Tuesday, October 09, 2007

100 వ టపా -- బ్లాగోళ జంభ

.

1 శతకం
4 ఋతువులు
5 శతకాల వ్యాఖ్యానాలు
10 సహస్రాల యునీక్ హిట్లు
19 సహస్రాల హిట్లు
30 చందా దారులు

ఈ సందర్భంగా ఒక మిమిక్రీ వీడియో












రేపే విడుదల : సింహావలోకనం

25 comments:

వెంకట రమణ said...

మీ మిమిక్రీ బాగుంది. రాజశేఖర రెడ్డి, ఎల్బీ శ్రీరాంల గొంతులను బాగా అనుకరించారు. చంద్రబాబు గొంతునే మరీ సాగదీశారు, అంతగా కుదిరినట్టనిపించలేదు.

ఏది ఏమైన తెలుగులో మొట్టమొదటి వీడియో బ్లాగు, అది కూడా బహుపాత్రాభినయంతో చేసినందుకు అభినందనలు.

విశ్వనాధ్ said...

బుళక్ బుళక్... క్లొంచెం వ్లాంతి వచ్చేల్టే లుంది.
--
హు!హు!
గిదేందన్నోయ్ గిస్మంట్ టపా ఇడిచినవ్
రాతల్తో చంపనీకి నీకు బ్లాగ్లోళ్ళే దొరికిన్ర అన్న
యాడికెళ్ళి దొరకబుచ్చుకున్నవే గిసంటి తరీక

oremuna said...

ఈ పైన వ్రాసినదంతా చదివినాను, తరువాత ఏమీ అర్థం కాలేదు, నా కంప్యూటరు మూగది, దానికి మాట్లాడం రాదు, చెవిటిది కూడా, మనం ఏంమీ చెప్పలేము, ఏదో కొద్దిగా నాలుగు అక్షరమ్ ముక్కలు నేర్పబట్టి కీబోర్డు ఉపఓగించి, మానిటరు ఉపయోగించి మేము మాట్లాడుకుంటాము.

VJ said...

గుల గులా!!గుల గులా.
మీ జంభ బ్లాగు, బాగు బాగు.

జ్యోతి said...

ఈ టపాలో రాసిన ఒక్కముక్క అర్ధమైతే నా వెయ్యి టపాల మీద ఒట్టు.


నమస్తె విహారన్నయ్యా. బాగున్నావా..

రానారె said...

దుస్తులు, మేకప్ విషయాల్లోనే మీకు చాలా మార్కులు వేసేస్తున్నాను. తరువాత, ఆ ఆత్మ పాత్రను తెరమీదకు తేవాలన్న ఆలోచన. చాలా కష్టపడాలి. చాలా ధైర్యం కావాలి. స్క్రిప్టు చాలా బాగుంది. అందరూ అంటున్నట్లుగా సంభాషణలను పలికేటప్పుడు కాస్త సాగదీశారు. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, సంభాషణలు, నిర్మాణపు ఖర్చులు, చివరికి లైట్ బోయ్, పబ్లిసిటీగంగాధర్ అన్నీ మీరే కావడం వల్ల ఆ మాత్రం లోపం జరగడం మొదటిప్రయత్నంలో చాలా మామూలే. ఇరగదీయాలనే మీరు మొదలుపెట్టి ఉంటారు. కోతిపిల్ల కాలేదు గానీ, అయ్యవారిని చెయ్యాలనే మీ శ్రమమాత్రం కొట్టవచ్చినట్లుగా కనబడుతుంది ఏమాత్రం గమనించినా. ఇన్‌న్‌దిరమ్‌మ్మబొమ్మగానీ... అని చాలా కన్విన్సింగా పలికారు ఒకచోట. అక్కడ నాకు నవ్వు బయటికొచ్చింది. మొత్తానికి మీకు హేట్సాఫ్. నిజ్జంగా మీరు హైలీ ఎనర్జిటిక్.

ఇలాంటి ప్రయత్నం ఏనాడూ చేయనివారినుంచీ వచ్చే బాగలేదు, ఛీ, అబ్యాక్ లాంటి పైపై మాటలు మిమ్మల్ని బాధించవని నాకనిపిస్తోంది. మీరు పనిచేసే ఏ రంగంలోనైనా సరే లీడరయ్యే లక్షణాలు మీకు పుష్కలంగా ఉన్నాయి. తథాస్తు.

