డాక్టర్ చింగ జింగ చూ యాక్
.
ఈ మధ్య ఆర్. నారాయణ మూర్తి అన్నమాచార్య సినిమా తీసినట్టు, ఫైల్ మీద్ ఎందుకు సంతకం పెట్టలేదో అడగటానికి వచ్చిన సోనియా గాంధీని మన్మోహన్ సింగ్ గోడ కుర్చీ వేయించినట్టు, రాజ శేఖర్ రెడ్డి, పి.జె.ఆర్. కలిసి మందు కొట్టినట్టు, చంద్ర బాబు రెండు గంటలు మాట్లాడినా రెండు వేళ్ళూ చూపకుండా ఆ విధంగా అనే పదాన్ని వాడనట్టు, నా బ్లాగులో ఉబుసుపోక రాసుకోక పద్యాలు నేర్చుకోవాలనే పట్టుదల వచ్చినట్టు, అందరూ మెచ్చుకునే బ్లాగులన్నీ చాలా చండాలంగానూ, అసలు వీడొక వేస్టు బ్లాగ్గాడు వీడి బ్లాగులు చదవడం కన్నా ఏ తెలుగు సినిమానో, టి.వి.9 చూడ్డం నయం అని అందరూ అనుకునే బ్లాగులకు ఆస్కార్ అవార్డు ఎందుకు రాలేదు అని అందర్నీ ప్రశ్నిస్తూ ఈనాడు, ఆంధ్ర జ్యోతి, వార్త త్వరలో రాబోయే ఉదయం, సాక్షి దిన పత్రికలలో దినానికొక ప్రకటన ఇస్తునట్టు ఆవేశం వస్తోంది. ఆ ఆవేశంలో బ్లాగ్‌మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ స్థాపించాలనిపిస్తోంది.(బ్లాగ్ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ త్వరలో).
ఇది ఇంతకూ నిజమైన ఆవేశమో, ఆవేదనో తేల్చుకోవాలంటే ముందుగా “ఎవర్ని కలవాలి …ఎవర్ని కలవాలి” అని బుర్ర మీద చిటికెన వేలు పెట్టి నెర్రెలు వచ్చేట్టు కొట్టుకుంటుంటే మా చిన్న బుడ్డోడు వచ్చి.. “డా..డా..డా” అన్నాడు. గీతోపదేశం చివరి సీన్లో అర్జునుడి లాగా వాడికి సాష్టాంగ దండ ప్రణామం చేసి “నన్ను డాక్టరుని కలవమని సలహా చెప్పినందుకు నీకు జీవితాంతం నాన్నా అనే అదృష్టాన్నిస్తున్నా” అని వరమిచ్చేశా.
వెంటనే చెత్త బుట్టెక్కడుందో వెదికి అందులోనుండి ఫోను బుక్కు, పెన్సిల్ ముక్క బయటికి తీశా. చేతికి తగిలిన ఫోను మాత్రం అందులోనే వేసేశా. పిల్లలున్న ఇంట్లో ఏది దాచాలన్నా చెత్త బుట్ట లే సేఫ్టీ ప్లేసులు ప్రభుత్వం కబ్జా చేసిన భూమి లాగా. ఫోను బుక్కు తీసి ఇన్సూరెన్సు కంపెనీ ఫోను నంబరు మీద కుడి చేతి చూపుడు వేలు పెట్టుకొని చెత్త బుట్టలో ఎడమ చెయ్యి పెట్టి ఫోను తీశాను. ఇన్సూరెన్సు కంపెనీ నంబరుకి డయల్ చేసా. తేజా టి.వి. లో రెండు సినిమాలు అయిపోయిన తరువాత ఓ ఆవిడ లైన్లోకొచ్చింది.
“మే ఐ హెల్ప్ యూ” అంది.
ఏంటి ఈవిడెందుకు నాకు సహాయం చేస్తుంది అని “వై డూ యూ వాంట్ టు హెల్ప్” అని అడిగా.
“సర్ యు కాల్డ్ జిగ్నా ఇన్సూరెన్సు. డూ యూ నీడ్ ఎనీ హెల్ప్” అంది.
అప్పటిదాకా “చెల్లీ! పుట్టింట్లో మళ్ళీ పుట్టకు తల్లీ” అనే అరవం సినిమా “అంతరిక్షంలో రక్కసి కుక్క” అనే హాలీవుడ్ సినిమా చూడ్డం వల్ల షార్ట్ టర్మ్ అమ్నీషియా వచ్చింది. టి.వి. ఆఫ్ చెయ్యగానే గతం గుర్తుకు వచ్చింది.
