Wednesday, June 13, 2007

కామెంటు అవిడియాలు.

:


ఈ మధ్య తెలుగు బ్లాగులు కుప్పలు తెప్పలు గా వచ్చేస్తున్నాయ్. ఇదొక మంచి పరిణామం. ఏదో ఒకటి బరుకుతూనే వున్నారు. వార్తలు చదివడం తక్కువయిపోయి బ్లాగులు పట్టుకుని వేలాడే వాళ్ళెంత మందో. నా మటుకు నేనయితే మొన్నా మధ్య ఆఫీసులో కోడ్ రాస్తూ Clob datatype తో variable ఎలా డిక్లేర్ చేశానంటే clob_data బదులు blog_data అని. కంపైల్ చేస్తే ఇంకే ముంది? స్క్రీన్ నిండా అక్షింతలే. అలా బ్లాగులు చదివి అలసిపోయి వ్యాఖ్యలు రాయడానికి సమయం లేకుండా పోతున్న వాళ్ళ కోసం రాసింది ఇది. చెప్పాలనుకున్నది inscript లోనో RTS లోనో టైపు చేసి రాసే బాధ తప్పించుకోడానికి కొన్ని మార్గాలు అన్వెషించా. అన్నింటికి పుట అక్షరాలు కనిపెడితే ఎలా వుంటుంది అనే “మంచి దుర్మార్గపు” ఆలోచన వచ్చింది.(దుర్మార్గులలో కూడా మంచాళ్ళుంటారని అందరూ సహృదయత అర్థం చేసుకుంటారు కదూ). ఈ పుట అక్షరాలనే SMS లో వాడుతారు కదా. కొంచెం తిలకించండి. వీలయితే మీరూ కలపండి.


1. బా. (బావుంది)
2. చా.బా. (చాలా బావుంది)
3. చా.చా.బా (చాలా చాలా బావుంది)
4. అ.వు. (అధ్భుతంగా వుంది)
5. మ.వు. (మహాద్భుతంగా వుంది)
6. ఏ. (ఏడ్చినట్లుంది)
7. బా.రా. (బాగా రాసారు)
8. చా.బా.రా.(చాలా బాగా రాసారు)
9. అ.రా. (అద్భుతంగా రాసారు)
10. చ. (చండాలంగుంది)
11. చా.చ. (చాలా చండాలంగుంది)
12. బా.చె. (బాగా చెప్పారు)
13. చ.బా.చె. (చాలా బాగా చెప్పారు)
14. సూ. (సూపర్)
15. సూ.సూ. (సూపరో సూపరు)
16. అరి. (అదిరింది)
17. ఆ.చే.వ్యా.(ఆలోచింప చేసే వ్యాసం)
18. వీ.బు.రా.(వీళ్ళకు బుద్ది రాదు)
19. బా.నా. (బాగా నవ్వించారు)
20. బా.లో.సు.(బ్లాగు లోకానికి సుస్వాగతం)
21. అర్స్. (అదుర్స్)
22. అ.గొ.సా. (అదర గొట్టే సారు)
23. మ.వ్య.అ.ధ్య.(మంచి వ్యాసం అందించినందుకు ధన్యవాదాలు)
24. హ1 (హహ్హ)
25. హ2 (హ..హ్హ..హ్హ)
26. ఆ.ట. (ఆలోచింప చేసే టపా)
27. చి. (చిమపెశావ్ పో)
28. మ.ట.ఎ.(మరిన్ని టపాల కోసం ఎదురుచూస్తూ)
29. మీ.వి.చా.బా.(మీ విశ్లేషణ చాలా బావుంది)
30. మీ.హా. (మీకు హ్యట్సాఫ్)
31. మీ.బ్లా.నా.బ్లా.ఒ. (మీ బ్లాగు నాకు నచ్చిన బ్లాగుల్లో ఒకటి)
31. మీ.క.చా.బా. (మీ కవితలు చాలా బావుంటాయి)
32. చా.రో.మ.ట. (చాలా రోజులకు మంచి టపా చూసా.)

9 comments:

Unknown said...

మీ.బ్లా.నా.బ్లా.ఒ.
-నేనుసైతం
http://nenusaitham.wordpress.com

త్రివిక్రమ్ Trivikram said...

అ.గొ.శా.
మీ.హ్యా.

సత్యసాయి కొవ్వలి Satyasai said...

భమంట. - భలే మంచి టపా

Anonymous said...

ట.రా.వ. ట... ఈ టపా రాసిన వాడు టపా[img]http://www.websmileys.com/sm/happy/068.gif[/img]

రాధిక said...

సూ.సూ. (సూపరో సూపరు)

వీవెన్ said...

మవు, అరా, బాన, అగొసా, హ999, చి, మీహా!

సిరిసిరిమువ్వ said...

మరి కొన్ని అవిడాయాలు

న.చ.బా (నవ్వలేక చస్తున్నామండి బాబూ).

క.క.కి (కత్తి కటారీ కిసుక్).

మం.స.అం (మంచి సమాచారం అందించారు).

ఈ.ట. చా.హా (ఈ టపా చాలా హాటు గురూ)

netizen నెటిజన్ said...

అస్సలు బాలేదు. airtel వాడు తెల్గులో ఎస్ ఎం ఎస్ అంటున్నాడు.
భాష will die.
అక్షరాలు will dye.
lingo will die.
Don't say as if it is not dead as it is.

spandana said...

అమ్మో నవ్వలేక చచ్చా!
ఎలా వస్తోయో మీకిలా నవ్వించి చంపొచ్చనే అవిడియాలు!
ఇంకేం వీవెన్ మొదలెట్టిన "తెలుగుపదం"లా మీరూ మొదలెట్టండి ఒక "పుటాక్షరం".

-- ప్రసాద్
http://blog.charasala.com