Monday, April 07, 2008

సర్వ ధారి నామ యుగాది శుభాకాంక్షలు (మరి కొన్ని ఎగస్ట్రాలు)

:::::::::

తెలుగు లోక జనులందరికి ఉగాది శుభాకాంక్షలు. ఇప్పటికే దాదాపు అందరి ఇళ్ళల్లో పోళీలు(బొబ్బట్లు), పచ్చడి తయారు చేసిన గిన్నెలు కడగడానికి సిధ్ధమయి పోయుంటాయ్. భూమికి ఇంకో వైపున వున్న తెలుగు వారిళ్ళలో వచ్చే వారాంతం దాకా వంట గిన్నెలు ఫ్రిజ్వాసనలు వెదజల్లుతూ వుంటాయి. మా ఇంట్లో అయితే ఉగాది ఇలా జరిగింది.

" ఊ...వూ....ఊ యా..వూ వూ యా యా...."
" గ్యా ..గెగెగ్గే.....గేగెగ్గే...గ్యా..గ్యా..గ్యా గెగ్గెగ్గే.."
" ది...దిద్ది..దెద్ధే ద్దే..దే..దే...దీ...దీ..దే..."

ఇది మా చిన్న బుడ్డోడు ఏడ్చేప్పుడు ఇచ్చే సౌండు. ఊరూరా,ఇల్లిల్లూ తిరుగుతూ ఉత్తర అమెరికా ఖండాన్ని పావనం చేస్తూ వస్తోన్న రక రకాల వైరసమ్మలు మా ఇంటిని కూడా పావనం చేశాయి. దీని పేరు 'స్టమక్ వైరసమ్మ'. సేవించు విధానం. ఏవీ లేదు ఏదీ(లోనికి) సేవించకుండా వుంటే చాలు. ఈ సందర్భంగా టైలనాల్,విక్స్,ధర్మా మీటర్ అన్నీదగ్గర వుంచుకొని పరమ పవిత్రంగా సేవిస్తున్నాం. పొరపాటున వళ్ళోంచి కిందకు దింపితే మా బుడ్డోడు ఉగాదిని గుర్తు చేస్తున్నాడు.

మొదటి లైను ..ఊ : వార్నింగ్ రాగం
రెండో లైను ....గ్యా : ఆరున్నొక్క రాగం
మూడో లైను...దెద్ధే : ఊర్లో వాళ్ళొచ్చే రాగం

:::::::::


ఉగాది సందర్భంగా నేను తీసుకున్న నిర్ణయాలు: భవిష్యత్తులో ఎప్పుడూ నిర్ణయాలు తీసుకోకూడదు.

(మీ మనసులో 'హమ్మయ్య వీడు బ్లాగులు మానేస్తానని నిర్ణయం తీసుకుంటే బావుండు' అనిపించింది గదా. ఎప్పుడన్నా అలాంటి నిర్ణయం తీసుకుంటే నమ్మొద్దని ముందే వార్నింగ్ )

:::::::::

6 comments:

Srividya said...

:)

కొత్త పాళీ said...

హయ్యో పాపం. వైరసమ్మలనించీ నీరసమ్మలనించీ సత్వరమే కోలుకుని అందరూ కలిసి కోరసమ్మల్ని (chorus) ఎత్తుకోవాలని ఆశిస్తూ

Naga said...

ఊగ్యాది శుభాకాంక్షలు... :) అంటే నిర్ణయాలన్నీ 'ప్రస్తుతం'లోనే తీసుకుంటారని అర్థమా?

రవి said...

:-) ఉగాది రోజు మంచి టపాకాయ పేల్చారు సార్!

Anonymous said...

ధన్యోస్మి

-- విహారి

Kamaraju Kusumanchi said...

మొదటి లైను ..ఊ : వార్నింగ్ రాగం
రెండో లైను ....గ్యా : ఆరున్నొక్క రాగం
మూడో లైను...దెద్ధే : ఊర్లో వాళ్ళొచ్చే రాగం


ప్రాస అదిరింది విహారి గారూ!