Thursday, May 31, 2007

ఓక ప్రశ్న ఇద్దరి సమాధానాలు:

ముఖ్యమంత్రి ని మాజీ ముఖ్యమంత్రి ని ఒక టీ.వి. కార్యక్రమానికి ఆహ్వానించారు. ఏదురెదురుగా కూచున్న వాళ్ళని యాంకర్ ప్రశ్నలేస్తోది.

మీరు బాగా అభివృధ్ధి చేసిన ప్రదేశం

ప్రభుత్వాధి నేత : నా నియోజక వర్గం
ప్రతిపక్ష నేత : నా నియోజక వర్గం

మీకు హైటెక్ పద్ధతిలో డబ్బు తినడం ఇష్టమా, ప్రాజెక్టులు పేరు చెప్పి డబ్బు తినడం ఇష్టమా?

ప్రభుత్వాధి నేత : రెండూ ఇష్టమే. రెండూ రెండు కళ్ళు లాంటివి.
ప్రతిపక్ష నేత : రెండూ ఇష్టమే. రెండూ రెండు కళ్ళు లాంటివి.

మీకు ఎదయినా పరాజయం ఎదురయితే దానికి కారణమేదని పిస్తుంది?

ప్రభుత్వాధి నేత.: నా ఎదురుగా కూర్చున్న ఆయన కారణమనిపిస్తుంది.
ప్రతిపక్ష నేత : నా ఎదురుగా కూర్చున్న ఆయన కారణమనిపిస్తుంది.

మీకు జీవితమంతా ఎలా గడపాలని పిస్తుంది?

ప్రభుత్వాధి నేత.: ప్రజా సేవలో
ప్రతిపక్ష నేత : ప్రజా సేవలో

అలా కాదు మీ శేష జీవితాన్ని ఎక్కడ గడపాలనిపిస్తోంది?

ప్రభుత్వాధి నేత.: ముఖ్యమంత్రి కుర్చీలో
ప్రతిపక్ష నేత : ముఖ్యమంత్రి కుర్చీలో

మీకు ఏమయినా ఆయనతో అభిప్రాయ బేదాలున్నాయా?

ప్రభుత్వాధి నేత.: ఆయనకు నేనంటే పడదు. నా అభివృధ్ది పథం వేరు. ఆయన అభివృద్ధి పథం వేరు.
ప్రతిపక్ష నేత : ఆయనకు నేనంటే పడదు. నా అభివృధ్ది పథం వేరు. ఆయన అభివృద్ధి పథం వేరు.

మీరు ఒకే మాట మీద వుండి ఓటు వేసేదెప్పుడు?

ప్రభుత్వాధి నేత.: మా జీతాలు పెంచాలని ఓటింగ్ పెట్టినప్పుడు.
ప్రతిపక్ష నేత : మా జీతాలు పెంచాలని ఓటింగ్ పెట్టినప్పుడు.

2 comments:

సత్యసాయి కొవ్వలి Satyasai said...

రెండు ప్రశ్నలు - ఒకే సమాధానం
ప్ర౧. ఈ బ్లాగు పోస్టు ఎలాఉంది?
ప్ర౨. విహారి టపాలు ఎలా ఉంటాయ్?

జ. అదుర్స్

రానారె said...

మీకెవరినైనా మొత్తాలని ఉందా? ఉంటే ఎవరిని? ఎందుకు

ప్రభుత్వాధినేత: అర్జంటుగా మొత్తాలని ఉంది. విహారిని. మాతో ఒకే మాట మాట్లాడించే ఆటాడినందుకు.
ప్రతిపక్షనేత: అర్జంటుగా మొత్తాలని ఉంది. విహారిని. మాతో ఒకే మాట మాట్లాడించే ఆటాడినందుకు.