Friday, March 28, 2008

అమెరికాలో సైకిలునేమంటారంటే .......:::::::::

నాగరాజు గారి సైకిలోపాఖ్యానం చదివిన తరువాత ఇది రాయక తప్పింది కాదు.మా సిలికానాంధ్ర మనబడి గడుగ్గాయి రాసిన సమాధానం గుర్తుకు వచ్చింది. అమెరికాలో పిల్లలకు తెలుగు నేర్పడానికి సిలికానాంధ్ర వారు పలు రాష్ట్రాల్లో మనబడి అనే కార్యక్రమం ద్వారా పిల్లలకు తెలుగు నేర్పుతున్నారు.ఇప్పటికి అందులో రెండు త్రైమాసికాలు పూర్తయ్యాయి.ఇంకో త్రైమాసికం పూర్తయితే "ప్రవేశము" తరగతి పూర్తవుతుంది.ప్రతి త్రైమాసికానికి ఒక ఆఖరి పరీక్ష వుంటుంది.ఇప్పటికి ఓ యాభై గంటల తరగతులు నడుచుంటాయి.దానికే పిల్లగాళ్ళందరూ తెలుగు ఇరగ దీసేస్తున్నారు. ఘనత ఏదన్న వుందంటే అది సిలికానాంధ్ర వారి మనబడి కార్యవర్గానికే చెందుతుంది.
రెండవ త్రైమాసిక పరీక్షల్లో భాగంగా ఖాళీలను పూరింపుము అనే వర్గములో పైన సైకిలు బొమ్మ చూపించి కింద __కిలు అని ఇవ్వబడింది. ఓ బుడ్డోడు (మా బుడ్డోడు కాదు )ఆ బొమ్మను చూడగానే వాడి బైక్ గుర్తొచ్చిందేమో బైకిలు అని రాసి పడేశాడు. అంటే అమెరిక బైక్ ని తెలుగైజ్ చేసేశాడన్నమాట.
బైక్: అమెరికా దేశంలో మన సైకిలును బైక్ అందురు.:::::::::

14 comments:

puttagunta said...

Vihaari gaaru. Amerika lo sainikulani Bike antaara??..Ee vishayam theliyadandee.

Oka saradaa sannivesam dwaara oka kottha word teliya parichinanduku..dhanyavaadhamulu.

Sorry...parichayam ivvaledhu kadhaa..

Naa paru Rajiv andi.Mee laagey Denver lo vuntunna. Bahusaa work chesedhi kooda mee company ye anukunta.

Mee paatha tapaalu (manchu kurise velalo and pandu..baby pandu) ki raasina comments choosthey..meeku avagatham avuthundhi.

puttagunta said...

Sorry...nenu sainikulu anukunnaa...Ippudu ardham ayyindhi.

కొత్త పాళీ said...

ఓ మేన్‌ .. ఇంతలాగ ఈ మధ్య విరగ బడి నవ్వ లేదు!!!
ఇంకా నయం ఈ టపా ఆఫీసులో ఉన్నప్పుడు ప్రచురించావు గాదు!
అన్నట్టు .. ఈ మాసికాల గొడవేవిటి నాయనా? తెలుగు మీద అంత అభిమానం ఉన్న వారు అంతకంటే మంచి పేరు సూచించలేరూ?
ఇంకో అన్నట్టు - ఈ వాక్యం ఏదో తికమకగా ఉంది .. కోంచెం పరిశీళించు!
"అమెరికాలో పిల్లలకు తెలుగు నేర్పడానికి సిలికానాంధ్ర వారు పలు రాష్ట్రాల్లో మనబడి అనే కార్యక్రమం ద్వారా పిల్లలకు తెలుగు నేర్పుతున్నారు."

నాగరాజా said...

తండ్రికి తగ్గ(ని) తనయుడు అనిపించుకున్నాడు కదా!!

ఒంటరి చుక్క(వెంకట్) said...

బైకిలాండీ హ్హహ్హ.....నిజంగా మూడ్ ఆఫ్ అయినపుడు మీతపాలు చదవాలండి

నిషిగంధ said...

