Monday, June 11, 2007

సినిమా నటుల బ్లాగులు

సినిమా వాళ్ళు బ్లాగులు రాయటం మొదలు పెడితే వాళ్ళ బ్లాగుల పేర్లు.


బాలకృష్ణ............బ్లాగు సింహా రెడ్డి (కాప్షన్: ఒక్క టపా తో చంపేస్తా)

చిరంజీవి............బ్లాగ్ లీడర్(ఒక్క టపా రాస్తే కామెంట్లు గడ గడ రాలాల)

వెంకటెష్ ............బొబ్బిలి బ్లాజ(బలపం పట్టి బ్లాగు రాయ్)

నాగార్జున ...........బ్లాగ్ మణి 9846(నా టపాక్కొంచెం మెంటల్)

మోహన్ బాబు........బ్లాగు రౌడీ(ల్యాప్ టాపూ, డెస్కు టాపూ ఏ బ్యాక్ ప్యాకులో లేని సిల్లీ నాకొడుకుని)

జునియర్ ఎన్టీఆర్......బ్లాది కేశవ రెడ్డి (అమ్మతోడు అడ్డంగా బ్లాగేస్తా...కామెంటేసి పో)

మహేష్ బాబు.........పోకిరోడి బ్లాగు(టపా రాసామా లేదా అన్నది కాదు ముఖ్యం కూడలిలో కనిపించిందా లేదా అన్నది ముఖ్యం)

సాయి కుమార్........రేయ్ రేయ్ రేయ్ రేయ్(కనిపించని నా నాలుగో మనసే ఈ బ్లాగ్)

ఆర్.నారాయణ మూర్తి ..ఒరేయ్ బ్లాగోడా(దమ్ముంటే టపాకి కామెంట్ రాయ్)

ఆలీ...............చేట చేట(యు నో బ్లాగ్ లాస్ట్.. కామెంట్ ఫస్ట్.. నో కూడలి... నో కాట్రవెల్లి)

బ్రహ్మానందం .........టిక్కుం టిక్కుం(అను ఓ తొక్కలో బ్లాగు)

ఎల్.బి.శ్రీరాం ........మరదే మండుద్ది(పుసుక్కుమని కామెంట్ రాసి పో)

తరుణ్.............మనసంతా బ్లాగే(ఎప్పుడూ బ్లాగే వయసే ఇది)

హరికృష్ణ ...........బ్లాగయ్య(ఎవ్వడి బ్లాగూ చూడడు)

అల్లరి నరేష్ .........బ్లాగు బాబు ఎల్.కే.జీ.(వీడి మొఖానికో బ్లాగు)రాజకీయ నాయకులు బ్లాగు పెడితే


వై.ఎస్. ............జగమంతా జగన్(అంతా కె.వి.పి. చూసుకుంటాడు)

చంద్ర బాబు...........ఆ విధంగా(బ్లాగు పిలవకున్నా కదలి రా)

ఎమ్మెస్సార్...........నిజం చెబుతా(చంద్ర బాబు చాలా మంచోడు)

కె.కె...............ఇట్స్ నాట్ ద పాయింట్(అగైన్ ఇట్స్ నాట్ ద పాయింట్)

కె.సి.ఆర్............ఖబడ్దార్(బ్లాగులోళ్ళు దొంగ నాయాళ్ళు).........................:0:................................

17 comments:

Giri said...

చాలా బావుంది. ప్రత్యేకించి నాగార్జునది :)

బందరుబ్లాగరుడు said...

సినిమా కాప్షన్స్ అదుర్స్.చాల బాగున్నాయి.

వీవెన్ said...

:-D అమ్మో, విహారీ! నవ్వలేక పోతున్నా!!

సిరి said...

విహారి గారు:

చాలా బాగున్నాయ్!

సిరి

Nagaraja said...

మోహన్ బాబు, మహేష్ బాబు & అల్లరి నరేష్... హహ్హహ్హా... సూపరు గురూ :-)

చదువరి said...

చాలా బాగా రాసారు. మీ స్ఫూర్తితో..
1. బ్లాగితే తాగగలను, బ్లాగనివ్వరు - తాగితేనే బ్లాగగలను, తాగనివ్వరు (పెద్ద నాగ్)

2. పాసువర్డులనడ్డుపెట్టి బ్లాగు వ్యాఖ్యను ఆపలేరు (తేలికపాటి ఎరుపు)

3. బ్లాగితే పోయేదేం లేదు, చేతి దురద తప్ప (ముదురెరుపు)

జ్యోతి said...

బ్లాగ్విధూషకా!!నీకు బ్లాగ్వందనం...


ఇలాగే మన బ్లాగల గురించి కూడా రాసేయ్..

Deepthi Mamiduru said...

this is super !! andari blogulu bavunayi....

Harinath Mallepally said...

బావుంది

క్రాంతి said...

చాలా బాగుందండి,ఆలీ బ్లాగు క్యాప్షన్ చాలా నవ్వుతెప్పించింది.

ప్రవీణ్ గార్లపాటి said...

హహహ...
మీరిప్పుడు కత్తి కటారీ కిసుక్విదూషక.

radhika said...

అదరగొట్టేసారు.నవ్వలేక చస్తున్నా.

రాజశేఖర్ said...

చాలా బావుంది విహారి గారు .. టిక్కుం టిక్కుం , బ్లాగయ్య సూపర్ :)

అనిల్ చీమలమఱ్ఱి said...

ఏమయ్యా విహారీ,

మేము పొట్టలు పగిలి చావాలని నీ కోరికనా?

అనిల్ చీమలమఱ్ఱి

కందర్ప కృష్ణ మోహన్ - said...

మొదటిసారి మీ బ్లాగు చూడగానే ఈ పోస్టు చూశాను - నవ్వలేక ఛస్తున్నానండీ బాబూ.............

ssv said...

రజనీ - బ్లాషా ( నేను ఒక్క బ్లాగు రాశానంటే (with sound effect) వంద బ్లాగులు రాసినట్టే.)

Madhu said...

Add telugu search power to your blog:

Details Visit:

http://gultus.blogspot.com/