“యా..యా..ఐ నీడ్ హెల్ప్. ఐ వాంటూ సీ ఏ డాక్టర్ ఇన్ మై నెట్వర్క్”
“ఓ ఐ సీ.. యువర్ కంపెనీ ఇన్సూరెన్స్ పాలసీ సక్స్…సో యు గెట్ ఓన్లీ వన్ డాక్టర్ ఇన్ దట్ ఏరియా. ద నియరెస్ట్ డాక్టర్ లివ్స్ 120 మైల్స్ ఫ్రం యువర్ ప్లేస్. అదర్ వైస్ యు హ్యావ్ టు గో టూ షికాగో ఆర్ న్యూయార్క్.”
ఇప్పటికే ఇన్సూరెన్సు దెబ్బలకి కంపెనీలే మూసుకుంటున్నాయి నా నోరు మూసుకోలేనా అని వెధవ ప్రశ్నల్ని టప్ మని ఆపి నోరు అప్పళంలా తెరిచి తృతీయ ఫ్రంట్ కన్వీనర్ లా “ఇట్స్ నో బిగ్ డీల్. ఐ కెన్ డ్రైవ్ టు దట్ డాక్టర్” అని చెప్పా.
“ఓకే సర్. ప్లీజ్ నోట్ డవున్ ద డాక్టర్స్ నేం. హిస్ నేం ఈజ్ చింగ జింగ చూ యాక్ అండ్ ద అడ్రెస్ ఈజ్… థ్యాంక్యూ సర్”
“హోల్డాన్. ఐ హ్యావ్ అనదర్ క్యశ్చెన్.” స్పీకర్ సురేష్ రెడ్డిని అడిగినట్లు అడిగా.
“సారీ సర్. విద్ యువర్ ఇన్సూరెన్స్ పాలసీ యూ గెట్ ఒన్లీ దట్ మచ్. కాల్ అస్ నెక్స్ట్ ఇయెర్. విష్ యూ గుడ్ హెల్త్” ఫోను పెట్టేసింది.
ఇక అమెరికా గూగుల్లో వెదికా ఆ డాక్టర్ ఎలాంటి వాడో అని. ఇలాంటి డాక్టర్లు ప్రపంచంలో ఇద్దరే వున్నారట. ఒకరు మా ఊరికి దగ్గర్లో ఇంకొకరు లాస్ ఏంజిలిస్ లో. ఆ డాక్టర్ల పేర్లు “లాస్ ఏంజిలిస్ చింగ జింగ చూ యాక్” మరియు “మా ఊర్లో చింగ జింగ చూ యాక్” అట. ఈ డాక్టర్లను కలవాలంటే మామూలు రోజుల్లో లీవు దొరికే వాళ్ళు మా వూరికి రావాలట. లీవు దొరకని వాళ్ళు శనాదివారల్లో లాస్ ఏంజిలిస్ కి పోవాలట. వీళ్ళిద్దరూ మిగతా రోజుల్లో ఎక్కడుంటారో ప్రపంచానికి కానీ, ప్రతిపక్షానికి కానీ తెలీదట. అలా అని అమెరికా గూగుల్లో వుంది. ఎందుకైనా మంచిది అని సెకండ్ ఒపీనియెన్ కోసం ఇండియా గూగుల్లో వెదికితే ఇద్దరూ ఒకటే నని తెలిసింది.
సరే నని డాక్టర్ చింగ జింగ చూ యాక్ ఆఫీసుకు ఫోను చేసి అపాయింట్‌మెంట్ తీసుకున్నా. ఆఫీసులో మా బాసు కనిపించినప్పుడల్లా కుంటు కుంటూ నడిచా సిక్ లీవు కోసం. బాసు చూశాడో లేదో గానీ మిగిలిన వాళ్ళందరూ “నీకు ఆపిల్ పళ్ళు తెచ్చివ్వనా” “కేఫిటేరియా కెళ్ళి కాఫీ తీసుకురానా” “నువ్వు మెట్లెక్కలేవు గదా నీ బ్యాగు నే మోసుకురానా” “మా ఇంట్లో మా అత్త తెచ్చిన జిందా తిలిస్మాత్ వుంది తీసుకురానా” అని మదర్ తెరిస్సా పాత్రలో జీవించేశారు.
ఓ రోజు దేవుడికి ఇండియెన్ స్టోర్స్ లోనుండి కొనుక్కొచ్చిన పెద్ద కొబ్బరి కాయ కొట్టగానే లీవొచ్చింది. అదేంటో ఈ మధ్య అమెరికన్ స్టోర్స్ లో కొన్న కొబ్బరి కాయలకి ఎఫెక్టు వుండటం లేదు.
