Wednesday, May 02, 2007

బ్లాగదాభి రామ బ్లాగర - 2

బ్లాగరెపుడు బల్కడు ఆడంబరముగాను
నెట్జెనుండు కెల్కు సాలె గూడును
బ్లాగు చెప్పినట్లు భారత టీవీ చెప్పునా
బ్లాగదాభి రామ బ్లాగర విహారి

ఆ: అల్పుడెపుడు పల్కుడాడంబరముగాను
సజ్జనుండు పల్కు చల్ల గాను
కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా
విశ్వదాభి రామ విన వేమ

:

6 comments:

కొత్త పాళీ said...

ఇది నిఝ్ఝెంగా బాగా కుదిరింది. నెట్జనుండు అని చదవగానే ఆపుకోలేక పైకి నవ్వేశాను.ఛండస్సుకి కూడా బాగా దగ్గిరగా వచ్చారీసారి.

lalithag said...

తప్పులెన్ను వారు ......

ఈ పద్యానికి పేరడి రాయమని మనవి.

నన్ను ఈ మధ్య ఈ పద్యం "సప్నే మే దేఖా ఇక్ సప్నా..." లాగా, అద్దంలో ఇంకో అద్దం ప్రతిబింబం లాగా, తెగని recursive loop lO paDEsimdi.

ధన్యవాదాలు.

lalithag said...

a correction here.

"అల్పుడెపుడు పల్కు నాడంబరము గాను"

he does exaggerate.

జ్యోతి said...

వేరీ గుడ్...ఐతే విహారి శతకం మొదలయ్యిందన్నమాట ...బండి ఇదే స్పీడుతో నడిపించు. ఆగొద్దు మరి...

కొత్త పాళీ said...

లలిత గారూ ..recursive recursive .. మీరు ప్రవీణ్ రాసిన 55 మాటల కథ చదివారా?
అవును నిజం. వేమనపద్యాల్లో చాలాచోట్ల ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. విష్ణూ సహస్రనామంలోనూ నమకంలో కూడా ఎదురవుతుంది.

Anonymous said...

@ కొత్త పాళి గారూ,

నేను చందస్సు కొసం ప్రయత్నిస్తే 'రగడ' కు నేనిచ్చిన సమాధానం లాగ వుంటుంది. ప్రాస కోసం ప్రయాసలు పడుతున్నా.

@ లలిత గారూ,

'తప్పులెన్ను వారు' పద్యం నా ఖాతాలో వుంది అది కూడ వదుల్తా త్వరలో కాస్త ముందుకు జరిపి.

"అల్పుడెపుడు పల్కు నాడంబరము గాను" బదులు
"అల్పుడెపుడు పల్కు డాడంబరము గాను" అని వుందండి కరక్షన్ అవసరం లేదనుకుంటా.

@ జోతక్కా,

స్పీడు బ్రేకర్లు వస్తే ఆగిపోత అంతవరకు సాగిపోతా.

-- విహారి