందో ఏమో. ఇంటర్నెట్ కనెక్షన్ పీకించేస్తా"
"ఊ..అలానే అంటారు. పీకించిందేం లేదు"
"ఆ బుంగ మూతేంటి? పదారేళ్ళ కుర్రాడిలా? కొత్త బంగారు లోకం రివ్యూ గానీ చదివావా?"
"ఆ మీరు మరీను, కుర్ర కారు బ్లాగులు చూస్తే కుర్ర తనంగానూ, చరిత్ర బ్లాగులు చూస్తే చరిత్ర కారులు గానూ, భక్తి బ్లాగులు చూస్తే భక్తులు గానూ, పాటల బ్లాగులు చూస్తే పాటగాళ్ళు గానూ, వంటల బ్లాగులు చూస్తే వంటవాడి గానూ, ఆవేశం బ్లాగులు చూస్తే.."
"ఇక ఆపెయ్. నా కర్థమయిపోయింది. ఈ రోజుకి నీ నోటి టపా కట్టెయ్."
"అలాగే"
* * * * * * * *
"అయ్యగారూ! మనమిద్దరం ఈ రోజు ఒక ఆటాడుకుందాం"
"సరే. నువ్వు తొడ గొట్టు. నేను మీసం మెలేస్తా"
"అబ్బే అదికాదండి. మనం తెలుగు సంఘమాట ఆడుకుందామా?"
"ఓ అదా! నువ్వు చంద్రగిరి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్టు, నేను తిరుపతి ఎంపీ గా పోటీ చేస్తున్నట్టు ఆడుకుందాం.."
"మీ ఫ్యూజు ఒక పక్క బాగా పీకేసింది"
"ఏం. అమెరికా తెలుగు సంఘాలోళ్ళు చేసే పని అదే కదా"
"ఆ ఆట లో మజా ఏముంది. నేను చెప్పేది అది కాదు"
"మరి?"
"మీరు నన్ను బహిష్కరించండి... నేను మిమ్మల్ని బహిష్కరిస్తా... మీరొక పేపర్ స్టేట్ మెంట్ ఇవ్వండి దానికి కౌంటర్ గా నేనొక స్టేట్ మెంట్ ఇస్తా"
"!!!"
"ఏం అలా అయిపోయారు"
"ఏం లేదు నేను వెళ్ళి రెస్టు తీసుకుంటా. ఎవరొచ్చినా డిస్టర్బ్ చెయ్యాకు"
"అలాగే. ఎవరన్నా వస్తే రామ కోటి రాసుకుంటున్నాడని చెబ్తా"
* * * * * * * *
18 comments:
విహారి గారు, నిఖార్సయిన నవ్వులు పూయించాలంటే మీకు మీరే సాటి. టపా అదుర్స్.
నాగవంశం సెటైర్ అదుర్స్
:-) ) అవును మీకు మీరే సాటి
హ హ సర్పవంశం, మారెప్ప... చింతకాయల రవి... కేక విహారి గారు :-)
సర్ప వంశం అంశం అదిరిందండి. బుజ్జి సర్పం బుస కేక.
ఎప్పటి లానే అదుర్స్ విహారి బాబాయ్
>>సర్ప వంశం!!!
hahaha... gud one.. :))
మీ టపా చదవాలంటే కొంచం ప్రపంచ జ్ఞానం, కొంచం లోకజ్ఞానం ఉండాలి సుమండీ
అసలది గాదు కానీ, మీరు ఇక్కడి జనాల కంటే కూడా ఇండియాలో, ఏపీ లో ఏ మూల ఏం జరుగుతోందో కూడా ఎంత చక్కగా ఫాలో అయిపొతూ ఉంటారో చూస్తుంటే భలే ఆశ్చర్యంగా ఉంటుంది. మునెమ్మ, నాగవంశంతో సహా! ఈ విషయాన్ని చాలా టపాల నుంచీ గమనిస్తున్నాను.
టపా గురించి చెప్పేదేముంది, మళ్ళీ కేకే!
Sarpavasam..... excellent.
buddaa gaaru I mean Vihari gaaru bhayamgaa vundanDi mimmalni disturb cheyyalante ade raamakOTi raasukuntunnaru kadaa.
haha..
haayigaa navvinchaaru.
Thanks.
బావున్నాయి విరుపులు.
మూడు నెలలనుండి మీ సిద్ధ-బుద్ధ కనపడక ఇక్కడ ఆంధ్రాలో జనాలంతా పరేషాన్ అయిపోతున్నారు, ఇక అంతర్జాలంలో ఓ ప్రకటన ఇద్దామనుకుంటుండగా వచ్చేసారు. ఇన్ని రోజులు బుట్టలో పెట్టి మగ్గేసినట్లున్నారు, బాగా పండాయి :)
ఐస్ క్రీం పప్పు విత్ జామూన్ బిర్యాని. సైడ్ డిష్ గా ఉప్మా సూప్ --మీరు రుచి చూసాక ఎలా ఉన్నాయో మాకు కూడా చెప్పండి.
supero super....adurs
సర్ప వంశం, బి.జె.పి లో చేరదాం రా.. ha..ha bagunnayi విహారి గారు.
అధ్భుతం. మీరిలాగే కుమ్మెయ్యండి. మీ సిద్ధ- బుద్ధ కోసం నేను కూడా వెతుకుతున్నా
పైన విజె గారన్నట్లు
కొంచెం జికె కావాలి కదూ
బాగుంది.
చాలా రోజుల తరువాత మీదైన స్టైల్లో మళ్ళీ.. :)
అబ్బా అబ్బా అబ్బా ఏం రాశావన్నా.
అబ్బా అబ్బా అబ్బా ఏం రాశావన్నా.
Post a Comment