నీతి: నాన్-భారత్ లో వున్న అందరూ ఇండియెన్ స్టోర్స్ లోనే కొబ్బరి కాయలు కొనండి(పుచ్చులు ఎన్ని వున్ననూ).
ఆ రోజు రానే వచ్చింది. పులుసన్నమూ, మజ్జిగన్నమూ బాక్సులో పెట్టుకొని బయలు దేరా చింగ జింగ చూ యాక్ ఆఫీసుకి (ఇక్కడ క్లినిక్కులని అట్లే అంటారు). కొండలూ, కోనలూ, సముద్రాలూ, నదులూ, కార్లూ, ట్రక్కులూ, ఏర్‌పోర్ట్లు, రైల్వే స్టేషన్లూ, హార్బర్లూ దాటుకొని మజ్జిగన్నమూ, పులుసన్నమూ మింగేసి డాక్టర్ ఆఫీసుకు వెళ్ళా.
లోపలికి అడుగు పెట్టగానే చైనాకి పాస్ పోర్టు లేకుండా వెళ్ళినంత అనుభూతి వచ్చింది.
అక్కడున్న రిసెప్షనిస్టు పేద్ద మిని స్కర్టు వేసుకొని కుడితిలో చేప పిల్ల నవ్వినట్టు నవ్వి “ ఫిలా అప్లికే..” అంది.
వెంటనే అప్లికేషన్ ఫాం తీసుకొని పూర్తి చేసి ఇచ్చేశా.
“డూ ఇన్సూ..కా ?”
ఇన్సూరెన్సు కార్డు ఇచ్చా. దాన్ని ఫోటో కాపీ తీసుకొని ఇచ్చేసింది.
“వే..హీ..నసూ..వి..కా..”
నర్సు వస్తుందని ఎదురు చూశా. రానే వచ్చింది.లోపలికి తీసుకెళ్ళింది.
“యూ ఇందయా..” అడిగింది
“యా..” సమాధిలో కెళ్ళినంత ఆనందంగా సమాధాన మిచ్చా.
నిలబెట్టి పొడవు, పడుకోబెట్టి చెవిలో ఉష్ణోగ్రతా చూసింది. తరువాత కుర్చీలో కూచో బెట్టి ప్రశ్నలేసింది.
“వాటె ప్రాబ్లెం”
“的头名得 地;头痛;担心事日事复一日地日日夜;痛夜”
“యూ నో చేనీ…”
“很得休息事变得日休事乱”
ఇక ఆవిడ ఆనందానికి హద్దుల్లేవ్. ఆ ఆనందంలో ముద్దు పెట్టుకుంటుందేమో ఈ అమ్మాయి అని మనసులో ఒకటే ఆనందం. చైనీస్ అమ్మాయి ముద్దు మొదటి అనుభవం అని బుగ్గల్లోకి మరింత గాలి కొట్టి పొంగించి కళ్ళు మూసుకుని ఎదురు చూస్తూ వుంటే హుస్సైన్ సాగర్ లో గణేష్ నిమజ్జనం చేసే ముందు నీళ్ళింకి పోయినట్టు జిగటగాడు అదే డాక్టర్ చింగ జింగ చూ యాక్ లోపలికొచ్చాడు.
“起号然到召…武拿阳然武召号” నర్సు
“到见武偶然底地)阳” డాక్టరు.
“彻屋底修整(房屋)” నర్సు
“均屋植]无论器无阳光无有的能阳长” డాక్టరు
డాక్టరూ, నర్సు నడిచే విమానం ఇంజిన్ లో సుమీత్ మిక్సీ పెట్టి పిండి రుబ్బినట్టు పక్కుమని నవ్వుకొని నన్ను చూశారు. చైనీస్ సినిమాలో ఈకలు పీకిన నాటు కోడి పెట్ట ని తలకిందులుగా వేళ్ళాడ దీసి జాకీ చాన్ గాల్లోకి ఎగిరి ఒక్క కాలితో తన్ని దాని తలకాయ లేపినట్టు కళ్ళ ముందు సీను కదలాడింది.
“సో వాటీజ్ యువర్ ప్రాబ్లెం” డాక్టర్ యాక్ అడిగాడు.హమ్మయ్యా బొచ్చు పీకిని కోడిలా కాకుండా పందెం కోడికి జీడి పప్పు పెడుతున్నట్టు అడుగుతున్నాడు అని ఆనందమేసింది.
