Friday, August 17, 2007

ఈ రోజు ఓ ఆంధ్ర రాజీవ జీవి దిన చర్య

:


పొద్దున్నే లేచి రాజీవ ఫోటో దర్శనం చేసుకొనెను. తరువాత రాజీవ బ్రుష్షు మీద రాజీవ పేస్టు పెట్టి బ్రష్షు చేసుకొనెను. రాజీవ సోపు వాడి స్నానము చేసెను. తర్వాత రాజీవ కంప్యూటరును తెరచి రాజీవ బ్రాడ్ బ్యాండు ద్వారా అంతర్జాలమునకు అనుసంధానమయ్యెను. ‘ఇంటి పుట’ అయిన రాజీవ కూడలిని తెరిచెను. ప్రతి బ్లాగులోనూ రాజీవ నామామృతము కనిపించెను. అన్ని బ్లాగులను రాజీవ చెక్కతో చేసిన చిడతలతో రాజీవ భజన చేసెను. నచ్చిన వాటిలో రాజీవ తారక మంత్ర తీర్థం తాగెను. కొన్నింటిలో రాజీవ వ్యాఖ్యలను రాజీవ హుండీలో వేసెను. తరువాత రాజీవ తేనెగూడుకు వెళ్ళెను. అది అంతర్జాల ప్రవాహంలో కనిపించక రాజీవ తెలుగుబ్లాగర్స్ వెళ్ళెను. అక్కడ కూడా ఎన్నో రాజీవ జపములు కనిపించెను. వారితోటి రాజీవ జపము చేసెను. ఇంకనూ రాజీవ మనసు సంతసింపక రాజీవ జల్లెడకు వెళ్ళెను. అక్కడ జల్లించిన రాజీవ విబూది పెట్టుకొని వచ్చెను. తను కూడా రాజీవ చరితం రాయవలెనని రాజీవ లేఖినికి వెళ్ళి రాజీవాక్షరాలతో రాజీవ టపా రాసెను. అది ఇలా తయారయ్యెను. అప్పుడు రాజీవ కుతి తీరెను. తరువాత వెళ్ళి బజ్జుండెను.

మీరు కూడా రాజీవ తపము ఆచరించినచో రాజీవ స్వర్గమునకు రాజీవ మార్గమున రాజీవ విమానమెక్కి వెళ్ళెడి యోగము కలుగును.



:

17 comments:

కొత్త పాళీ said...

man, you're the king of Telugu blog comedy! As soon as I caught the first line in koodali, I burst out laughing .. am still laughing ...

కొత్త పాళీ said...

తరవాత రాజీవ తల్పము పైన రాజీవ దిండు వేసుకుని రాజీవ దుప్పటి కప్పుకుని రాజీవ కలలు కనుచూ బజ్జుండెను.

జ్యోతి said...

జై రాజీవ జై జై రాజీవ......


నిదురపో రాజీవ నిదురపో...........

Anonymous said...

మనసులోనే కాక పైకి చదివి మరీ ఆనందించాను. ఎత్తి చూపేటప్పుడు చురుక్కులే కాదు చమక్కులు కూడా ఉండాలని మాబోటివాళ్ళకు అర్థమయ్యేలా రాశారు. చాలా ఉంది మీలో...

రానారె said...

అయ్యబాబోయ్!! హ99!!

రానారె said...

కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డును రాజీవ్ ... చేస్తున్నారంటకదా!
రాజశేఖరరెడ్డికి తత్‌క్షణమే రాజీవస్వర్గము సంప్రాప్తించుగాక!

Unknown said...

ha haa..
Nice comedy.

Unknown said...

అటుచూస్తే ఇందిరా బహిర్భుమి
ఆటుచూస్తే రాజీవ్ మూత్రశాల
ముందుచూస్తే సొనియా సారా అంగడి
ఎటుచూసినా జగన్ పరిశ్రమలు
-నేనుసైతం

Naga Pochiraju said...

కొన్నాళకి "జీవి/ప్రాణి" అన్న పదనికి ప్రతి పథార్ధం గా "రాజీవ్/ఇందిర" అని మారిపోతుందేమో!!

వచ్చే ఏడు ఉత్తమ చిత్రాలు గా నందీ పురస్కారం అందుకున్నవి గా "రాజీవదాసు,రాజీవ దొంగ,రాజీవ గారి అల్లుడు" గా పత్రికలలో రాకపోతే మా రాజీవుడి మీద ఒట్టు

ఉత్తమ గేయలుగా "అంతా రాజీవ మయం,మా రాష్త్రం అంతా రాజీవమయం...."

