లోకం లో జనాలు రెండు రకాలు.
లోకం లో జనాలు రెండు రకాలు.
చదవడం తెలిసిన వాళ్ళు, చదవడం రాని వాళ్ళు.
చదవడం రాని వాళ్ళతో హ్యాప్పీస్.
చదవడం వచ్చిన వాళ్ళు మళ్ళీ రెండు రకాలు.
తెలుగు వచ్చిన వాళ్ళు, తెలుగు రాని వాళ్ళు.
తెలుగు రాని వాళ్ళతో హ్యాప్పీస్
తెలుగొచ్చిన వాళ్ళు మళ్ళీ రెండు రకాలు
బ్లాగులు చదివే వాళ్ళు, బ్లాగులు చదవని వాళ్ళు.
బ్లాగులు చదవని వాళ్ళతో హ్యాప్పీస్.
బ్లాగులు చదివే వాళ్ళు రెండు రకాలు.
నా బ్లాగు చదవని వాళ్ళు, నా బ్లాగు చదివే వాళ్ళు.
నా బ్లాగు చదవని వాళ్ళతో హ్యాప్పీస్.
నా బ్లాగు చదివే వాళ్ళు మళ్ళీ రెండు రకాలు
మొత్తం చదివే వాళ్ళు, పై పైన చదివే వాళ్ళు
మొత్తం చదివే వాళ్ళతో హ్యాప్పీస్.
పై పైన చదివే వాళ్ళు మళ్ళీ రెండు రకాలు.
కామెంటు రాసే వాళ్ళు, కామెంటు రాయని వాళ్ళు.
కామెంటు రాయని వాళ్ళతో హ్యాప్పీస్.
కామెంటు రాసే వాళ్ళు రెండు రకాలు
బాగుందని రాసే వాళ్ళు, బాలేదని రాసే వాళ్ళు.
బాలేదని రాసే వాళ్ళతో హ్యాప్పీస్.
బాగుందని రాసే వాళ్ళు రెండు రకాలు
బ్లాగుండి రాసే వాళ్ళు, బ్లాగు లేక రాసే వాళ్ళు
బ్లాగుండి రాసే వాళ్ళతో హ్యాప్పీస్
బ్లాగు లేక రాసే వాళ్ళు మళ్ళీ రెండు రకాలు
బ్లాగు మొదలు పెడదామని రాసే వాళ్ళు, బ్లాగు అలోచన లేకుండా రాసే వాళ్ళు
బ్లాగు మొదలు పెడదామని రాసే వాళ్ళతో హ్యాప్పీస్
బ్లాగు ఆలోచన లేకుండా రాసే వాళ్ళు రెండు రకాలు.
చేనీస్ వచ్చిన వాళ్ళు, చైనీస్ రాని వాళ్ళు.
చైనీస్ రాని వాళ్ళతో హ్యాప్పీస్.
చైనీస్ వచ్చిన వాళ్ళు రెండు రకాలు
తెలుగు బ్లాగుల్లో చైనీస్ రాసేవాళ్ళు, చైనీస్ బ్లాగులో చైనీస్ రాసే వాళ్ళు.
చైనీస్ బ్లాగుల్లో చైనీస్ రాసే వాళ్ళతో హ్యాప్పీస్
తెలుగు బ్లాగుల్లో చైనీస్ రాసే వాళ్ళు రెండు రకాలు కాదు. ఒకే రకం. అదే కనిపించకుండా పోయిన రకం.
ఒక రకమే కాకుండా మనిషి కూడా ఒకడే.వాడే కూడలి ని వ్యాఖ్యలతో స్పాం చేసేవాడు
వాడి అదృశ్యం తో ఇప్పుడు కూడలి హ్యాప్పీస్, నేను హ్యాప్పీస్, ఆల్ హ్యాప్పీస్.
15 comments:
Office Office gurtocchindi. :D
బావుంది..
ఇలా రెండు రకాల వాళ్ళ గురించి అంతకుముందు రాకేశ్వర్రావు గారి బ్లాగ్ లో చదివినట్లు గుర్తు...
విహారి!బ్లాగు! ఓ తెలుగబ్బాయి!
టపా చదివి అందరూ హ్యాప్పీస్. చురక తగలాల్సినవాడికి తగిలితే, డబల్ హ్యాప్పీస్.
నాకామెంట్లు రెండురకాలు
బాగుంది, చాలా బాగుంది
ఇప్పుడుమాత్రం రెండోది మాత్రమే.
బొల్లోజుబాబా
హ హ హ
బాబా గారి కామెంటు కూడా హ హ హ
చాలా బాగుంది
చాలా చాలా బాగుంది
చాలా చాలా చాలా బాగుంది
చాలా చాలా చాలా చాలా బాగుంది.
ఇందులో ఏదయినా ఓ.కె.
ఏదీ ??? మురళీ కృష్ణ గారి బ్లాగేదీ ??
చైనీసు వాడు వాడి "పెట్" బ్లాగుని కూడా వదిలేసాడా ? :-)
యేమి రా బాలరాజు,నీ వల్ల దేశానికి వుపయోగం అన్నది దీని తర్వాత డైలాగు సినిమా లో.
బాగుంది భూపతి{రాజూ}నీ పద ప్రయోగం అన్నది నా డైలాగు ఈ వ్యాఖ్యానం లో.
హ హ చాలా బాగుంది.
chala bagundi
"మొత్తం చదివే వాళ్ళతో హ్యాప్పీస్" అని వదిలేసారు. మొత్తం చదివే వాళ్ళు కామెంట్స్ రాయరనా లేక వాళ్ళు కామెంట్స్ రాసినా, రాయకపోయినా మీకు హ్యాప్పీసా?
[నేను మొత్తం చదివానండోయ్, పైని రాసిన కామెంట్స్ తో సహా]
@ సుజాత, బాబా, కొత్తపాళి, చావా, కొవ్వలి, వేణూ శ్రీకాంత్, బుడుగు గార్లకు,
మీ స్పందనకు ధన్యవాదాలు.
@మేధ గారు,
అవునా. నేను ANOTA డైలాగు కాపీ కొట్టా. ధన్యవాదాలు.
@శ్రీను గారు,
కనిపెట్టేశారు. :-)
@ చిన్నమయ్య గారు,
అలా తగలగలితే మనకు బోల్డు సుఖం. ధన్యవాదాలు.
@ రమణి గారు,
చాలా చాలా చాలా చాలా ధన్యవాదాలు.
@ ప్రవీణ్,
వాడు జ్యొతక్క తిట్లకు హడలి వెళ్ళి పోయాడనుకుంటా. ధన్యవాదాలు.
@ ఫణి గారు,
మంచి టైమింగ్.ధన్యవాదాలు.
@కె గారు,
మొత్తం చదివితే ఫుల్ హ్యాప్పీస్ కామెంటకపోయినా.ధన్యవాదాలు.
-- విహారి
బాగుందండి మీ టపా.నేను అన్ని రకలా వళ్ల లోకి వస్తాను:)ఐతే
:)
కొన్ని చదువుతాను comment రాయనుkonni పై పై న చదువుతాను.కొన్ని నచ్చి comment రాస్తాను:)
సొ మీది నచ్చే రస్తున్నాను :)
:)
హ్యాప్పిస్:))))))))))))
Post a Comment