వికటకవి said...

@విహారి,

మీ 100వ టపాకు శుభాభినందనలు. నూరోది ప్రత్యేకంగా ఉండాలి అన్న ప్రయత్నం విజయమైనట్లే. కాకపోతే, విజయం ఏ స్థాయిలో అంటే, కచ్చితంగా పాసు మార్కులే. కానీ, మొదటి ప్రయత్నంలో అది విజయంతో సమానమే. పాసు మార్కులని చెప్పా కాబట్టి, విషయ విశ్లేషణ చేయదలచుకోలేదు.

http://sreenyvas.wordpress.com

Unknown said...

విహారి గారు,
ముందుగా మీకు అభినందనలు.మీ ప్రయత్నం వెరైటీ గా ఉంది.మీ జైత్రయాత్ర కొనసాగించండి.

"సూపరు, ఇరగ దీశారు, అదిరింది, చింపేశారు, మార్వలెస్, అద్భుతం " :)

-నేనుసైతం
http://nenusaitham.wordpress.com

Unknown said...
This comment has been removed by the author.
Winner said...

అయ్యా, అభినయ విహారి! ఈ ప్రయత్నం అదిరింది. అర్థశతటపోత్సవ అభినయాపు ఆలోచనకు, మీ అబినయానికి అభినందనలు

ప్రసాదం

Unknown said...

వంద టపాలు పూర్తి చేసుకున్నందుకు అభినందనలు.
వీడియో బ్లాగు ప్రయత్నం బాగుంది.

జ్యోతి said...

సూపర్ విహారి...అదరింది నీ అభినయనం

జ్యోతి said...

సూపర్ విహారి...అదరింది నీ అభినయనం

కొత్త పాళీ said...

ఆంగికం అదిరింది.
పూర్తిగా చూడ్డానికి కొంచెం ఓపిక, బోలెడు టైమూ కావాలి. :-)

Short and sweet niext time, okay?

Unknown said...

హై హై నాయకా..తొలి తొలుగు వీడియో బ్లాగు టపా అందించినందుకు నెనర్లు. మీ ప్రయత్నం చాలా బాగుంది

చదువరి said...

ముందు రాసిన టెక్స్టు చూసాను. తీరుబడిగా మళ్ళీ చదువుదామని అనుకుని మళ్ళీ ఇప్పుడు చూస్తే - అది తీసేసారు! వీడియో బ్లాగు ప్రయోగం బాగుంది.

cbrao said...

ఏకవీర విహారీ! సరిలేరు, నీకెవ్వరూ. ఇరగదీసావ్.అభినందనలు.మీ ప్రోగ్రెస్స్ రెపోర్ట్ అందుకోండి.
రాజశేఖర్ గా 9/10 మార్కులు
ఎల్.బి.శ్రీరాం గా 6/10
చంద్రబాబుగా 3/10

ఆహార్యం 7/10
Stage lighting 4.5/10 చాలా సన్నివేశాలలొ, shadows, performance effective value ను తగ్గించాయి.

ఎల్.బి.శ్రీరాం డైలాగ్ డెలివరి లో స్పష్టత లోపించింది. స్టైల్ కుదిరింది.
చంద్ర బాబు వీడియోలు మీరు కొన్ని చూడాలి.

తొలి తెలుగు వీడియో బ్లాగూగా దీనిని గుర్తిస్తున్నాము. తెలుగుబ్లాగు రికార్డ్స్ సంఘం నుంచి మీకు,యోగ్యతా పత్రము కావలెననిచో, $1000/- దరఖాస్తు రుసుముతో apply చెయ్యగలరు.మీ దేశానికొచ్చి, మీ ఊరికొచ్చి, మీ ఇంటికొచ్చి ఆ యోగ్యతా పత్రాన్ని, మా అధికారులు మీకు అందజేయగలరు.

cbrao
అధ్యక్షుడు, తెలుగు బ్లాగు రికార్డ్స్ సంఘం

కొత్త పాళీ said...

విడియో ఇప్పుడే పూర్తిగా చూశాను. కామెంట్లూ విమర్శలదేముందీ .. ఎన్నైనా రాయొచ్చు, కానీ ఏదైనా కొత్తగా చెయ్యటం కష్టం. వినూత్నమైన ప్రయత్నం, మొదటి అడుగే కాకుండా ప్రశసనీయమైన ప్రయత్నం. అభినందనలు.

