ఈ వారం సిద్ధ బుద్ధ (బ్లాగు బొట్లు)
:::::::::
"ఆయ్యగారూ సీజన్ కాక పోయినా మన తోటలో మల్లె చెట్టు విరగ పూసింది"
"మల్లె పూవు మల్లె పూవు అంటారు అది నల్లబడితే ఎవరు దాన్ని చూస్తారు?..."
"మీరు చాలా రోజులుగా ఈ మల్లెలు పూయడం కోసం చూస్తున్నారు కదా?"
"ఎన్నాళ్ళో.... వేచిన ఉదయం ఈనాడే... ఎదురవుతుంటే...ఇన్ని నాళ్ళు దాగిన హృదయం.."
"ఆ చీకటిలో ఎందుకు కూచుంటారు ఇలా బయటికొచ్చి కూచోండి .."
"చీకటిలో కారు చీకటిలో కాలమనె కడలిలో శోకమనె పడవ లో ఏదరికో .... ఏ దిశకో ...."
"మీ మనసు కేదో అయింది కాస్త చల్ల గాలి కోసం బయటికెళ్ళొద్దాం రండి"
"పిల్ల గాలి ఊదింది పిల్లంగ్రోవీ.... పల్లవించింది ఊగింది గున్న మావీ... మా పల్లె మారింది రేపల్లెగా మనసేమో పొంగింది పాల వెల్లిలా ..."
"ఆ పాటలు చాలు గానీ ఇలా రండి.."
"ఇదే పాటా... ప్రతీ చోటా.. ఇలాగే పాడుకుంటాను..పలకలేను వలపులన్నీ పాటలో దాచుకుంటాను.."
"పాడుదురు గానీ .. రండి అలా కారులో ఊరు చుట్టి వద్దాము"
"కారున్న మైనరు... కాలం మారింది మైనరు.. మా చేతికి వచ్చాయి తాళాలు..."
"ఏడుకొండల వాడా ఏంటయ్యా మా అయ్యగారిని ఇలా చేశావు "
"ఏడు కొండలవాడా వెంకటేశా అయ్యా ఎంత పని చేశావు తిరుమలేశా... చెట్టు మీది కాయలు సముద్రమ్లో ఉప్పులు.."
"మీరలా పరాగ్గా వుంటే బావుండదు "
"బహు పరాక్ .. రాజూ వెడలె రభసకు టడ్డడాయ్..టడ్డడాయ్. రాజు వెడలె రవి తేజము లలరగ కుడి ఎడమల డాల్ కత్తులు మెరయంగా… రాబందుల గుండెలు దడ దడ లాడగ ..."
"మీరేదో లోకంలో వున్నట్టున్నారు"
"అదిగో నవలోకం వెలసే పిలిచే......"
"ఏంటి నాటకాలు గానే వేస్తున్నారా?"
"కనపడని చెయ్యేదో... నడుపుతోంది నాటకం. ఆ నాటాకాన నువ్వు నేనూ ఆట బొమ్మలం.... కీలు బొమ్మలం...."
"ఏంటి జీవితం మీద విరక్తి కల్పిస్తున్నారు నాకు"
"ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరూ సొంతమూ..ఎంతవరకీ బంధమూ..."
"ఇప్పుడర్థమయింది.మీ మనసుకో మంచి మాట శోభన్ బాబు గురించి చెప్పనా?"
"శోభన్ బాబు గురించయితే ఎంతయినా చెప్పు."
"స్వర్గం లో ఇంద్రుడు చాలా కంగారుగా వున్నాడట"
"శోభన్ బాబు గురించి చెప్పమంటే ఇంద్రుడు గురించి చెబ్తావే పరాచకాలాడకు "
"శోభన్ బాబు వల్లే ఇంద్రుడు కంగారు పడుతున్నాడు."
"అయ్యో ఏందుకు?"
"ఇంద్రుడి దగ్గరున్న రంభ , ఊర్వశి, మేనక, తిలోత్తమ తదితర అందాల రాశులందరూ ఇంద్రుడిని వదిలేసి వెళ్ళి పోతున్నారట"
"దానికి శోభన్ బాబు కు సంబంధమేంటి?"
"అందాల నటుడు డ్రీం బాయ్ వస్తున్నాడని ఆయన్ని చూడ్డానికి వెళ్ళిపోయారట ఇంద్రుణ్ణి ఎవరూ పట్టించుకోవడం లేదట"
"హహ్హ హహ్హ హ్హా..హహ్హ..మరి మా సోగ్గాడు 'చరణ కింకిణులు గల్లు గల్లు మన...' అని పాడితే ఆ ఉడుగ్గాడు (ప్రతి దానికి ఉడుక్కుంటాడు ఉద్యోగం పోతుందేమో అని) కుళ్ళు కోడా. ఇక స్వర్గం లో వున్న వాళ్ళు డ్రీం బాయ్ ఎవరంటే చూపడానికి వేలు భూమి మీదకి పెట్టి చూపనక్కర లేదు. ఇదిగో మన పక్కనే వున్నాడు అంటారు."
:::::::::
సినీ మాయా జగత్తులో గ్లామర్, ఇమేజ్ అనే భయంకరమైన వ్యసనాల రుచి చూసినా కాలి గోటితే నెట్టేసి, తాను వద్దనుకున్న తరువాత తన సమీపం లోకి కూడా రానీయకుండా అదుపులో పెట్టగలిగిన విలక్షణమైన వ్యక్తి మరింక పుట్ట బోడంటే అతిశయోక్తి కాదు. నటులు వస్తారు పోతారు. ఇమేజ్ కోసం స్వంత వ్యక్తులను గాలికి వదిలేస్తారు. అసలు రంగు వేసుకున్నవాళ్ళు నిజ జీవితం లో నటించని వాళ్ళుంటారని కుటుంబం విలువేంటో ఈ తరం వాళ్ళకు చాటి చెప్పిన శోభన్ బాబు గారు స్వర్గస్తులయ్యారంటే నమ్మ బుద్ది కావటం లేదు. అంతటి వ్యక్తి గురించి ఎంత ఆపుకుందామన్న ఆగని ఆశ్రువులు. అందుకే ఆయనకు అంజలి ఘటిస్తూ ఆయనను గుర్తు చేసుకుంటూ ఆశ్రువులలో కొన్ని ఇలా బ్లాగు బొట్ల రూపంలో ....
:::::::::
9 comments:
beuatiful tribute.
well done.
beuatiful tribute.
well done
బాధతో చెప్పినా బ్లాగ్బొట్లు బొబ్బట్లలా బెమ్మాండంగా వున్నాయ్.
బ్యూటిఫుల్ ట్రిబ్యూట్. మీ అభిమానాన్ని శోభన్బాబంత అందంగానే తెలియజేశారు.
విహారి గారూ నేను నావంతుగా శోభన్ బాబుకు ఇలా నివాళి అర్పించాను.వీలున్నప్పుడు చూడగలరు.
http://navatarangam.com/?p=260
విహారి,
చాలా బాగా వ్యక్తీకరించారు.
నిజమే, చాలా విలక్షణమైన నటుడు. మీ నివాళి ఇంకా విలక్షణంగా ఉంది.
A HANDSOME EULOGY TO HANDSOME GUY.
శొభన్ బాబు పాటలంటే నాకు చాలా చాలా ఇష్టం.. ఆ పాటలతో విన్నూత్నంగా నివాళి అర్పించారు.. చాలా బావుందండి!
Post a Comment