Friday, March 30, 2007

ధ.దే.ఈ.శు. -- జోకు

టీచర్: ఒరేయ్ రామూ ఉన్నట్టుండి దేవుడు ప్రత్యక్షమై "నీకు ఏం కావాలో కోరుకో" అంటే నువ్వేమడుగుతావ్?

రాము: నాకు పది కోట్లు కావాలని అడుగుతా మాస్టారూ.

టీచర్: అదే నేనయితే ఏమి కోరుకుంటానో తెలుసా? మంచి బుద్ది ప్రసాదించమని కోరుకుంటా

రాము: అంతేలే మాస్టారూ ఎవరికి ఏది లేక పోతే దాన్ని కోరుకుంటారు.

టీచర్ : ? ? ?

4 comments:

కొత్త పాళీ said...

తెలుగు బ్లాగ్లోకం మాకు విహారిగారి ధ.దే.ఈ.శు. జోకులు కావాలని కోరుకుంటుంది. :-)
ఊప్స్. లేనిది కదా కోరుకోవాలి - ధదేఈశు జోకులు ఆల్రెడీ ఉన్నైగా! మరేం కోరుకోవాలి చెప్మా??

ప్రవీణ్ గార్లపాటి said...

మరి లేకపోతే పిల్లాణ్ణి కొచ్చెన్ అడుగుతారా ? ఆయ్...

విహారి said...

:-)

తెలుగు'వాడి'ని said...

నవ్వులే నవ్వులు