Tuesday, March 20, 2007

టెలీఫోను వాయిస్ మెసేజ్ ఎలా పెట్టాలంటే..

ఎవరో అన్నట్టు 'నవ్యత జీవితానికి సుగంధం వంటిది'( "variety is the spice of life" ని కొంచెం మార్చా) అని. నేను ఇలాంటి వెరైటీ పన్లు చాలా నే చేశేవాడిని కాలేజీ రోజుల నుండి. అమెరికా వచ్చిన కొత్తలో చూశా ఎవరి ఇంటికి ఫోను చేసినా వాళ్ళు లేనప్పుడు వచ్చే ఫోను మెస్సేజ్ సాధారణంగా "నేను లేను నీ మెసేజ్ పెట్టు" అనో, "అడ్డడ్డే నేను మిస్సయిపోయా నీ ఫోను...నీ మెసేజ్ పెట్టు", "ఫోను చేసినందుకు ఏడిసాం(సంతోషం) నువ్వు నీ పేరు చెప్పుకొని నీ ఫోన్ నంబరు ఇచ్చుకో" అనో లేదా "నీ ఫోన్ నంబరు చెప్పు" అనో వుండేటివి. అవన్నీ చూసి విసిగి పోయి నేను సెపరేటు గా రూము తీసుకున్నప్పుడు నా ఫోనులో ఇలా మెసేజ్ పెట్టా.

"Welcome to the kingdom of bhoopathi vihaari. The king is on move. please leave your name and number. King will return your call as soon as he reaches his fort"

ఈ మెసేజ్ చూసిన/విన్న వాళ్ళలో నవ్వని వాళ్ళుంటే ఒట్టు. కొంత మందయితే నవ్వుతూ అసలు విషయం మరిచి పోయి మళ్ళీ ఫోను చేసి మెసేజ్ పెట్టేవాళ్ళు. ఇంకొందరయితే నేను ఆఫీసుకు వెళ్ళినప్పుడు ఇంటికి ఫోను చేసి ఆ పక్కనున్న వాళ్ళకు వినిపించే వాళ్ళు.

"మడిశన్నాక కూసింత కళాపోసన వుండాల.."

ఓ రెండేళ్ళకు ఆ మెసేజ్ మారిపోయింది మా ఆవిడ రంగప్రవేశం చేశాక.

6 comments:

spandana said...

మీ ఆవిడ వచ్చాక ఏమని పెట్టారో అదీ చెప్పండి నవ్వుతాం. లెదంటే ఫోను నంబరు చెప్పండి మిరు లేనప్పుడు ఫోన్ చేస్తాం.
--ప్రసాద్
http://blog.charasala.com

రాధిక said...

ఇప్పుడేమని పెట్టరు?లేండ్ కే అలా పెట్టారా?సెల్ కి కూడానా?

రానారె said...

"నేను ఇలాంటి వెరైటీ పన్లు చాలా నే చేశేవాడిని " ... ఇప్పుడు మానేసినట్టు! :))

కొత్త పాళీ said...

ధ.దే.ఈ.శు. జోకు లేదా?

Sudhakar said...

ఆవిడ వచ్చాక పెట్టిన సందేశం బహుశా కొద్దిగా ఇలా మారి ఉండవచ్చు..

Welcome to the kingdom of bhoopathi. His highness, price of dutch, the Queen's husband is on move. please leave your name and number. The Queen's husband will return your call as soon as he reaches his fort.

;-)

కొత్త పాళీ said...

Correction, Sudhakar!
....as soon as he reaches her fort!
:-))