Tuesday, February 12, 2008

ఈ వారం సిద్ధ-బుద్ద (11-ఫిబ్రవరి-2008)"అయ్యగారూ , నేను కూడా బ్లాగురాస్తా"
"రాయరా ఎవరు కాదన్నారు? అయినా వున్నట్టుండి ఇప్పుడు నీకు ఆ బుద్ది పుట్టిందెందుకు?"

"ఆ ఏమీ లేదు నా పేరు కూడా ఈనాడులో వస్తుందేమో అని "
"నువ్వు రాయడం మొదలు పెడితే రాదు. ఏదో ఒక దానిలో నిష్ణాతుడైతే పేరు వస్తుంది. ఈ లెక్కన అందరి పేర్లు రాయాల్సి వస్తే పేపరు కాస్త ఎల్లో పేజెస్ అయిపోతుంది."

"అంతేనంటారా?"
"అదే కదా చెప్తోంట. ఒరేయ్ సిద్ధిగా! ఇన్నాళ్ళ నుండి బ్లాగులు చూస్తున్నావు ఆ మాత్రం అర్థమయి చావడం లేదా. నీకు ఎలక్షన్ల ముందు తెలంగాణా గుర్తుకు వచ్చిన రాజకీయ నాయకుల స్పీచ్ వినొద్దంటే విన్నావా? ఇలా కంప్యూటర్ ఎరా లోనో, కంప్యూటర్ విజ్ఞానం లోనో, ఈనాడు లోనో వార్త వచ్చినప్పుడల్లా నీకు బ్లాగు దురద పుడుతుంది."

"మరి మీరు కూడ అంతే కాదేటి బ్లాగులకు విరామం ఇచ్చానని మళ్ళీ ఎందుకు రాస్తున్నారు?"
"వెధవా! నేను అప్పుడు చెప్పింది కొన్ని చెయ్యాల్సిన పన్లు వుండడం వల్ల అలా చెప్పా. అవి తొందరగా అవడం వల్ల మళ్ళీ బ్లాగు బాట పట్టా."

"చంద్ర బాబు పల్లె బాట లాగన్నమాట."
"ప్రతి దానికి కంపారిజనే నీకు. ఇంకా బుర్రలో ఏవో తొలుస్తున్నట్టున్నాయి వాటిని బయట బెట్టు"

"ఇప్పుడు వున్నట్టుండి టీ.ఆర్.ఎస్. వాళ్ళు ఎందుకు రాజీనామా అంటున్నారు."
"వాళ్ళ టర్మ్ అయిపోవచ్చిందిగా."

"మరి కాకా ఎందుకు బాకా ఎత్తి ఊదుతున్నారు."
"ప్రతిభా పాటిల్ ప్లేస్ మిస్సయిందని."

"అయ్యగారు, నేను మీకు ఇప్పుడు కొన్ని జెనరల్ క్నాలడ్జ్ ప్రశ్నలు వెయ్యనా?"
"బ్లాగుల దెబ్బ కు నీ బాష కూడ వ్యంగమయిందిరో,నాలెడ్జిని క్నాలడ్జి అంటున్నావ్. కానీ... ఆలస్యమెందుకు"

"కాపాడలేని వాజమ్మలు దద్దమ్మలు అని ఎవరు అన్నారు?"
"రోజా! ఆయేషా హత్య గురించి మాట్లాడుతూ."

"ఓకే మీకో మార్కు ఇస్తున్నా. ప్రతి సంవత్సరం ఉత్తమ శాసన సభ్యుడు అవార్డు ఇస్తే ఎవరికి వస్తుంది?"
"ఎప్పటికీ వై.ఎస్.రాజశేఖర రెడ్డి కే "

"ఎందుకు?"
"ఏం తిక్క తిక్కగా వుందా బతకాలని లేదా?"

"అర్థమయింది మహాప్రభో!!! "
"మరదే ఎక్కువ మాట్లాడావంటే పులివెందుల పంపిస్తా మొన్నో రిపొర్టర్ గల్లంతయ్యాట్ట."

"అవి మనకెందుకులే కానీ ఇంకో ప్రశ్న. అసలది ఒక టీమే కాదు అంతా పాలిటిక్స్, పెర్సనల్ ఇమేజ్ కోసం ఆడతారు. అసలు వీళ్ళని రెండేళ్ళ పాటు బ్యాన్‌ చెయ్యాలి అన్నది ఎవరు?"
"సగటు భారత దేశపు క్రికెట్ అభిమాని."

"అబ్బో మనోళ్ళు చించేశారు 'ఆసీస్! ఖబడ్దార్' అన్నదెవరు."
"ఇంకెవరు సగటు భారత దేశపు క్రికెట్ అభిమానే."

"మన శాసన సభ్యులు, పార్లమెంటు సభ్యులు ఏకాభిప్రాయంతో వోటేసే దెప్పుడు?"
"వాళ్ళ జీతాలు పెంచాలని ప్రతిపాదన పెట్టినప్పుడు"

"అబ్బో మీకు అయిదుకు అయిదు మార్కులు. మీకు జెనరల్ క్నాలెడ్జి కింగ్ అని బిరుదిస్తున్నా."
"కానీరా నువ్వు నాకు బిరుదులు ఇచ్చే వాడంత అయ్యావన్నమాట."

**

"అయ్యగారూ రిజిస్టర్డు అభిమానులంటే ఎవరు?"
"రక్తం,కళ్ళు దానం చేసే వాళ్ళు"

"మరి అన్‌ రిజిస్టర్డు అభిమానులు ఎవరు?"
"రక్తం కళ్ళ చూసే వాళ్ళు"15 comments:

కొత్త పాళీ said...

bravo!

Anonymous said...

LoL

Deepthi Mamiduru(దీప్తి మమిడూరు) said...

superb!! esp last 4 lines :)

జ్యోతి said...

సూపర్.. ఎప్పటిలాగే....

రఘురాం బోయపాటి said...

అదిరిందండి బాబు,మీ ఇమాజినేషన్ అద్భుతం

Budaraju Aswin said...

ఎలక్షన్ల ముందు తెలంగాణా గుర్తుకు వచ్చిన రాజకీయ నాయకుల స్పీచ్ వినొద్దంటే విన్నావా?

లైను

చాలా బావున్ది చాలా సేపు నవ్వుకున్నా

రాజేంద్ర కుమార్ దేవరపల్లి said...

"మరి అన్‌ రిజిస్టర్డు అభిమానులు ఎవరు?"
"రక్తం కళ్ళ చూసే వాళ్ళు"

వరహాల విలవైన మాట

రమ్య said...

సూపర్...

నిషిగంధ said...

భలే ఉందండీ!! :) :) :)

phani said...

విహారి గారు మీ కామెంట్స్ బాగున్నాయి. కానీ చివరలో చిరు అభిమానుల గురించి చేసిన వ్యాఖ్యలు సగటు చిరు అభిమానులమైన మమల్ని కొంచెం బాధ పడేలా చేసాయి.

netizen said...

@ఫణి గారు:మరి రాజశేఖర్ అభిమానులేమైపొవ్వాలి?

nuvvusetty said...

చాలా బాగుంది

Gujarat Postal Trekkers said...

విహారి గారు సూపరు మీ సెన్సాఫ్ హ్యూమరు.
-మరో నువ్వుశెట్టి బ్రదర్

సాహితి said...

బావుందండి మీ ఆలొచన దాని రూపకల్పన

రానారె said...

మీరు రేడియోలో మంచి టాక్‌షో చెయ్యొచ్చు. చివరి నాలుగులైన్లు హైలైట్. హ10/10.