Monday, February 12, 2007

బ్లాగర్ల పోటీ -- ఓ సమాలోచన

భారత బ్లాగర్ల వాళ్ళు ఉత్తమ బ్లాగర్ల పోటీ నిర్వహిస్తున్నందుకు వారిని అభినందిస్తున్నాను. ఈ పోటీలు బ్లాగుతున్న ఎంతో మందిని ఉత్తేజితులను చేస్తుందనటలో సందేహం లేదు. ఇప్పటికే దాని ప్రతిస్పందనలు మీరు చూసే ఉంటారు www.indibloggies.org లో కానీ సొంత బ్లాగులలో కానీ. ఏ పని చేస్తున్నా వారిని ప్రొత్సహించడానికి ఇలాంటివి రావడం ఎంతో అవసరం. భవిష్యత్తులో ఇలాంటివి నిర్వహించడానికి ఇంకా ఎంతో మంది వస్తారు కూడా.


ఇందులో పోటీ చేస్తున్న అందరికి అభినందనలు.

కాకపోతే నాకు ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. అవి తప్పనిపిస్తే సరిదిద్దండి. భారత బ్లాగర్ల సాలె గూడు లో తెలిపిన ప్రకారం భారత్ కు సంబందించిన ఏ బ్లాగైనా ఏ విభాగంలో నైనా పాల్గొనవచ్చు. అలాగే వివిధ భాషా బ్లాగుల కింద మరికొన్ని ఇచ్చారు. వివిధ విభాగాల కింద అంటే , వంట, చాయా చిత్రం, కవితలు వాటి కింద నామినేట్ చేసే బ్లాగులన్నీ ఆంగ్లం లో నే వుండాలని ఎక్కడా రాసినట్టు లేదు. దానర్థం ఏ భాషా బ్లాగయినా ఏ విభాగంలో నైనా పోటీ పడొచ్చు అనేకదా అర్థం. కానీ జరిగింది దానికి విరుద్ధం. నేను మన తెలుగు బ్లాగులను కొన్నింటిని వివిధ విభాగాల్లో అంటే ఎంటర్ టైన్ మెంట్, వంట, కవిత, కొత్త మరియు సాంకేతిక విభాగాల కింద నామినేట్ చేశాను. అవన్నీ ఇప్పుడు తెలుగు బ్లాగుల కింద పోటీ పడుతున్నట్టు ప్రకటించేశారు. మరీ చోద్యం అందులో ఓటేసిన వంటల బ్లాగు లేదు. ఇవన్నీ పోటీ చేసేవారికి తెలీదులే అని నిర్వాహకులు అనుకుంటే పొరపాటే అవుతుంది. ఎవరికెన్ని ఓట్లు వచ్చాయో ఏ ఏ విభాగాలకింద నామినేట్ చెయ్యబడ్డారో, ఎవరు ఓటు చేశారో కూడ తెలిసిపోతుంది సులభంగా.

ఇది కేవలం నిర్వాహకుల "ఓవర్ లుక్" అని సరిపెట్టేసుకుందామా? లేక మన తెలుగుకు (లేదా ఇతర ) భాష(ల)కు ఇతరత్రా విభాగాల్లో పోటీ (ఆంగ్లం కాకపోతే) చేసే సత్తా లేదని సరిపెట్టుకుందామా?

14 comments:

సుధాకర్(శోధన) said...

ఇలా చాలా తప్పులున్నాయి ఇంకా. నా బ్లాగునయితే ఏకంగా ఆంగ్లంలోని అనువదించేసి A Search అని రాసారు :-(

మన తెలుగు బ్లాగులకు వోటు చెయ్యాలంటే మనకు తెలియని ఆంగ్ల బ్లాగులకు తప్పని సరిగా వోట్ చెయ్యాలంట. అదేంటో ఆ వికారపు రూలు. ఈ రకంగా వోట్ చేస్తే ఆ ఆంగ్ల బ్లాగుల వోటులలో తేడా రాదా?

Ramanadha Reddy said...

ఒక కమిటీ వుంటుంది. కొన్ని పెరామీటర్స్ వుంటాయి. వాటిమీద ఆధారపడి ఎంపిక వుంటుంది. వారు లెజెండ్ కాదా, వీరు లెజండ్ కాదా, నేను లెజెండ్ కాదా అని అడగకూడదు. అలా అడిగినవారికి ఈ పోటీలో ఒక దిష్టిచుక్క అవార్డును ప్రదానం చేస్తారు గడసరి పద్మనాభరావుగారు. ఏటీ ఎక్కడో విన్నట్టుగా కొడతాందా?

:)

సుధాకర్(శోధన) said...

కొట్టింది :-)

ప్రవీణ్ గార్లపాటి said...

నాక్కూడా నిన్న చూసినప్పుడు చాలా తిక మకగా అనిపించింది. అర్థం కాక వదిలేసా.
మీరు nominate అయ్యినందుకు చాలా సంతోషం.

