Tuesday, March 04, 2008

ఈ వారం సిధ్ద -- బుద్ధ (అంబర బడ్జెట్, తుపాకీ రాముడు)




"అయ్యగారూ మన తోటలో హర్భజన్ సింగులెక్కువయి పోయారు"

"ఆ ఉపమానాలేంటి నువ్వేమన్నా హేడెన్ అనుకుంటున్నావా? హేడెన్ కేదో కొవ్వెక్కి హర్భజన్ ను కలుపు మొక్కంటే నువ్వు కలుపు మొక్కల్ని హర్భజన్ అంటావా? ఆ మొక్కలు పీకేసి ఆవులకు ఆహారంగా వెయ్యి మంచి పాలిస్తాయి. ఈ మధ్య ఏ పెద్ద హీరో సినిమా రిలీజు కాక పాలాభిషేకాలు ఆగిపోయాయి. ఏదో ఉండవల్లి పుణ్యమా అని ఆవు పాలకు మంచి డిమాండ్ వుంది ఈ సీజన్లో. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. అప్పుడెప్పుడో లాలూ ప్రసాద్ రైళ్ళలో పెప్సీకి బదులు మజ్జిగ అమ్మిపెడతా అని తరువాత ఆ ఊసే ఎత్తలా."

"పెప్సీ ఆపించకపోయినా పెళ్ళి కాని ఆడపిల్లలకు రైల్లో ఫ్రీ టికెట్ ఇప్పిస్తున్నాడు కదా."

"దాని కిందే నీకు కొన్ని జిమ్మికులు కనిపించడం లేదు. మామూలు రైళ్ళని ఎక్స్ ప్రెస్ రైళ్ళు అని చెప్పి ఎక్స్ట్రా డబ్బు వసూలు చేస్తున్నాడు గదా.నువ్వు సిగరెట్లు తాగుతావా"

"లేదు"

"అయితే నీకొచ్చిన నష్టమేమీ లేదు."

"నాలాంటోళ్ళకు డబ్బేమన్న తిరిగొస్తుందా?"

"నువ్వేమన్నా అమెరికాలో పుట్టావా? అమెరికాలో $150K వరకు సంపాదించేవాళ్ళకు బుష్షు $1200.00 చెక్కిస్తున్నాడు. మన చిదంబరమేమో RS150K వరకు టాక్సు మినహాయింపు ఇచ్చాడు. "

"మనమేం ఆర్థిక మాంద్యం లో లేం.అయినా మన అభివృద్ధి శాతం 9.5 కదా "

"అది అప్పుడు. ఇప్పుడు 8.7 శాతం "

"వ్యయసాయం లో 3.5 వృద్ధి వుంది కదా?"

"ఇప్పుడు 2.6 మాత్రమే అందుకే కాబోలు రైతుల కోసం 60,000 కొట్ల రూపాయల మాఫీ చేశారు."

"అది కూడా మా తుపాకీ రాముడు జైపూర్ లో రైతు గర్జన చెయ్యబట్టి"

"రైతు గర్జన జైపూర్లోనా విజయవాడలోనా?"

"జైపూర్లోనే?"

"మీ తుపాకీ రాముడెవడ్రోయ్? ఇదేదో కొత్త పేరు లాగుందే "

"అది పొన్నాల లక్ష్మయ్య పెట్టిన పేరు."

"ఎందుకు?"

"రైతులను కాల్చుకు తిన్నాడని పెట్టిన పేరు. "

"ఎవరికి?"

"చంద్ర బాబు కు"

::::::::

"మనకు బడ్జెట్ లో తుపాకులు ఫ్రీ గా గానీ సప్ప్లై చేసేస్తున్నారా?"

"అలాంటిది నేనెక్కడా చదవ లేదే. అప్పుడో సారి పవన్ కళ్యాన్ చేతిలో, ఇంకోసారి ప్రశాంత్ రెడ్డి చనిపోయినప్పుడు తుపాకుల గురించి విన్నాను తప్ప ఇంకెక్కడా చూడ లేదు."

"గోనె ప్రకాశ రావ్ తనకేదన్న జరిగితే వెళ్ళి మధు యాష్కీ బుర్రకాయ్ ని డాం ...డాం అని పేల్చేస్తానన్నాడు కదా."

"ఎవరు ఎవరి బుర్రకాయలు పేల్చినా ఏం జరగదు. కాల్చిన తరువాత సరదాగా పోలీస్ స్టేషన్ కు వెళ్ళి బిర్యాని తినేసి వచ్చి ఇంట్లో వున్న కుక్కలకు బిస్కట్లు తినిపించుకుంటూ కాలం గడపోచ్చు.తరువాత అది ఆత్మహత్య అని చెప్పేస్తారు. ఆ చచ్చినోడికి చేతులు లేకపోయినా గొళ్ళేనికి తుపాకీ ఆనించి గొడుగు తో ట్రిగ్గర్ నొక్కాడని నొక్కి వక్కాణించేస్తారు."

"అంతేనా శిక్షలు గట్రాలు వుండవా?"

"వుంటాయి అలా ఆత్మహత్య చేసుకున్న వాళ్ళను దేవుడు శిక్షిస్తాడట."

"ఈ శిక్షలు గట్రాలు మనకొద్దు గానీ ఏవన్నా సరదా బ్లాగుంటేచెప్పండి"

"ఇదిగో ఈ మధ్య వచ్చిన ఈ పావని గారి బ్లాగు చూడు"


:::::::

3 comments:

krishna rao jallipalli said...

చాలా చాలా బాగుంది.
-కలుపు మొక్క అని వాగిన కంగారూ లంజ కొడుకులకి బాగా దిగింది నిషా ఈ రోజు.
-లాలూ గాడి బాషలో ఇండియా అని అంటే బిహార్ అనే అర్థం. కొడుక్కి వేరే రాష్ట్రాలు పేర్లు కూడా తెలియవు.
-ఉండవల్లిని ఎప్పుడూ పుణ్యం కట్టుకోమని పాల సంఘాలు వారు కోరుకుంటున్నారు. గిట్టుబాటు ధర వస్తుందని ఆశతో.
-రేట్ పెంచింది NON-FILTER సిగరెట్ కి. కాని దొంగ నా కొడుకులు అన్నింటికీ పెంచేశారు.
-కాకుల లెక్కల BUDGET - కొజ్జ వాడు ఊళ్ళో ఉంటేనేమి? కోటలో ఉంటేనేమి? ఎవరి ప్రతివత్యం కి భంగం వాటిల్లదు.
-బాల కృష్ణ చేతిలో తుపాకి మర్చి పోయారా?? అదే మీ/మా ఇంట్లోనో దీపావళి టపా కాయలు పెలినా ఆ వీధిలోని అందర్నీ తీసుకెళ్ళి బొక్కలో వేసి ఇరగ దీసే వారు మరి.
-అదిరింది అమ్మా పావనమ్మా ...

phani said...

సాధారణ సినిమా మసాల క్లెయిమాక్స్ తో హిట్ అయినట్లు మీ ఈవారం బ్లాగు క్రిష్ గారి వ్యాఖ్యానం తో ఘాటెక్కింది.

seenu said...

హ్యాట్సాఫ్ టు క్రిష్