“ఐ యాం లుకింగ్ థింగ్స్ డిఫెరెంట్లీ..”
“వాట్ డూ యూ డూ?”
“సాఫ్ట్వేర్” నేను
“లీషర్ టైం”
“బ్లాగ్స్..” నేను
“ఓ బ్లా..”
“యా బ్లా..” నేను
“యూ మీన్ బ్లా..”
“యా ఐ మీన్ బ్లా..” నేను
“ఐ బ్లా…ఆల్వేస్.”
“ఐ టూ బ్లా కొంచెం కొంచెం ఆల్వేస్.” నేను
“వాట్ లాంగ్వేజ్?”
“తెలుగు” నేను
“యువ బ్లా నేం..”
“విహారి..” నేను
“సో యు హ్యావ్ సం ప్రాబ్లెం..?”
“నో సం ప్రొబ్లెం…. బిగ్ ప్రాబ్లెం..” నేను
“ఐ డూ హ్యావ్ సేం బిగ్ ప్రాబ్లెం. ఐ విజిట్ యువర్ బ్లాగ్…”
“ఏంటి నా బ్లాగా..?”
“యా..”
“ఎందుకు..”
“ఐ నీడ్ సం సొల్యూషన్..”
“నా దగ్గిరేముంది బూడిద..?”
“ఐ లెఫ్ట్ సం కామెంట్స్ ఆన్ యువర్ బ్లాగ్ టు గెట్ ఆన్సర్స్..”
“ఎక్కడా..? ఎప్పుడూ? ”
“ఇదిగో… వనా హీ….. అనా వనా హీ ..”
.
13 comments:
చైనా అమ్మాయిని ముద్దు పెట్టుకుందామని అలోచన వచ్చినట్టు ఇంత పబ్లిక్ గా రాసేయమాకండి గురువుగారు, ఇంట్లో తెలిసిందంటే అంతే సంగతులు... :-)
http://dictionary.reference.com/translate/index.html వాడి తర్జుమా చేస్తే సంబంధం లేకుండా ఏదో చూపిస్తోందే...
---
డాక్టరు
“వాటె ప్రాబ్లెం”
“famous headache; Headache matter; Worry matter day after day day and night”
“యూ నో చేనీ…”
“rest daily variation very chaotic”
ఇక ఆవిడ ఆనందానికి హద్దుల్లేవ్. ఆ ఆనందంలో ముద్దు పెట్టుకుంటుందేమో ఈ అమ్మాయి అని మనసులో ఒకటే ఆనందం. చైనీస్ అమ్మాయి ముద్దు మొదటి అనుభవం అని బుగ్గల్లోకి మరింత గాలి కొట్టి పొంగించి కళ్ళు మూసుకుని ఎదురు చూస్తూ వుంటే హుస్సైన్ సాగర్ లో గణేష్ నిమజ్జనం చేసే ముందు నీళ్ళింకి పోయినట్టు జిగటగాడు అదే డాక్టర్ చింగ జింగ చూ యాక్ లోపలికొచ్చాడు.
“summons…Takes up the weapon” నర్సు
“accidentally) sees” డాక్టరు.
“thorough conditioning (house)” నర్సు
“plants], regardless of whether there is the sunlight can grow” డాక్టరు
ఏవిటి, చైనీస్ అమ్మాయి ముద్దు పెట్టుంకుంటుందేమో అని సంబరబడటమే..? :-O సంవత్సరాలుసంవత్సరాలు పళ్ళుతోముకోరని ఘనతకెక్కిన చైనీస్ ముద్దుకి సంబరపడుతున్నరంటే రోగం బాగా ముదిరినట్టే లెక్క.
Glad you posted this on a weekend!
Would have had tough time to contain the laughter in on a week day at work
తృతీయఫ్రంటుకన్వీనరులా, సమాధిలోకెళ్లినంత ఆనందంగా, స్పీకర్ సురేశ్ రెడ్డిని అడిగినట్లు ... మీకు మీరే సాటి. కామెడీ రాయడమే చాలా అరుదు. ఇంత తరచుగా నాణ్యంగా రాయడం మహా అరుదు. తెలుగు బ్లాగులోకానికి మీ బ్లాగొక మణిపూస.
హాహాస్య బ్రహ్మొ ఏదో బిరుదు గాని వుందా మీకు?
మీ కాలు నెప్పి ఏమయిందో గానీ, ఈ టపా చదివేటప్పటికి నాకు బుగ్గలు నెప్పొచ్చాయి నవ్వలేక!
