Tuesday, July 15, 2008

ఎవడు గాలమేస్తే చేపలు పారిపోతాయో ఆడే ఈడు


ఒరేయ్! అన్నాయ్! చేపలు అలా పట్టర్రా. నాకివ్వు నే చూపిస్తా...
ఇదిగో ఇలా బాగా వెనక్కు లాగి .....
అలా విసిరి నీళ్ళళ్ళో వెయ్యాలి...
అన్నోయ్ చేప పడింది చూడ్రోయ్...
అమ్మోయ్ ఇది పట్టుకొనెళ్ళి మసాలా రాసేసి ఫ్రై చేసి పట్టుకొచ్చెయ్. నే తిని పెడతా.

(బొమ్మల మీద నొక్కితే విశ్వరూప ప్రదర్శన జరుగుతుంది)

19 comments:

బొల్లోజు బాబా said...

beautiful

Kranthi said...

baagundi vihaari garu mee photo tapa.nice photos very cute.

http://srushti-myownworld.blogspot.com

ప్రతాప్ said...

బావుందండీ, మీ చేపల వేట..

పూర్ణిమ said...

Cute :-)

మోహన said...

:) Title is so good. photos are cute

అశ్విన్ బూదరాజు said...

vihaari gaaru,

mI Tapaa TaiTile sooper aMDI muMdu, kiMda mIru raasina kaameMTulu muddu gaa unnaayi

జ్యోతి said...

అవునూ ఇందులో ఉన్నది మీ చిన్న పండు నా???

meenakshi.a said...

విహారి గారు....టైటిల్ సూఊఊఊఊఊఊపర్..
పిక్స్ చాలా బాఉన్నాయి...అవును ఆ చిన్న పాప మీ చిన్న పండు కదూ.?
cute...:)))

వేణూ శ్రీకాంత్ said...

హ హ విహారి గారు ఫొటోలు వ్యాఖ్యానం సూపరు... Sooo cute..

కొత్త పాళీ said...

హ హ హ .. భలే.
రెండో బొమ్మలో ఛాయాగ్రాహకుడు బాగా పడ్డాడు :)
ప్రోడక్టు ప్లేస్మెంటు గురించి మీదగ్గరే పాఠాలు నేర్చుకోవాలి. మనలో మాట, హోం డిపో వాడు ఎంతిచ్చాడు? :)
బుడ్డోళ్ళు మాత్రం సూపర్ కూల్.

సిరిసిరిమువ్వ said...
This comment has been removed by the author.
సిరిసిరిమువ్వ said...

టపా టైటిలు అదిరింది. బకెట్టు advertisement కూడా బాగుంది :)

Venu said...

:) inta chinna pillalu diaper to bhale cute gaa untaaru. !

కత్తి మహేష్ కుమార్ said...

బాగుంది. అదుర్స్.

నిషిగంధ said...

Cute pics :))

రాజేంద్ర కుమార్ దేవరపల్లి said...

ఏమండి విహారి గారు(ప్రభాకరరెడ్డి స్టైల్లో),మీకూ నాకూ ఇప్పటి వరకూ ఎలాంటి గొడవలూ లేవు,ముందు కూడా మీతో తగాదా పెట్టుకునే ఆలోచనా లేదు.మరలాంటప్పుడు మీరు ఈ గేలాలు.చేపలు,ఫొటోలు పెట్టి ఇప్పటికే సతమతై పోతున్న నాజీవితాన్ని మరింత అతలాకుతలం ఎందుకు చేస్తున్నారో నాకు అర్ధం కావట్లేదు.
నిన్న రాత్రి మీతాజా టపా తాపీగా చూస్తున్నా,మీ బుడ్డోళ్ళ ప్రతాపం చూసి అబ్బా విహారి తిక్కకుదిరింది,అనుకుంటూ,కుళ్ళుకుంటూ లోలోన యిరగబడి నవ్వుకుంటున్న సందర్భంలో ఉరుములేని పిడుగల్లే వచ్చాడు మా బబ్లూ గాడు.మధుబాబు షాడో కన్నా ఇంకా స్పీడుగా క్షణంలో వెయ్యో వంతు సమయంలో బ్లాగును మూసాను,లేకపోతే నా బతుకేమైపోయేది?
ఇప్పటికే,ఒక డైనా చాలు,టూ ఆర్సెస్,టూ ఎలిపెమ్ట్శ్ అంటూ నన్ను సతాయిస్తుంటే కుర్కుకురేల సాయం తో నెట్టుకొస్తున్నా.ఇక ఈ చేపల వేటా చూసాడా ఇక పద బీచుకెళదాం అంటూ నాచేత గోచీ పెట్టించి మరీ ఏ భీమిలో తీసుకెళతాడు.
ఎందుకు సార్ మామీద ఇంత పగ????

సుజాత said...

రాజేంద్ర గారు,
వూళ్ళో బీచ్ పెట్టుకుని మీ పిల్లల్ని ఫిషింగ్ కి ఇంతవరకూ తీసుకెళ్ళ లేదంటే మిమ్మల్ని ఏమనుకోవాలండి? అందునా భీమిలీ బీచ్ ఇలాంటి వాటికి బాగుంటదట కదా! పైగా విహారి గారి మీద దెబ్బలాటా?

రాజేంద్ర కుమార్ దేవరపల్లి said...

ఇశాపట్నమ్ బీచులో చెపలు పట్టటమా?అదీ మావాడిని తీసుకెళ్ళి??ఒక్కటన్నా డైనోసార్ కొనుక్కొస్తావా చస్తావా అని వాడు అడుగుతుంటే??మీరు మరీనండి..అప్పటికీ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళా కార్లో అద్దాలన్నీ మూసి తీసుకెళ్తుంటేనే వాళ్ళు తట్టుకొలేకపొతున్నారు..ఇక నాది ఎర్రబస్సు బ్యాచ్ .పైగా భీమిలి తీసుకెళ్ళమంటున్నారు మీరు బాబోయ్

Anonymous said...

@ బొల్లోజు బాబా, క్రాంతి, పూర్ణిమ, ప్రతాప్, మోహన, అశ్విన్‌,వేణు శ్రీకాంత్, వరూధిని, మహేష్,నిషిగంధ, సుజాత,వేణూ గార్లకు,

నెనర్లు.

@ మీనాక్షి, జ్యోతక్క,

అవును వీడే రెండో పండు.

@ కొత్తపాళి,
ఛాయగ్రాహకుడి ఛాయ అయినా లేక పోతే ఎలా.
అక్కడ బకెట్ ఇంత ఆకర్షిస్తుందని అనుకోలేదు.ప్రాడక్ట్ ప్లేసెమెంట్ గురించి తెలీదే. ఈ సారి హోం డిపో కు వెళ్ళినప్పుడు ఫోటో చూపించి డబ్బులడుగుతా.

@ రాజేంద్ర కుమార్ గారు,
మీ వాడు డైనోలడిగాడంటే స్పీల్ బర్గ్ రేంజులో వున్నాడు. కనీసం భీమిలైనా తీసుకెళ్ళి గోచీలతో ఓ తిమంగలాన్ని పట్టి మాకు చూపించండి.

-- విహారి