"నను బ్రొవమని చెప్పవే రాజీవమ్మ తల్లి.."

రానారె said...

మహానుభావా! అందుబాటులో ఉన్న తెలుగువారికీ ఇతర భారతీయ మిత్రులకూ చెప్పిచెప్పి మళ్లీమళ్లీ నవ్వుకుంటున్నాను. రాజీవచెక్కతో చేసిన చిడతలు ... ఇది పరాకాష్ట. హ33.

విహారి(KBL) said...

ఈ రోజు పేపర్ లొ చుసా.
తెలుగు దేశం వారి కామెంట్లు .
బెల్ట్ షాపులకి సొనియాసుజలధార అని పేరు పెడితే బాగుంటుందని.మీ పొస్ట్ చదివాక అది గుర్తుకువచ్చింది.నవ్వలేక చచ్చా.

Anonymous said...

@ కొత్తపాళీ గారూ,

నేను కింగయితే మరి ఎంపరర్ ఎవరు? :-) ఇలాగుంటాయి నన్నెవరన్నా మెచ్చుకుంటే. కాలేజీలో వున్నపుడు ఫ్రెండ్స్ పొరపాటున “ఈ రోజు నువ్వు స్మార్టు గా వున్నావురా” అంటే “నిన్నెందుకు స్మార్టుగా లేనో చెప్పు” అని పీక్కు తినే వాడిని.

మీ ప్రశంశలకు ధన్యుడను.

@ జ్యోతక్కో,

ఒక ప్లే కార్డు పెట్టుకుంటే సరి.

@ తా.బా.సు. గారు,

మీకు అర్థమయ్యేలా రాశే సీను నాకు లేదండి. ఏదో అలా నెట్టుకొచ్చేస్తున్నాను. మీ వ్యాఖ్యలు చూస్తే తెగ ముచ్చటేస్తోంది.

@ రానారె,

ఏమయ్యా ఆ పులకరింపు. అంత సంతస మాయెనా? మూడు అంకెలు దాటినచో (హ 100) మీరు వినోదపు పన్ను కట్టవలయును.

@ సుధాకర్ గారు,

ధన్యవాదాలు.

@ నేను సైతం గారు,

ప్రియాంకా లడ్డూ కౌంటరు మరచితిరా?

@ లలిత గారు,

మీరు ఈ ఏటి మేటి ఉత్తమ అవార్డుల కమిటీ ప్రెసిడెంటు గా ఎన్నికవుదురు గాక.

@ విహారి (KBL) గారు,

ఇందాకే చూశా మీ ప్రత్యేక గుర్తింపు ట్యాగ్. సుధాకర్ కూడా బ్రాకెట్లో శోధన అని వేసుకొంటున్నారు. మీరు బ్రాకెట్లో కొత్త బంగారు లోకం విహారి అని చెప్పడానికి KBL అని వేసుకుంటే KBC(కౌన్ బనేగా కరోడ్‌పతి) లాగా చక్కగా గుర్తుండి పోతుంది. మీ బ్లాగులో టపాలు యమా నయనాందకరముగా వుటున్నవి.


-- విహారి

pi said...

ROFL!!!

Chaala funny gaa undi. BTW meeru intha accha telgu vaadutunnanduku naaku royalty ivvali.

Anonymous said...

pi గారు,

అట్టాగేనండి. మీ బ్యాంకు అకౌంటు నంబరూ, రౌటింగు నంబరూ చెబితే డబ్బులు పంపించేస్తా.

-- విహారి

Unknown said...

rajiv japam baga chesaru
rama japam cheste swarganiki
vellochhu
rajiv japam cheste yekkadiki
velataro adi kuda cheppandi
navvaleka chachham

Anonymous said...

రాజీవ్
.
.
.
రాజీవ్
.
.
.
కోన్నాళ్ళు రాజీ పడక తప్పదు...

Rajiv Puttagunta said...

Ayya Vihaari garu, Meeku "Rajiv" a peru meedha intha durabhimanamunnadanina, leka nenu ee tapaa mundhey chadivi yundina...mee vaddaku aa perutho vachiyundedhanu kaanu.

RaNaRe gaaru yedho vyakhyanamlo annattu...meeru nijamgaa kaala brahmenemo ani agupinchuchunnadhi.

Leni yedala eee blogula darsanaardham oka raajeevi vacchunu..ani mundhey yetula raayabadinadhi??

Idhi yaadrucchikamaa...Vihaari Maaya!!!!