Thursday, February 22, 2007

ధ.దే.ఈ.శు. -- జోకు.

బుడతడు: తాతయ్య చూశావా నా ఐపాడ్. అగ్గిపెట్టెలా వున్న దీనిలో కొన్ని వేల పాటలు స్టోర్ చేసుకొని వినొచ్చు తెలుసా?

తాతయ్య: అదేం పెద్ద గొప్ప. మా కాలం లో ధర్మ వరం వాళ్ళు అగ్గి పెట్టెలో పట్టేంత పదహారు గజాల పట్టు చీర తయారు చేసే వారు తెలుసా?

బుడతడు: ఆ కాలంలో అంత పెద్ద అగ్గి పెట్టెలు తయారు చేసేవారా తాతయ్యా?

తాతయ్య: ???

బోనస్ జోకులు:

మార్గదర్శి పై కక్ష లేదు -- కె.రోశయ్య.
పత్రికా స్వేచ్చను గౌరవిస్తా -- కె.కేశవరావు.

9 comments:

పారుపల్లి said...

Tag lines:

మార్గదర్శి పై కక్ష లేదు -- కె.రోశయ్య
అందుకే డిపాజిటర్ల డబ్బులు రాకుండా మాకు చేతనయినంత సహాయం చేస్తున్నాం.

పత్రికా స్వేచ్చను గౌరవిస్తా -- కె.కేశవరావు
అందికే మాకు తెలియకుండా ఎవరో జారీ చేసిన 938 జివో ని ఆపివేశాం

వెంకట రమణ said...

మీ జోకులు బాగున్నాయి.

ధ.దే.ఈ.శు. అ. అ. కా
వెంకట రమణ

సత్యసాయి కొవ్వలి said...

ధ.దే.ఈ.శు. ?
ధ.దే.ఈ.శు. అ. అ. కా?

ప్రవీణ్ గార్లపాటి said...

ధ.దే.ఈ.శు
ధ.దే.ఈ.శు. అ. అ. కా


ఓర్నాయనో...
ఇవి ఇలా పెరిగిపోతే బ్లాగు సమాచారమ్ అంతా ఇదే తినేస్తుందేమో :)

రానారె said...

బోనస్ జోకులు బాగున్నాయ్.

Anonymous said...

@ పారుపల్లి గారూ,

మీరు చెప్పింది నిజమెనండోయ్.

@ వెంకట రమణ గారూ,

ధ.దే.ఈ.శు. అంటే అర్థం కాలేదు అన్నారని నాకర్థ మయింది.

కనీ నేను ధ.దే.ఈ.శు. అంటే చెప్పనుగా!.

@ సత్య సాయి, ప్రవీణ్ గారూ,

మీక్కూడ అంతే ధ.దే.ఈ.శు. అంటే చెప్పను గానీ మీరు కనిపెడితే చెప్పండి.

@ రానారె గరూ,

మీకు వడ్డీ మీదే తీపి ఎక్కువ వున్నట్టు వుంది.

-- విహారి

వెంకట రమణ said...

అయితే ధ.దే.ఈ.శు. అ. అ. అ అని రాస్తున్నాను కాబట్టి ఇప్పుడైనా చెప్పండి.

ధ.దే.ఈ.శు. అ. అ. అ,
వెంకట రమణ

కొత్త పాళీ said...

T
G
I
F

he hee :-)

Anonymous said...

తెలివైన బుర్ర !!!
సెభాసో.