సిరిసిరిమువ్వ said...

అభినందనలు. సరికొత్త ప్రయోగం. YSR ది బాగా కుదిరింది.

lalithag said...

విహారీ,
బ్లాగరులలో మీకు మీరే సాటి.
ఇటువంటి ఆలోచనే సాహసం. దాన్ని విజయవంతంగా
చేసి ప్రదర్శించడం అభినందనీయం.

Niranjan Pulipati said...

సూపర్ విహారి.. చాలా వైవిధ్యమైన ప్రయత్నం.. హ్యాట్స్ ఆఫ్ :)

రాధిక said...

ఇదెప్పుడు చేసారు.నేను మిస్ అయిపోయాను.బాగుంది.మంచి ప్రయత్నం.చిన్నగా తయారు చేసుంటే మరింత బాగుండేది.

Dr.Pen said...

సెంచరీ ఇరగదీసావు విహారీ! కాస్త నిడివి తక్కువుంటే ఇంకా బాగా పండేది. ఎప్పుడూ నీ బుర్రలోని బల్బులను అందరూ కొట్టేస్తున్నారని బాధపడుతుంటావుగా, ఈ సారి నా అవిడియాని బాగా తస్కరించేవు:) ఇక 102 టపా అదుర్స్! మరోసారి విశ్వరూపం చూపించావు.

Anonymous said...

@ వెంకట రమణ గారు,

నెనర్లు.నిజం చెప్పారు.

@ విశ్వనాథ్ గారు,

దానికి కొంచెం రంగులేసి మరో సారి రిలీజ్ చేస్తా. అప్పుడు కూడా వాంతి వస్తుందేమో చెప్పండి.

@ చావా గారు,

అంత అర్థం కాకుండా రాశానా? మరో సారి చదువుండాల్సింది. మీ కంప్యూటరుకు నోరు ఇవ్వమంటారా?

@ షర్మ గారు,

నెనర్లు.

@జ్యోతక్కోయ్,

నీకు స్పీడెక్కువయినట్లుంది. అందుకే స్లో అయినప్పుడు నచ్చింది. అయినా నెనర్లు.


@ రానారె,

మంచి రివ్యూ ఇచ్చారు. మీ అభినందనలకు నా నెనర్లు.
మీ వ్యాఖ్య కూడా నాకు నవ్వు తెప్పించింది.

@ వికటకవి గారు,

ధన్యోస్మి.

@ నేను సైతం గారు,

ఏదొద్దో అదే చెప్పారన్నమాట :-) అదీ చతురత అంటే. నెనర్లు.

@ ప్రసాదం, తెలుగు వీర, చదువరి, లలిత, నిరంజన్, సిరిసిరిమువ్వ గార్లూ

నెనర్లు.

@ కొత్తపాళీ, రాధిక గార్లూ,

నిజమే. కొంచెం ఎక్కువయింది. ఎక్కడ కత్తెరెయ్యాలో తెలీక బ్లాగర్ల కుత్తుకల మీద పెట్టా :-)

నెనర్లు.

@ రావ్ గారు,

రానారె లాగ మంచి విశ్లేషణ చేశారు. నిజమే బాబు వై.ఎస్. కన్నా తక్కువ టి.వి.లో కనిపిస్తాడు కదా అందుకని మేనరిజం దెబ్బ తినింది. బాబు మిమిక్రీ మొదట్లొనే తన్నిందని అర్థమైంది కానీ ఆ కాబినేషన్ కోసం వుంచక తప్పింది కాదు.

మీ సర్టిఫికేట్ తప్పకుండా తీసుకుంటాను. కాకపొతే పేపర్ ఓ రెండువందల ఏళ్ళ దయితేనే. :-)

@ ఇస్మాయిల్ గారు,

నా బల్బులు ఏవరన్నా కొట్టేసినా రైల్లోని బల్బుల్లా ఇంకెక్కడా పని చెయ్యవ్ :-)

నెనర్లు.

-- విహారి

netizen నెటిజన్ said...

మొట్టమొదటి తెలుగు విడియో బ్లాగ్ ప్రచురణకర్తలు మీరు. తెలుగుబ్లాగ్‌ప్రపచంలో మీకు ఒక ప్రత్యేకమైన స్థానమ్ సమ్‌పాదిమ్‌చుుకున్నారు!
అభినందనలు!!