సత్యసాయి కొవ్వలి said...

నాకు ఈ సందేహం వచ్చే నామినేట్ చేసే రోజుల్లో నా బ్లాగులో ఆడిగాను. వేరే కొంతమంది బ్లాగర్లుకూడా నాలాగే తెలుగు బ్లాగులని వివిధ కేటగిరీలలో నామినేట్ చేసారని తెలిసింది - కామెంట్లద్వారా. భారతీయ భాషలకీ, వాటిలో తెలుగులాంటి మూగభాషలకీ ఈ అవస్థ తప్పేది మన ఈ-బ్లాగర్ల సంఘం ద్వారానే అని ఆశిద్దాం.

Gowri Shankar Sambatur said...

I will seek clarification from Indibloggies and update as soon as I get feedback.

However at the least it is encouraging to telugu bloggers, hence we need to take it in a positive spirit until we have own our things going (e-telugu.org or others..).

..Gowri Shankar, Thenegoodu.com

Anonymous said...

@ సుధాకర్ గారూ,

మళ్ళీ ఓటింగ్ గొడవేంటండీ బాబూ.
శోధనను search చేశారని గట్టిగా అనకండి అది మన వీవెన్ కి తగులుతుందేమో. మన వీవెన్ గారే తెలుగు జ్యూరీ లో వునారు.

@రానారె గారూ,

అవును అన్నింటికీ ఓ కమిటీ వుంటుంది. దానికి పెరీ మీటర్స్ వుంటాయి. అన్ని పెరామీటర్సూ అందులోనే వుంటాయి :-)

@ ప్రవీణ్ గారు,

థ్యాంక్స్.

@ సాయి గారూ,

ప్రస్తుతానికి క్షమించేద్దాం. వాళ్ళు కూడా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నారు కదా. మన తెలుగు కాస్త ప్రచారానికొస్తే మిగిలినవి దానికవే సర్దుకు పోతాయి.

@ గౌరి శంకర్ గారు,

మీరు స్పందించి యాక్షన్ తీసుకుంటున్నందుకు ధన్యవాదాలు.

విహారి

Veeven said...

శోధనను search చేశారని గట్టిగా అనకండి అది మన వీవెన్ కి తగులుతుందేమో.

తగిలింది :-)

బ్లాగు శీర్షికని ఆంగ్లంలోనికి మార్చాలన్నది ఓ నియమం. (అది అనువాదమో లేక లిప్యంతరమో స్పష్టత లేదు.)

ఇక వర్గాలు, ఆయా వర్గాల జ్యూరర్లు తమతమ వర్గంలో నామినేట్ కాబడ్డ బ్లాగులన్నీ చూసుండాలి.

సుధాకర్(శోధన) said...

;-) నా బ్లాగు మా స్నేహితులందరికీ శోధన గానే తెలుసు. కొంత మంది అయితే ఏరా నీ బ్లాగు ఇక్కడ లేదు అని ఆడిగారు. ఇందులో వీవెన్ గారి తప్పు లేదు లెండి. అంత కన్నా తప్పులు ఈ పోలింగులో చాలా ఉన్నాయి. చివరి పేజీలో thank you అని చూడగానే windows close చేస్తున్నారు..submit కొట్టాలని తెలియక,...ఇది ఒక UX issue. నేను దేబాషిస్ కిఒ క ఈ-లేఖ రాస్తున్నా...

ప్రవీణ్ గార్లపాటి said...

Vihaari: A Browser
అహ్హాహ్హహ.

spandana said...

"Vihaari: A Browser"

ప్రవీణ్, జోకు అదిరింది. :)

--ప్రసాద్
http://blog.charasala.com

Dr.Ismail said...

చాలా మంది ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.దాదాపు అందరూ అయోమయానికి గురయ్యారు.ఇంకా user-friendly గా ఉంటే బావుండేది!

Anonymous said...

@ ప్రవీణ్ మరియు ప్రసాద్,

గుర్ర్ర్...గుర్ర్.

అసలే design విభాగంలో వున్నది తెలుగు విభాగంలో వచ్చినందుకు నాకు గుర్రు గా ఉంటే మీరు జోకుతారా..అయ్. ఫరవాలేదు మీరేగా :-)

@ ఇస్మాయిల్ గారూ,

మీరన్నది నిజమే. ఇలా అయోమయంగా వున్నందువల్లే నేను తరువాతి దశ లోకి వెళ్ళడానికి ఆసక్తి చూపలేదు. ఈస్ విషయమై దేభషిష్ కామెంట్ రాస్తే ఇంతవరకు సమాధానం లేదు.

విహారి

Sudhakar said...

vihari gaaru,

mee rachana shili chala bagundi.hasyam pandinchadam lo meeku meere saati.

vihari a browser -- chala navvu kunnanu idi chusi.

ela telugu nu english lo rastunanduku tittukokandi.(nenu margadarshi lo cheranu, nenu telugu lo rayabothunnanu)