హన్నా విహారి!!!. నీకు బ్లాగు పిచ్చి బాగా ముదిరింది కాని పాములు, బొద్దింకలు, తేళ్ళు, కోతులు, పురుగులు తిని పళ్ళూ తోముకోని పాచిపళ్ళ చైనా సుందరి ముద్దు పెట్టుకుంటుందని ఎదురుచూసావా?????........హైదరాబాదు పాతబస్తీలో పురాణాఫూల్ దగ్గర ఒక పూలదుకాణంలోని పీరు సాహెబ్ ఇలాంటి రోగాలకు మంచి మంత్రం వేస్తాడంట. నేను నీ పేరు మీద చక్కెర మంత్రించి ఇచ్చి పంపిస్తాలే ఎవరితోనైనా. ఈ డాక్టర్లు పనికిరారుగాని, మీ ఆవిడను. వేపాకులు దొరికితే సరి లేకుంటే ఏ ఆకులైన సరే వాటితో నిన్ను బాగా దుమ్ము దులిపి ఓ పది నిమ్మకాయలు నీ తలమీద పిండి మర్ధన చేయమను .. ఈ వింత వింత కోరికలన్నీ మాయమై పోతాయి. తర్వాత ఏమైందో చెప్పాలి సుమా! ఇక్కడ అందరూ ఎదురు చూస్తూ ఉంటాము.. ఏంటేంటో మాట్లాడుతున్నావ్.
విహారీ....నువ్వొక హాస్య కథల బేహారీ......
చైనా అమ్మాయిని ముద్దు పెట్టుకుంటే అంతే సంగతులు.......పళ్ళు పుచ్చి శల్యమౌతాయి.....
優秀花花公子帽子我握我的胃
హ హ..అదిరింది ఎప్పటిలానే.మరీ అన్ని టపాలూ బాగా రాసేస్తే ఎలా?
నా బ్లాగుకి కూడా సేం చైనా కామెంట్స్ వచ్చాయి.
@ వేణు గారు,
లేటుగా రియలైజ్ అయ్యా. మీకు సమాధానం ఇస్తున్నానంటే మా ఆవిడ ఇంకా ఈ విషయం కనుక్కోలేదు.
@ వెంకట రమణ గారు,
మీరు డీకేశ్టీ రమణ గారా?
@ చేతన గారు,
అయితే పెద్ద ఇటలీ డాక్టరును చూస్తా ఈ సారి.
@ కొత్త పాళి గారు,
ఇంకో సారి మీకా అవకాశం ఇవ్వను. ఈ సారి ఆఫీసులో నవ్వి మీ ఉద్యోగం హిచ్ కాక్..(హుష్ కాకి)
@ రానారె,
ఏమయినా మీది నిండు విశ్లేషణ. మీకు వెన్న పూస నెనర్లు.
@ రమ్య గారు,
ఆ బ్రహ్మ బిరుదు లేదుగానీ. అలాంటి దేదో ఇచ్చేసి నా ఇమేజీని పాడు చేయకండే :-) అసలే ఇలాంటి వాటికి నేను ప్రభుత్వం నిజాయితీకి వున్నంత దూరంలో వుంటా.
@ తెరెసా గారు,
జిందా తిలిస్మాత్ రాసుకోండి. ఫీజు నన్నడక్కండి. అసలే మా జింగ చింగ చూ యాక్ ఊరొదిలి పెట్టి పోయాట్ట.
@ జోతక్కో,
ఇండియా వచ్చినప్పుడు మా ఆవిడని నీకు అసలు పరిచయం చెయ్యను గాక చెయ్యను. సీతమ్మ లాగ వుండేదాన్ని రుద్రమ దేవి లాగ చెయ్యాలని కంకణం కట్టుకున్నావా.
@ ప్రియమైన నీకు గారు,
"అయినను వెళ్ళి రావలె.." అన్న చందాన ఈ సారి టూత్ పేస్టూ బ్రష్షూ తీసుకెళ్తా.
@ తెలుగు వీర గారు,
公優花帽子秀花子.
@ రాధిక గారు,
మీకు డాక్టర్ చింగ జింగ చూ యాక్ ఫోను నంబరిస్తా మళ్ళీ ఇలాంటివి రాయొద్దని గట్టిగా చెప్పండి అప్పడాల కర్రతో.
-- విహారి
విహారి గారు ...
మీరు మాములు వాళ్ళు కాదండీ .....
నిజం గా ఎంత మ్యాజిక్ ఉంది మీ మాటలలో ....
చాలా బా రాశారు, రియల్లీ....
ఇప్పుడర్థమైంది ...ప్రవీణ్ చిహారి కేక అని అందుకన్నరో ....
Post a Comment