:))) నాకూ చాలా రోజులవరకూ సైకిల్ ని బైక్ అంటారని తెలియలేదు.. అప్పట్లో మా పక్క అపార్ట్ మెంట్లో ఒక తెల్లామె ఉండేది.. చాలా ఫ్రెండ్లీగా మాట్లాడేది.. ఒకరోజు చెప్పింది, ఒక ఇరవయ్యో, ముప్పయ్యో పౌన్లు తగ్గాలని తెగ వర్కౌట్ చేసేస్తున్నానని.. కాస్త గర్వంగా 'పొద్దున్నే ఓ 5 మైళ్ళు, సాయంత్రమో 5 మైళ్ళు బైక్ రైడింగ్ కూడా చేస్తున్నానని చెప్పింది.. ఇక చూడండి, నాకు ఒకటే డౌట్లు! అసలు వీళ్ళ ఇంట్లో బైక్ చూశిన పాపానే పోలేదు, దాన్ని ఎక్కడ పార్క్ చేస్తారు, అయినా బైక్ మీద ఝాం ఝామ్మని తిరిగితే ఒళ్ళు తగ్గటమేమిటని!! 'అంతా కలికాలం' అనుకుని మావారితో చెప్తే అప్పుడు అసలు ట్రాన్స్ లేషన్ చెప్పారు!!

Anonymous said...

@ అయ్యా రాజీవ్ గారు,

మీరసలు నిద్ర పోతున్నట్టు లేదు. వెంటనే ఓ బ్లాగు మొదలు పెట్టండి. ప్రతి రోజూ మీకు నా సహాయ సహకారాలు అందిస్తాను.

@ కొత్తపాళి,

అదే మరి!!! భారత్ వున్నప్పుడు క్వార్టర్లు క్వార్టర్లు చదివేసి అమెరికా వచ్చి మాసికాలు బాసికాలు అంటారా.
ఇక వాక్యం చూస్తే బానే వుందే.మన బడి కార్యక్రమం అంటే అన్నిచోట్లా వాలెంటీర్లను పెట్టి చదువు చెప్పించడం.

@ నాగ రాజు గారు,

నిన్న (ఈ టపా రాసిన రోజు) వెయ్యి లైన్ల కోడ్ రాసి కాస్త విరామం కోసం ఈ టపా రాసా. అందుకే స్పష్టంగా రాయలేక పోయానేమో. బుడ్డోడు మా వోడు కాదు.

@ వెంకట్ గారు,

నెనర్లు. మీరలా సెలవిచ్చి నన్ను రెండు ఇంచీలు పైకి లేపుదామనే? :-)

@ నిషిగంధ గారు,

వ్యాఖ్యానించినందుకు నెనర్లు. ఇలాంటి తెలియని విషయాలు అమెరికాలో వున్నంత వరకు ఎదురవుతూనే వుంటాయి.

-- విహారి

puttagunta said...

Vihaari garu...modhalu pettataniki inka samayam vundhandi.

Mana peddalu annattu

Avagaahana...Pariseelana...Aacharana (Analysis...Development...Implementation)

Nenu prasthutham 2nd phase lo vunnanu.

రాధిక said...

మా పక్క ఇంట్లో ఒక అరవ పిల్ల వుంటుంది.ఒక రోజు వచ్చి "యువర్ సన్ ఈస్ కిల్లింగ్ మీ" అంటూ కంప్లయింట్ చేసింది.ఏమిట్రా అని ఆరాతీస్తే మావాడు ఆ అమ్మాయిని గిల్లుతున్నాడట.తమిళంలో గిల్లడాన్ని "కిల్లి"అనేదో అంటారట."హి ఈస్ పించింగ్ మి "అనడానికి తమిళం కలిపి కిల్లింగ్ అంది.ఇలాంటి తెలివి తేటలు[?]చూసి నవ్వుకోవాలో,బాధపడాలో తెలియట్లేదండి.మావాడు ఈ మధ్య ఇంగ్లీషులో తెలుగు కలిపి మాట్లాడేస్తున్నాడట.మావారు ఒకటే గోల పెడుతున్నారు.వాడికి ఏదో ఒక భాష సరిగ్గా నేర్పు అని.
నిషి గారూ అలాగే ఇక్కడ బిస్కట్లని క్రేకర్స్ అంటారుగా.నేనేమో క్రేకర్స్ అంటే బాణాసంచా అనుకునేదానిని.:)

నాగరాజా said...

సైకిలోపాఖ్యానం చదివి చక్కటి టపా వ్రాసినందుకు నెనరులు.

రాకేశ్వర రావు said...

యధా ప్రశ్నో తధా ఉత్తరః)

రానారె said...

బైకిలా! :-)))
వీడే సిసలైన ప్రవాసభారత ప్రతినిధి.

అబ్రకదబ్ర said...

