Wednesday, August 22, 2007

పిల్లల మనసు

:


పిల్లలుంటే సమయమెలా గడిచి పోతుందో తెలీదు. చూస్తూ వుండగానే పాకే పిల్లవాడు పరుగులు పెట్టడం మొదలుపెడతాడు. అలా స్కూలుకు వెళ్ళే సమయం కూడా వచ్చేస్తుంది. అలాంటి పాల బుగ్గల పసివాడు రోజంతా స్కూలుకు వెళ్తే అంతవరకు ఇల్లంతా సందడి చూసిన తల్లి దండ్రులకు ఎంతో వెలితి అనిపిస్తుంది. కొడుకు మొదటి తరగతి కి మొదటి రోజు వెళుతున్నాడు. అమ్మకేమో రోజంతా స్కూల్లోనే వుంటాడు ఏమి తింటాడో ఏమో అని ఒక పక్క వీడు ఇంట్లో లేడని దిగులు ఇంకో పక్క.

అమ్మ: నాన్నా! ఈ రోజునుండి నువ్వు రోజంతా స్కూల్లో వుంటావు. ఐ యాం గోఇంగ్ టు మిస్ యు.
కొడుకు: అమ్మా! ఐ యాం నాట్ గోఇంగ్ టు మిస్ యు. ఎందుకో తెలుసా? నువ్వూ, నాన్నా, తమ్ముడూ ఆర్ ఇన్ మై హెడ్ ఆల్వేస్. సో, ఐ విల్ నాట్ మిస్ యు.

అది విన్న అమ్మ కొడుకును గుండెలకు హత్తుకుందని వేరే చెప్పాలా?


:

11 comments:

lalitha said...

wow!

కొత్త పాళీ said...

ఏందన్నా, కితకితలు పెట్టి నవ్వించాల్సిన నువ్వుగూడ ఇట్టా కళ్ళు చెమ్మగిల్ల జేస్తాంటె మేమేంగావాల?

ప్రసాద్ said...

కొత్తపాళీ గారు చెప్పినట్లు మేమేం గావాల?

--ప్రసాద్
http://blog.charasala.com

రవి వైజాసత్య said...

హాస్యరసాన్ని పండించడమే కాదు కరుణారసాన్నీ పిండగలన్నేను అని మన విహారీ అన్నయ్య కదం తొక్కాడు మరి!

radhika said...

kadilimceasaaru sir

చదువరి said...

బాగుంది, జాబు!
దారి మార్చినా గమ్యమదే -రంజింపజెయ్యడం.

teluguabhimani said...

బాగుంది అన్నియ్యా!

Venu said...

తెలుగు సినిమా డైలాగ్ కంటే చండాలంగా ఉన్నాయి అటూ ఇటూ కాని ఏంగిలిపీసు డైలాగులు.అలాగే కామెంట్లూనూ సినీ హీరో అభిమాన సంఘాల్లాగా. sorry boss diid not like it a wee bit. modati taragati ki modatisaari heavy dialogues Huh!

Anonymous said...

లలిత గారు,

అవును wow యే :-)

కొత్తపాళి/ప్రసాద్ గారు,

అప్పుడప్పుడూ కరుణ రసం కూడా వుండాలి మరి.

రవి/రాధిక/చదువరి/తెలుగు అభిమాని గార్లూ,

ఏమిటో ఏమి చెప్పాలో తెలియడం లేదు. థ్యాంక్స్.

అయ్యా వేణూ గారూ,

మీరు తెలుగు సినిమాలు ఎక్కువ చూస్తున్నట్టునారు. కాస్త ఆ ప్రభావంలో నుండి బయట పడాలి. నేను ఇక్కడ చెప్పింది కల్పించి రాసింది కాదు. మా ఇంట్లో మా అబ్బాయి స్కూలుకు వెళ్ళే మొదటి రోజు జరిగిన సంభాషణ. అమెరికా లో పెరుగుతున్నవాడు ఇంగిలి పీసు తెలుగు రెండూ కలిపే మాట్లాడుతాడు. పిల్లల మీద అభిమాన మున్న వాళ్ళ కెవరికైన ఆ ముద్దు మాటలు కళ్ళు చెమ్మగిల్ల చేస్తాయి. బహుశా మీరు బ్లాగులకు కొత్త కావచ్చు. వీలయితే ఇక్కడున్న టపాలు కొన్ని చదివండి. కొన్నాళ్ళయిన తరువాత అన్నీ సర్దుకుంటాయి.

మీరు నిర్మొహమాటంగా రాసిన కామెంటుకు ధన్యవాదాలు.

-- విహారి

Nagaraja said...

ముచ్చటగా ఉంది. వీళ్ళ తరం రేపు అమెరికాను మొత్తం రూలినా ఆశ్చర్యం లేదు...

Anonymous said...

@ నాగరాజు గారు,

ఏమో చెప్పలేం. ఈ తరం కాకుండ ఇంకో తరం వస్తే తప్పకుండా సాధ్యమే.

-- విహారి