మనవాడు VS పరాయి వాడు
:
మన వాడు : భోజన ప్రియుడు
పరాయి వాడు : తిండి పోతు.
మ.వా. : మాట కారి
ప.వా. : వదురు పోతు
మ.వా. : కార్య సాధకుడు
ప.వా. : కుటిలుడు
మ.వా. : సౌమ్యుడు
ప.వా. : చాత కాని వాడు
మ.వా. : మొండి ఘటం
ప.వా. : మెంటల్ ఫెలో
మ.వా. : మంచి సంపాదనా పరుడు
ప.వా. : లంచగొండి
మ.వా. : జాగ్రత్తపరుడు
ప.వా. : లోభి
మ.వా. : హేతువాది
ప.వా. : వితండవాది
మ.వా. : హనుమంతుడంతటి వాడు
ప.వా. : భజన పరుడు
మ.వా. : పట్టువదలని విక్రమార్కుడు
ప.వా. : జిడ్డు గాడు
మ.వా. : బ్లాగ్ భీష్ముడు
ప.వా. : బ్లాగ్ జలగ
కొత్తగా చేర్చ బడినవి
మ.వా. : వై.యెస్.
ప.వా. : చంద్ర బాబు
మ.వా. : కడపలో ప్రాజెక్టులు చేపట్టిన వాడు
ప.వా. : నాన్-కడపలో ప్రాజెక్టులు చేపట్టిన వాడు
:
9 comments:
మన వాడు = విహారి
పరాయి వాడు = గొల్టి
మ.వా. : సౌమ్యుడు
ప.వా. : చాత కాని వాడు
ఇది రివర్సులో ఉండాలేమో!?
చాలా నవ్వొచ్చింది. మీ హాస్యచతురతకు నా జోహార్లు. ఇంతకుముందు కూడా మీ రచనలు కొన్ని చదివాను. ముఖ్యంగా సీను గాడి ఇండియా ప్రయాణం చాలా బావుంది. కానీ నేను చదివింది పార్టు-3. దానికి ముందు భాగాలు ఎక్కడున్నాయో కనిపించలేదు నాకు.
చాలా బావుందండి... మొన్నీమధ్య ఒక కధ చదివాను.. దాంట్లో కూడా ఇదే.. ఐతే కధ కాస్త సీరియస్ గా సాగింది.. మీది చదువుతుంటే నవ్వొస్తోంది..
నెట్టిజెన్ గారు,
ధన్యవాదాలు.
"గొల్టి" ఇది తెలుగు వాళ్ళను హేళన చేసే పదమే కదా? ఈ పదమంటే నాకు కంపరం. అమెరికా వచ్చిన కొత్తలో బెంచ్ మీద వుండి కబుర్లాడుకుంటుంటే ఒక బీహారోడు తెలుగు వాడు అని చెప్పడానికి ఈ పదం ఉపయోగించాడు. అంతే వాడి చొక్క పట్టుకుని .... అందరూ ఆపబట్టి సరిపోయింది లేకపోతే రణ రంగమయ్యేది. ఆ తరువాత వాడూ సారీ చెప్పి మంచి మిత్రుడయ్యాడు.
రానారె,
ఇది కరక్టుగానే వుందనుకుంటున్నాను.
వసుంధర గారు,
ధన్యోస్మి.
"వర్గాలు" కింద అన్ని భాగాలు వుంటాయి. అలాగే ప్రతి పార్టు మొదలు పెట్టేముందు కిందటి భాగం లింకు ఒక పదం ద్వారా ఇవ్వబడింది. అది చూడండి.
మేధ గారు,
బావుందన్నందుకు ధన్యవాదాలు.
-- విహారి
హిందీ వ్యతిరేకోద్యమంలో హిందివాల్ళ్ళని కొట్టారు.
యం జీ ఆర్ విషయంలో మలయాళియుల్ని కొట్టారు.
నీళ్ళు ఇవ్వటం లేదని కన్నడిగులని కొట్టారు.
తెలుగువాడి డబ్బుతో పెరిగిన చెన్నఐట్స్ తెలుగువాడిని "గొల్టి" అని పిలవడంతో అగారా?
wonder,is that so?
baagu baagu
hi,
i am subose santh.
nanu mee joke chadivanu yes,ur correct.yedutivani gurinchi cheppetapudu chala theda vuntundi.and i read comments on ur joke but i dont know how to type in TULUGU.and i am new to this blog.
సుబోస్ గారు,
మీరు ఈ లంకె కు వెళ్ళండి. సమాచారం మొత్తం దొరుకుతుంది.
-- విహారి
Post a Comment