రాధిక,

మీరు బిస్కట్ల గురించి చెబితే గుర్తొచ్చింది. నే వచ్చిన మొదట్లో నాతో పనిచేసే తెల్లాయన వాళ్లింట్లో ఏదో ఫంక్షన్ కి పిలిస్తే వెళ్లా. అంతా కొత్తవాళ్లే. నేను చేతులు నులుముకుంటూ బిక్కు బిక్కుమని ఓ మూల నిలబడున్నా. ఆకలి దంచేస్తుంది. అంతలో ఓ తెల్లావిడొచ్చి 'కుకీస్ ఎవరెవరిక్కావాలి' అని అడిగి లెక్కేసుకునెళ్లింది. ఈ కుకీస్ ఏంటో నాకు తెలీదు. దాంతో నాకెందుకులే అని ఊరుకున్నా.

కాసేపటికి ఆ తెల్లావిడ మళ్లీ వచ్చింది - ట్రే నిండా బిస్కట్లు నింపుకుని. అందరికీ ఇస్తూ నాకు అటు, ఇటు ఉన్నవాళ్లకి కూడా ఇచ్చింది. నా ముఖాన మాత్రం ఓ చిరునవ్వు పడేసి వెళ్లిపోయింది. 'అందరికీ బిస్కట్లిచ్చి నాకు మాత్రం ఇవ్వదా. ఇంత రేసిజమా?' అనుకుంటూ ఉడికిపోయాను కాసేపు. బిస్కట్లే కుకీస్ అని నాకేం తెలుసు? పాపం నేను కుకీస్ వద్దన్నానని ఆమె నాకు వేరే ఏదో ప్రత్యేకంగా తీసుకొచ్చింది మరి కాసేపట్లో.

ఇలాంటివే మరెన్నో అనుభవాలు కొత్తలో. అమెరికాలో అడుగు పెట్టిన మొదటి రోజు శాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్ పోర్టులో 'ఎక్కడికి వెళుతున్నారు?' అనడిగిన ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్ తో 'శాన్ జోస్' అని స్వచ్చమైన తెలుగు యాసలో చెప్పటం (ఇండియాలో ఉండగా ఈనాడు పేపర్లో చదివి నేర్చుకున్నా ఆ ఊరి పేరలాగే పలకాలని), అదేంటో అర్ధం కాక అతను మళ్లీ మళ్లీ అడగటం, నేనూ తగ్గకుండా మరింత స్పష్టంగా 'శాన్ జోస్, శాన్ జోస్' అని చెప్పటం .. ఎట్టకేలకి నాతో స్పెల్లింగ్ చెప్పించుకుని 'ఓహ్. యు మీన్ శాన్ హొసే?' అంటూ అతనో నవ్వు నవ్వి నా పేపర్లమీద స్టాంపు వేయటం .... దశాబ్దం తర్వాత కూడా నిన్ననే జరిగినట్లనిపించే విషయాలివన్నీ.

ప్రసాద్ said...

విహారి గారూ,

హాస్యాన్ని అద్భుతంగా వండి పడేస్తున్నారు. చదువుతున్న వారి జ్ఞాపకాలు కూడా వెలికి తీస్తున్నారు.

ఎప్పుడు మాంసాహారం వాసనే ఎరుగని మా కోమటి మిత్రుడొకాయన ఓ సారి పెప్పరోనీ పిజ్జా తెప్పించి ఇది నాకు బాగా ఇష్టం మీరూ తినండి అంటే నోట్లో పెట్టుకొని ఇందులో ఖచ్చితంగా ఏదో మాసం వుంది అని మా ఆవిడ వూసేసి నోరు కడిగేసుకొంది. వచ్చిన కొత్తలో ఎందులో గొడ్డు మాంసం వుంటుందో తెలియక చాలా జాగ్రత్తగా తెలిసినవి మాత్రమే తినేవాళ్ళం.

ఆ తర్వాత పెప్పరోనీ మీద పరిశోధన చేస్తే తెలిసింది అది పంది మాంసం అని. అయినా మా మిత్రుడు చాలా రోజులు మేము చెప్పింది నమ్మలేదు.

(కొత్తపాళీ గారు చెబుతున్నది ఆ వాక్యంలో రెండు సార్లు వచ్చిన "తెలుగు నేర్పడం" గురించనుకుంటా. ఇలా వుండాలనుకుంటా. "అమెరికాలో సిలికానాంధ్ర వారు పలు రాష్ట్రాల్లో మనబడి అనే కార్యక్రమం ద్వారా పిల్లలకు తెలుగు నేర్పుతున్నారు.")

-- ప్రసాద్
http://blog.charasala.com