Friday, February 08, 2008

ఈ సంవత్సరం పర్ఫామెన్స్ అప్రైసల్స్

కొంతమంది బ్లాగు సోదరులు బ్లాగుల అప్రైసల్స్ చేస్తున్నారు. మా మ్యానేజరేమో నా అప్రైసల్ చేశాడు. ఈ నా అప్రైసల్ మీ ముందు పెట్టిన తరువాత నా టీములో చేరే వాళ్ళందరూ చేతులు పైకెత్తండి.






నా అప్రైసల్ కు ముందు నేను కొందామనుకున్నది ఇది:





నా అప్రైసల్ తరువాత నేను కొన్నది:






దీనికి స్టాండు కూడా లేదని అండర్ స్టాండింగు చేసుకోక పోతే మీ అప్రైసల్ తో కొనేది సైకిలు హ్యాండిలే.




బైదవే ఇది గూఢచారి 116వ టపా.


6 comments:

వికటకవి said...

అదేంటి బాసూ, అర్ధాలు రెండున్నాయి, నీ పనితనం బాలేదనా లేక మీ కంపనీ పనితీరు
బాలేదనా నీకు సైకిల్ యోగం పట్టింది? అయినా సైకిలని తొసెయ్యకు, "బాబు" ఇప్పుడు అవే యాత్రలు చేయిస్తున్నాడు మన తెలుగు దేశంలో. నీకూ ఈ సైకిలు చూసి సీటిచ్చినా ఇస్తాడూ, ఎన్.ఆర్.ఐ కోటాలో.

116 అనగానే సూపరుస్టారు కృష్ణ గుర్తొచ్చాడు, ఆ చివరి వాక్యం డైలాగుగా భలే నప్పుతుంది కృష్ణకి.

అయినా ఈ బ్లాగు సోదరుల అప్రైసలుతో వచ్చేవి చప్పట్లే, కనీసం నీ హాoడిల్ కొనుక్కునే డబ్బులు కూడా రావు సుమా :-)

నా అప్రైసలు 116 చప్పట్లు.

జ్యోతి said...

హన్నా విహారి !!

భలే తెలివి కలోడివిలే.. అప్రైసల్ వచ్చిందని చెప్పి , ఎక్కడ పార్టీ అని అడుగుతారని కారు, సైకిల్ చూపిస్తావా. మేమందరం చెవుల్లో కాలిప్లవర్‍లు పెట్టుకున్నామనుకుంటున్నావా??? నువ్వే ఎంజాయ్ చేయి..
బ్లాగర్లకి అప్రైసల్ ఐతే సైకిల్ గాలికొట్టే డబ్బులు కూడా రావు. ఉత్తుత్తి తుత్తిలే అందరికీ..

నీకు 1116 చప్పట్లు.. దాచుకో

రవి వైజాసత్య said...

అయ్..కారుబోయి..సైకిలొచ్చె డాం డాం డాం
సైకిల్బోయి..??

యోగేంద్ర said...

మీ పరిస్థితే బాగుంది, సైకిల్ అయినా కొనుక్కోగలిగారు, నాక్కూడా అప్రయిసల్ వచ్చింది, ఏమేమి అమ్మేసుకొవాలో ఇంకా తెలియటం లేదు

రవి said...

రాజీనామా చేస్తానని బెదిరించండి. పైనున్నది కాకపోయినా, ఓ 'నానో ' అయినా వస్తుందేమో.

రవి said...

రాజీనామా చేస్తానని బెదిరించండి. పైనున్నది కాకపోయినా, ఓ 'నానో ' అయినా వస్తుందేమో.